patent dispute
-
పేటెంట్ వివాదానికి స్వస్తి : షేరు దూకుడు
సాక్షి,ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు కాలం కలిసి వస్తోంది. తాజా పరిణామాలతో శుక్రవారం నాటి మార్కట్లో హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ డా.రెడ్డీస్ షేరు దూసుకు పోతోంది. వరుసగా నాల్గోరోజూ కొనుగోళ్ళ మద్దతుతో 5 శాతానికి పైగా ఎగిసి రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఇటీవల నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్ తయారీ ఒప్పందానికి తోడు, అమెరికాకు చెందిన సెల్జీన్తో వివాదం పరిష్కరించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అధికారికంగా ప్రకటించింది. సెల్జీన్తో వివాదం పరిష్కరించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ గురువారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్ల ఆసక్తిభారీగా నెలకొంది. ('స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ : డా.రెడ్డీస్ భారీ డీల్) కేన్సర్ వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ‘రెవ్లీమిడ్’ ఔషధంపై యూఎస్ కంపెనీ ‘సెల్జీన్’ తో డాక్టర్ రెడ్డీస్‌కు పేటెంట్ వివాదాన్ని తాజాగా పరిష్కరించుకుంది. వ్యాజ్యం లోని అన్న అసాధారణమైన వివాదాల పరిష్కారం, రెగ్యులేటరీ ఆమోదానికి లోబడి డీల్ కుదిరినట్టు తెలిపింది. దీంతో 2022 మార్చి తరువాత ప్రపంచంలోని ‘టాప్-10’ ఔషధాల్లో ఒకటైన ‘రెవ్లీమిడ్’ ఔషధంపై సెల్జీన్ యూఎస్ మార్కెట్లో విక్రయించే అంశంపై ఇరు కంపెనీలు ఒప్పందాన్ని ఆమోదించినట్టు తెలిపింది. తద్వారా 2022 మార్చి తర్వాత యూఎస్‌లో ‘రెవ్లీమిడ్’ జనరిక్ ఔషధం విక్రయాలకు డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి లభించింది. అలాగే 2026 జనవరి 31 వరకు కొంత పరిమితితోను. ఆ తర్వాత పరిమితి లేకుండా విక్రయం చేసుకోవచ్చని డాక్టర్ రెడ్డీస్ నార్త్ అమెరికా జెనెరిక్స్ సీఈఓ మార్క్ కికుచి చెప్పారు. మల్టిపుల్ మైలోమా, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్, మాంటిల్ సెల్ లింఫోమా, ఫోలిక్యులార్ లింఫోమా లాంటి కేన్సర్ వ్యాధుల చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. కాగా వరుస నష్టాలకు చెక్ చెప్పిన లాభాల మార్కెట్లో నిఫ్టీ ఫార్మా దాదాపు 4 శాతం ఎగిసింది. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సిప్లా సన్ ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి. -
ఎం అండ్ ఎండ్‌కు పేటెంట్ షాక్
అమెరికాలో దేశీయ ఆటో మేజర్ మహీంద్ర అండ్ మహీంద్రకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై విచారణ చేపట్ట నున్నామని అమెరికా రెగ్యులేటరీ అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్ మంగళవారం ప్రకటించింది. జీప్ డిజైన్ విషయంలో అమెరికా వాహన దిగ్గజం ఫియట్ క్రిస్లర్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ విచారణ చేయనున్నట్టు తెలిపింది. జీప్ రూపకల్పనలో మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించిన వివాదంలో మహీంద్రా అండ్ మహీంద్ర లిమిటెడ్ ఉత్పత్తి చేసిన ఆఫ్-రోడ్ యుటిలిటీ వాహనం రోక్సార్కి సంబంధించి పేటెంట్-సంబంధిత దర్యాప్తును ప్రారంభించనున్నట్టు ఇంటర్నేషనల్ ట్రేడ్ కమీషన్ (ITC) ఒక ప్రకటనలో తెలిపింది. 45 రోజుల వ్యవధిలో దాని దర్యాప్తును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మొదట్లో ఈ వార్తలను కొట్టి పారేసిన ఎంఅండ్‌ఎండ్ ఈ అంశాన్ని ధృవీకరించింది. ఫియట్ క్రిస్లెర్ ఫిర్యాదుపై ఐటిసి దర్యాప్తు చేపట్టనుందని మహీంద్ర ఆటోమోటివ్ ఉత్తర అమెరికా మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు రిచ్ అన్సెల్ వెల్లడించారు. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు ఫియట్ క్రిస్లర్ అందుబాటులో లేదు. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో ఎం అండ్ ఎం షేరు 2 శాతానికిపైగా నష్టపోయింది. కాగా అమెరికాలో మహీంద్రా రోక్సార్ విక్రయాలను నిలిపివేయాలని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్‌ను ఫియట్ క్రిస్లర్ ఇటీవల ఆశ్రయించింది. తమ అనుబంధ సంస్థ జీప్ డిజైన్లను మహీంద్రా వాడుకుందని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
7 ఏళ్ల వివాదానికి దిగ్గజాలు స్వస్తి
ఐఫోన్ డిజైన్ విషయంలో సుదీర్ఘకాలంగా జరుగుతున్న వివాదాన్ని ప్రపంచ స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలు ఆపిల్, శాంసంగ్ పరిష్కరించుకున్నాయి. ఏడు ఏళ్లుగా సాగుతున్న ఐఫోన్ డిజైన్ పేటెంట్ వివాదానికి స్వస్తి పలికాయి. అమెరికా కోర్టు ఫైలింగ్‌లో ఇరు కంపెనీలు ఈ విషయాన్ని తెలిపాయి. ఐఫోన్ ఫీచర్లు కాఫీ చేసిందన్న కారణంతో సుమారు రూ.3700 కోట్లను శాంసంగ్, ఆపిల్‌కు చెల్లించలాని గత నెలలోనే ఫెడరల్ కోర్టు జ్యూరీ ఆదేశించింది. ఈ ఆదేశాల అనంతరం ఇరు కంపెనీలు తమ సమస్యను పరిష్కరించుకున్నాయి. అయితే ఎంత మొత్తంలో ఈ సెటిల్మెంట్ చేసుకున్నాయో ఇంకా తెలియరాలేదు. ఈ కేసులో మిగిలి ఉన్న అన్ని వాదనలు, ప్రతికూలతలను కొట్టివేస్తున్నట్టు అమెరికా జిల్లా కోర్టు జడ్జి లూసీ కో తెలిపారు. ఇదే విషయంపై మరోసారి ఎలాంటి న్యాయ చర్యలకు సిద్ధం కాకూడదని చెప్పారు. అంతేకాక ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి అటార్నీల ఫీజులు, వ్యయాలను ఇరు పార్టీలే భరించాల్సి ఉంటుందని కో అన్నారు. ఈ కేసు నగదుకు మించిదని ఏఎఫ్‌పీ పేర్కొంది. 2011 నుంచి ఆపిల్, శాంసంగ్‌లకు మధ్య ఈ వివాదం ప్రారంభమైంది. ఈ కాగ, శాంసంగ్‌పై ఆపిల్ నమోదు చేసిన ఫిర్యాదులో ఐఫోన్‌కు చెందిన ఫీచర్లను, డిజైన్‌ను ఇది కాఫీ చేస్తుందని ఆరోపించింది. సుప్రీం కోర్టు అనుమతితో ఈ కేసును జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. -
శాంసంగ్‌కు భారీ ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఐప్యాడ్ కేసులో శాంసంగ్‌పై ఆపిల్ విజయం సాధించింది. ప్రతిష్మాత్మకమైన తమ ప్రొడక్ట్ ఐఫోన్లను శాంసంగ్ కాపీ కొడుతోందన్న ఆరోపణలపై ఫెడరల్ కోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 533 మిలియన్ డాలర్లు (సుమారు 3600 కోట్ల రూపాయలు) చెల్లించాలని శాంసంగ్‌ను కోర్టు ఆదేశించింది. రెండు పేటెంట్ రైట్స్ ఉల్లంఘనపై అదనంగా 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని కూడా తీర్పు చెప్పింది. ఏడు సంవత్సరాల నాటి పేటెంట్ కేసులో అమెరికా ఫెడరల్ కోర్ట్ జ్యూరీ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆపిల్‌కు అతి ముఖ్యమైన ఐఫోన్ డిజైనింగ్ పేటెంట్ పోరులో ఆపిల్‌కు ఇది కీలక విజయమని టెక్ నిపుణుల అంచనా. ప్రొడక్టు డిజైనింగ్ సహా ప్యాకేజింగ్, యూజర్ ఇంటర్ఫేస్ తదితర అంశాల్లో శాంసంగ్ కాపీకొడుతోందని ఆపిల్ ఆరోపించింది. దీన్ని పేటెంట్, ట్రేడ్‌మార్క్ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. శాంసంగ్ యథేచ్ఛగా తమ ఉత్పత్తులను కాపీ కొడుతోందని ఆపిల్ ఆరోపించింది. మొబైల్ ఫోన్ డిజైన్లు, టెక్నాలజీ విషయమై శాంసంగ్, ఆపిల్ నడుమ గత కొన్నేళ్ళుగా అమెరికా న్యాయస్థానాల పరిధిలో న్యాయపోరాటం నడుస్తున్న విషయం తెలిసిందే. -
శాంసంగ్‌కు మరో ఎదురు దెబ్బ
వాషింగ్టన్: ఆపిల్ ఐ ఫోన్ 7 లాంచింగ్ ఆనందంలో ఉన్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ ఆపిల్ కు మరో సంతోషం వచ్చి వరించింది. మరో మొబైల్ దిగ్గజం, దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేకర్ శాంసంగ్ పై పైచేయి సాధించింది.సుమారు 800 కోట్ల (119.6 మిలియన్ డాలర్ల) రూపాయల పరిహారం కోసం దాఖలైన కేసులో ఆపిల్ కు అనుకులంగా అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆపిల్ పేటెంట్లను శాంసంగ్ అక్రమంగా వాడుకుందని గణనీయమైన ఆధారాలు లేవన్నగత జ్యూరీ తీర్పును ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ శుక్రవారం తోసి పుచ్చింది. శాంసంగ్ కు విధించిన జరిమానాను పునరుద్ధరించింది. ఈ తాజా తీర్పుతో స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు యాపిల్, శాంసంగ్ పేటెంట్ హక్కుల కేసులో మరో ట్విస్ట్ ఏర్పడింది. అసలే గెలాక్సీ నోట్ 7పేలుళ్ల ప్రమాదాలు, రీకాల్ తదితర వ్యవహారాలతో ఇబ్బందుల్లో ఉన్న శాంసంగ్ కు మరో ఎదురు దెబ్బ తప్పలేదు. క్విక్ లింక్స్ తో పాటు ఐఫోన్ 'సైడ్ టు అన్ లాక్', ఆటో కరెక్ట్ ఫీచర్స్ ఆప్షన్స్ లో శాంసంగ్ తమ పేటేంట్ రైట్స్ ను ఉల్లంఘించిందని ఆరోపించిన కేసులో ఇటీవలి తీర్పును రద్దు చేసిన ఫెడరల్ కోర్టు ఆపిల్ వాదనను సమర్ధించింది. 119.6మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇది ఆపిల్ కు గొప్ప విజయమని రిచ్మండ్ స్కూల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జేమ్స్ గిబ్సన్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ తాజా తీర్పుపై టెక్ దిగ్గజాలు రెండూ ఇంకా స్పందించలేదు. ఆపిల్, శాంసంగ్ మధ్య పేటెంట్ హక్కుల విషయంలో గత కొన్నేళ్లుగా లీగల్ ఫైట్ నడుస్తోంది. దాదాపు 12 దేశాల్లో వివాదాలు నడుస్తున్నాయి. ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ ఉత్పత్తుల్లో పేటెంట్ హక్కులను ఉల్లంఘించినట్టు పరస్పరం ఆరోపించుకుంటున్న సంగతి తెలిసిందే. -
యాపిల్ పై శాంసంగ్ దే పైచేయి!
వాషింగ్టన్: ప్రముఖ ముబైల్ తయారీ సంస్థ యాపిల్ పై పోరులో దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేకర్ శాంసంగ్ పైచేయి సాధించింది. 825 కోట్ల రూపాయల పరిహారం కోసం దాఖలైన కేసులో శాంసంగ్ ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదంటూ అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది. యాపిల్ సంస్థ తన యాప్స్ ను శాంసంగ్ కాపీ కొట్టిందని, యాపిల్ క్విక్ లింక్స్ పేటేంట్ హక్కులను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పిటీషన్ దాఖలుచేసింది. దీనిపై విచారణ చేసిన ఫెడరల్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో యాపిల్ పటీషన్ ను కొట్టిపారేసింది. క్విక్ లింక్స్ తో పాటు ఐఫోన్ 'సైట్ టు అన్ లాక్', ఆటో కరెక్ట్ ఫీచర్స్ ఆప్షన్స్ లో శాంసంగ్ తమ పేటేంట్ రైట్స్ ను ఉల్లంఘించిందని ఆరోపించింది. యాపిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో పాటు.. శాంసంగ్ పేటేంగ్ హక్కుల ఉల్లంఘటనకు పాల్పడించదని పిటిషన్ వేసిన ఐఫోన్ సంస్థకు ఝలక్ ఇచ్చింది. కోర్టు తీర్పు వెలువడ్డ తర్వాత శాంసంగ్ ప్రతినిధి మాట్లాడుతూ... పోటీ అనేది మార్కెట్లోనే తప్ప కోర్టులో కుదరదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను యాపిల్ ఖండించింది. యాపిల్, శాంసంగ్ గత కొన్నేళ్లుగా ముబైల్ టెక్నాలజీలో పోటీ పడుతున్నాయి. గత డిసెంబర్లో ఇదే విధంగా మరో పేటేంట్ విషయంలో దాఖలైన కేసులో యాపిల్‌కు దాదాపు 3,770 కోట్ల రూపాయలు సమర్పించుకుంది.