పోటాపోటీగా ఒకే రోజు వస్తున్న ఆ ఫోన్లు
పోటాపోటీగా ఒకే రోజు వస్తున్న ఆ ఫోన్లు
Published Tue, Sep 5 2017 6:49 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలు ఆపిల్, శాంసంగ్‌లు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. పోటాపోటీగా ఒకేరోజు ఈ రెండు స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలు తమ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయబోతున్నాయి. అయితే దీనిలో ఒక లాజిక్ ఉంది. ఆపిల్ తన అభిమానులు ఎంతో కాలంగా వేచిచూస్తున్న కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 12న కాలిఫోర్నియాలో లాంచ్ చేస్తుండగా.. శాంసంగ్ అత్యంత ప్రతిష్టాత్మక మార్కెట్ అయిన భారత్‌లో తన గెలాక్సీ నోట్ 8ను విడుదల చేస్తుంది. డీలర్ వర్గాల సమాచారం మేరకు శాంసంగ్ ఈవెంట్ పేరు చెప్పకుండా.. ఆహ్వానాలు పంపుతుందని తెలిసింది.
ఈ ఆహ్వానాల మేరకు శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ డివైజ్‌నే లాంచ్ చేయబోతుందని తెలుస్తోంది. ఐఫోన్8 లాంచ్ గురించి ముందే తెలిసిన శాంసంగ్, సెప్టెంబర్ 12నే ఈ లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటుచేసిందని మార్కెట్ వర్గాల టాక్. భారత్‌లో శాంసంగ్‌కు బలమైన స్థానం ఉంది. 43 శాతం మార్కెట్ షేరుతో ఆధిపత్య స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు శాంసంగ్‌కు ఎప్పడికప్పుడూ ఆపిల్ గట్టిపోటీ ఇస్తూనే ఉంది. ఆగస్టులో అంతర్జాతీయంగా లాంచ్ అయిన గెలాక్సీ నోట్ 8 ప్రస్తుతం భారత్‌లోకి వస్తుంది. ఆపిల్ ఐఫోన్ 8 మరీ భారత్‌లోకి ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియరాలేదు.
శాంసంగ్ తన గెలాక్సీ నోట్ 8ను బిక్స్బీ ఇంటిలిజెంట్ అసిస్టెంట్, వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌తో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 6.3 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 64 బిట్ ఎక్సీనోస్ 8895 ఆక్టాకోర్ ప్రాసెసర్ చిప్‌సెట్, 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, దీనిలో ఫీచర్లు.
Advertisement
Advertisement