న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్ ఇటీవలే తన విండోస్ ఫోన్లు విక్రయించడాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లపై ఎక్కువగా దృష్టిసారించనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ తన కంపెనీ స్టోర్లలో ఆండ్రాయిడ్ డివైజ్‌లను విక్రయించడం ప్రారంభించింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8ను మైక్రోసాఫ్ట్ విక్రయించడం ప్రారంభించిందని తెలిసింది. గెలాక్సీ నోట్ 8 మైక్రోసాఫ్ట్ స్టోర్‌లోకి వచ్చిన తర్వాత రేజర్ ఫోన్‌ను, శాంసంగ్ గెలాక్సీ ఎస్8ను, గెలాక్సీ ఎస్8 ప్లస్‌ను విక్రయించడం ప్రారంభించిందని రిపోర్టులు పేర్కొన్నాయి.
ఎస్8ను 725 డాలర్లకు, ఈ డివైజ్‌లో అతిపెద్ద దాన్ని 825 డాలర్లకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. శాంసంగ్ వెబ్‌సైట్‌లో కూడా ఇవే ధరలున్నాయి. మైక్రోసాఫ్ట్ బ్లాక్ ఫ్రైడే డీల్స్ సందర్భంగా గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై బిగ్ డిస్కౌంట్‌ను కూడా ప్రకటించింది. 150 డాలర్ల తగ్గింపుతో ఈ డివైజ్‌లను అందుబాటులో ఉంచింది. అదనంగా ఏటీ అండ్ టీ, వెరిజోన్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment