7 ఏళ్ల వివాదానికి దిగ్గజాలు స్వస్తి | Apple, Samsung Settle 7-Year Patent Battle Over iPhone Design | Sakshi
Sakshi News home page

7 ఏళ్ల వివాదానికి దిగ్గజాలు స్వస్తి

Published Thu, Jun 28 2018 11:25 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

Apple, Samsung Settle 7-Year Patent Battle Over iPhone Design - Sakshi

ఆపిల్‌ - శాంసంగ్‌

ఐఫోన్‌ డిజైన్‌ విషయంలో సుదీర్ఘకాలంగా జరుగుతున్న వివాదాన్ని ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజాలు ఆపిల్‌, శాంసంగ్‌ పరిష్కరించుకున్నాయి. ఏడు ఏళ్లుగా సాగుతున్న ఐఫోన్‌ డిజైన్‌ పేటెంట్‌ వివాదానికి స్వస్తి పలికాయి. అమెరికా కోర్టు ఫైలింగ్‌లో ఇరు కంపెనీలు ఈ విషయాన్ని తెలిపాయి. ఐఫోన్‌ ఫీచర్లు కాఫీ చేసిందన్న కారణంతో సుమారు రూ.3700 కోట్లను శాంసంగ్‌, ఆపిల్‌కు చెల్లించలాని గత నెలలోనే ఫెడరల్‌ కోర్టు జ్యూరీ ఆదేశించింది. ఈ ఆదేశాల అనంతరం ఇరు కంపెనీలు తమ సమస్యను పరిష్కరించుకున్నాయి. అయితే ఎంత మొత్తంలో ఈ సెటిల్‌మెంట్‌ చేసుకున్నాయో ఇంకా తెలియరాలేదు. ఈ కేసులో మిగిలి ఉన్న అన్ని వాదనలు, ప్రతికూలతలను కొట్టివేస్తున్నట్టు అమెరికా జిల్లా కోర్టు జడ్జి లూసీ కో తెలిపారు. 

ఇదే విషయంపై మరోసారి ఎలాంటి న్యాయ చర్యలకు సిద్ధం కాకూడదని చెప్పారు. అంతేకాక ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి అటార్నీల ఫీజులు, వ్యయాలను ఇరు పార్టీలే భరించాల్సి ఉంటుందని కో అన్నారు. ఈ కేసు నగదుకు మించిదని ఏఎఫ్‌పీ పేర్కొంది. 2011 నుంచి ఆపిల్‌, శాంసంగ్‌లకు మధ్య ఈ వివాదం ప్రారంభమైంది.  ఈ  కాగ, శాంసంగ్‌పై ఆపిల్‌ నమోదు చేసిన ఫిర్యాదులో ఐఫోన్‌కు చెందిన ఫీచర్లను, డిజైన్‌ను ఇది కాఫీ చేస్తుందని ఆరోపించింది. సుప్రీం కోర్టు అనుమతితో ఈ కేసును జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement