iPhone Design
-
7 ఏళ్ల వివాదానికి దిగ్గజాలు స్వస్తి
ఐఫోన్ డిజైన్ విషయంలో సుదీర్ఘకాలంగా జరుగుతున్న వివాదాన్ని ప్రపంచ స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలు ఆపిల్, శాంసంగ్ పరిష్కరించుకున్నాయి. ఏడు ఏళ్లుగా సాగుతున్న ఐఫోన్ డిజైన్ పేటెంట్ వివాదానికి స్వస్తి పలికాయి. అమెరికా కోర్టు ఫైలింగ్‌లో ఇరు కంపెనీలు ఈ విషయాన్ని తెలిపాయి. ఐఫోన్ ఫీచర్లు కాఫీ చేసిందన్న కారణంతో సుమారు రూ.3700 కోట్లను శాంసంగ్, ఆపిల్‌కు చెల్లించలాని గత నెలలోనే ఫెడరల్ కోర్టు జ్యూరీ ఆదేశించింది. ఈ ఆదేశాల అనంతరం ఇరు కంపెనీలు తమ సమస్యను పరిష్కరించుకున్నాయి. అయితే ఎంత మొత్తంలో ఈ సెటిల్మెంట్ చేసుకున్నాయో ఇంకా తెలియరాలేదు. ఈ కేసులో మిగిలి ఉన్న అన్ని వాదనలు, ప్రతికూలతలను కొట్టివేస్తున్నట్టు అమెరికా జిల్లా కోర్టు జడ్జి లూసీ కో తెలిపారు. ఇదే విషయంపై మరోసారి ఎలాంటి న్యాయ చర్యలకు సిద్ధం కాకూడదని చెప్పారు. అంతేకాక ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి అటార్నీల ఫీజులు, వ్యయాలను ఇరు పార్టీలే భరించాల్సి ఉంటుందని కో అన్నారు. ఈ కేసు నగదుకు మించిదని ఏఎఫ్‌పీ పేర్కొంది. 2011 నుంచి ఆపిల్, శాంసంగ్‌లకు మధ్య ఈ వివాదం ప్రారంభమైంది. ఈ కాగ, శాంసంగ్‌పై ఆపిల్ నమోదు చేసిన ఫిర్యాదులో ఐఫోన్‌కు చెందిన ఫీచర్లను, డిజైన్‌ను ఇది కాఫీ చేస్తుందని ఆరోపించింది. సుప్రీం కోర్టు అనుమతితో ఈ కేసును జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. -
ఆపిల్‌కు షాక్.. శాంసంగ్‌కు ఊరట
అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్‌పై దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ పైచేయి సాధించింది. ఐకానిక్ ఐఫోన్ డిజైన్‌పై గత కొంతకాలంగా సాగుతున్న వివాదంలో శాంసంగ్‌కు అనుకూలంగా తీర్పువచ్చింది. శాంసంగ్‌కు విధించిన 400 మిలియన్ డాలర్ల(రూ.2698 కోట్ల) జరిమానాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో శాంసంగ్ ఊపిరిపీల్చుకుంది. తమ ఐకానిక్ ఐఫోన్ రూపురేఖల డిజైన్ పేటెంట్లను, కలర్‌ఫుల్ ఐకాన్లను శాంసంగ్ ఉల్లంఘించిందని ఆపిల్ చాలాకాలంగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. పలుసార్లు శాంసంగ్‌కు వ్యతిరేకంగా తీర్పులు కూడా వచ్చాయి. ఈ తీర్పుల్లో శాంసంగ్ 400 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని ఆపిల్‌కు చెల్లించాలని కింది కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై శాంసంగ్ సుప్రీంను ఆశ్రయించింది. కాపీ చేసి ఐఫోన్ డిజైన్‌పై వచ్చిన లాభాలన్నింటిన్నీ ఆపిల్ తీసుకోవడానికి వీలులేదని సుప్రీంకోర్టు తాజాగా తీర్పుచెప్పింది. 400 మిలియన్ డాలర్లను బలవంతం మీద శాంసంగ్ నుంచి రాబట్టాలనుకుని కింద కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించలేదు. గత కొంతకాలంగా సాగుతున్న ఈ వివాదంలో మొదటిసారి శాంసంగ్‌కు వ్యతిరేకంగా వచ్చిన తీర్పులో ఆ కంపెనీకి దాదాపు 1 బిలియన్ డాలర్ల పెనాల్టీ పడింది. అనంతరం ఆ జరిమానా 548 మిలియన్ డాలర్లకు తగ్గింది. ప్రస్తుత వివాదంలో 400 మిలియన్ డాలర్లు చెల్లించాలని కింది కోర్టు ఆదేశించింది. అయితే ఆఖరికి ఈ జరిమానా విషయంలో సుప్రీంలో శాంసంగ్ పైచేయి సాధించింది.