
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' (Bill Gates).. 1975లో హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టినందుకు చాలా బాధపడినట్లు, ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. కాలేజీ రోజులు చాలా అద్భుతంగా గడిచాయని పేర్కొంటూ.. 'సోర్స్ కోడ్: మై బిగినింగ్' (Source Code: My Beginnings) అనే పుస్తకంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
మనస్తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్రకు సంబంధించిన తరగతులను హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంతగానో ఆస్వాదించాను. తెలివైన వ్యక్తులతో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. రాత్రి సమయంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించుకునే వాళ్ళం. 1975లో సాఫ్ట్‌వేర్ కంపెనీ మొదటి సీఈఓగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. యూనివర్సిటీలో చదువు మానేయాల్సి వచ్చింది. ఆ నిర్ణయం నన్ను బాధించిందని బిల్ గేట్స్ అన్నారు. అయితే డిగ్రీ పూర్తి చేయడానికి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్లాలనిపించినా.. అది సాధ్యం కాలేదు.
బిల్ గేట్స్.. తన మిత్రుడు 'పాల్ అలెన్'తో కలిసి కంప్యూటర్ల కోసం ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను సృష్టించగలిగితే, ఆ రంగంలో ముందంజలో ఉండవచ్చని భావించి.. రెండేళ్లు కృషి చేశారు. ఆ సమయంలో చదువును బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో.. చదువు మానేయాల్సి వచ్చింది. అయితే టెక్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగారు.
ఇదీ చదవండి: ఇలాంటి జాబ్ చేయడం సాధ్యమేనా?.. కంపెనీ ఆఫర్‌పై నెటిజన్లు ఫైర్!
సోర్స్ కోడ్: మై బిగినింగ్ పుస్తకం విషయానికి వస్తే.. ఇది మొత్తం మూడు భాగాలుగా వచ్చే అవకాశం ఉంది. ఈ బుక్ మొదటి భాగంలో బిల్ గేట్స్ చిన్న నాటి విషయాలు, యూనివర్సిటీలో చదువు, ప్రయోగాలకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఉద్యోగం, మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన విషయాలతో పాటు.. మెలిందా గేట్స్‌తో వివాహం వంటి మరిన్ని విషయాలు.. ఆ తరువాత వచ్చే పుస్తకాల్లో ఉండే అవకాశం ఉంది.
బిల్ గేట్స్ 2000లో పదవీవిరమణ చేసే వరకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా సంస్థను ముందుకు నడియాపారు. ఆ సమయంలో కంప్యూటర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. ఇదే బిల్ గేట్స్‌ను ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా నిలబడేలా చేసింది. ప్రస్తుతం కంపెనీ విలువ మూడు ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment