సాక్షి, న్యూఢిల్లీ: ఐప్యాడ్ కేసులో శాంసంగ్‌పై ఆపిల్ విజయం సాధించింది. ప్రతిష్మాత్మకమైన తమ ప్రొడక్ట్ ఐఫోన్‌లను శాంసంగ్ కాపీ కొడుతోందన్న ఆరోపణలపై ఫెడరల్ కోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 533 మిలియన్ డాలర్లు (సుమారు 3600 కోట్ల రూపాయలు) చెల్లించాలని శాంసంగ్‌ను కోర్టు ఆదేశించింది. రెండు పేటెంట్ రైట్స్ ఉల్లంఘనపై అదనంగా 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని కూడా తీర్పు చెప్పింది. ఏడు సంవత్సరాల నాటి పేటెంట్ కేసులో అమెరికా ఫెడరల్ కోర్ట్ జ్యూరీ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆపిల్‌కు అతి ముఖ్యమైన ఐఫోన్ డిజైనింగ్ పేటెంట్ పోరులో ఆపిల్‌కు ఇది కీలక విజయమని టెక్ నిపుణుల అంచనా.
ప్రొడక్టు డిజైనింగ్ సహా ప్యాకేజింగ్, యూజర్ ఇంటర్‌ఫేస్ తదితర అంశాల్లో శాంసంగ్ కాపీకొడుతోందని ఆపిల్ ఆరోపించింది. దీన్ని పేటెంట్, ట్రేడ్‌మార్క్ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. శాంసంగ్ యథేచ్ఛగా తమ ఉత్పత్తులను కాపీ కొడుతోందని ఆపిల్ ఆరోపించింది. మొబైల్ ఫోన్ డిజైన్లు, టెక్నాలజీ విషయమై శాంసంగ్, ఆపిల్ నడుమ గత కొన్నేళ్ళుగా అమెరికా న్యాయస్థానాల పరిధిలో న్యాయపోరాటం నడుస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment