గెలాక్సీ ఎస్‌8,ఎస్‌8ప్లస్‌లపై షాకింగ్‌న్యూస్‌ | Samsung Galaxy S8 Facing Random Restart Issues, Some Users Report | Sakshi
Sakshi News home page

గెలాక్సీఎస్‌8, ఎస్‌8ప్లస్‌లపై షాకింగ్‌న్యూస్‌

Published Mon, May 1 2017 12:57 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

గెలాక్సీ ఎస్‌8,ఎస్‌8ప్లస్‌లపై షాకింగ్‌న్యూస్‌

గెలాక్సీ ఎస్‌8,ఎస్‌8ప్లస్‌లపై షాకింగ్‌న్యూస్‌

దిగ్గజ  మొబైల్‌ మేకర్‌ శాంసంగ్‌ సంస్థకు  స్మార్ట్‌ఫోన్ల కష్టాలు వీడేలా కనిపించడంలేదు.  శాంసంగ్‌ నోట్‌ 7 పేలుళ్లతో అటు ఆర్థికంగాగానూ, ఇటు   నైతికంగానూ బాగా దెబ్బతింది.  దీంతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆధిపత్యాన్ని  చలాయిస్తున్న సౌత్‌ కొరియన్‌ మొబైల్‌ మేకర్‌ శాంసంగ్‌ ప్రతిష్ట మరింత మసకబారనుంది.  ఇటీవల లాంచ్‌ చేసిన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు  గెలాక్స్‌ 8, గెలాక్సీ 8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లలో కూడా సమస్యలు తలెత్తినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.  ఇవి తరచూ రీస్టార్ట్‌ అవుతున్నాయని  అమెరికా, తదితర దేశాల  యూజర్లు గగ్గోలు పెడుతున్నారు.  ఇది మరిన్ని జోన్లకు విస్తరించే ప్రమాదం ఉందని అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి.

ఈ సమస్యపై అనేక గెలాక్సీ ఎస్‌ 8, ఎస్‌ 8 ప్లస్‌  వినియోగదారులు సంస్థ అధికారిక ఫోరమ్‌ను,  ఎక్స్‌డీఏ డెవలపర్స్‌ ఫోరమ్‌ను ఆశ్రయించారు.   తన గెలాక్సీ ఎస్‌ 8 దానికదే రిస్టార్ట్‌ అవుతోందనీ, ఇది తప్ప మిగతా అంతా బావుందని కమ్యూనిటీ ఫోరంను ఆశ్రయించిన మొదటి ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు.  10 గంటల్లో  ఇప్పటికే 7 సార్లు రీస్టార్ట్‌ అయిందని ఫిర్యాదు చేశాడు.  కెమెరా, శాంసంగ్‌ థీమ్స్‌ ఆప్స్ వాడుతున్నపుడు సడెన్‌గా యాప్‌  ఫ్రీజ్‌ అయ్యి, కొన్ని సెకన్ల తర్వాత  స్క్రీన్‌ ఆఫ్ అయిపోతోందని  తెలిపారు.  ఇంకా ఎవరికైనా ఇలాంటి సమస్య ఎదురైందా? దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అని ప్రశ్నించాడు.

యాదృచ్ఛికంగా,  ఎస్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌పై  ఏవేవో  దృశ్యాలు కనిపించి  (దిగువ భాగంలో) పునఃప్రారంభమవుంతోని మరో యూజర్‌ ఫిర్యాదు. ఇది యాప్‌ ప్రాబ్లమ్‌లా తనకు  అనిపించడంలేదనీ తెలిపాడు. అంతేకాదు శాంసంగ్‌కు ఫోన్‌ చేస్తే రీటైలర్‌ తిరిగి  ఇచ్చేసి.. కొత్తది రిప్లేస్‌మెంట్‌ అడగమని  చెప్పారని  పేర్కొన్నాడు.  దాదాపు ఎస్‌ 8 ప్లస్‌ విషయంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే రావడం గమనార్హం. అయితే  వీటిపై శాంసంగ్‌ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.  

మరోవైపు టర్కీ, యూకే లలో ఇలాంటి  ఫిర్యాదులే అందుతున్నాయని శాంమొబైల్‌ నివేదించింది.  జర్మనీ టర్కీలలో ఎస్‌8 ప్లస్‌లో సమస్యలు తలెత్తినట్టు నివేదించింది.  ఈ డిస్‌ప్లే సమస్యలపై శాంసంగ్‌  పరిశీలిస్తోందని తెలిపింది.  ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8,  గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌  వినియోగదారులచే నివేదించబడిన రెడ్‌ టింట్‌ సమస్యను పరిష్కరించే క్రమంలో ఉందని పేర్కొంది. గత వారంలో, దక్షిణ కొరియా  వినియోగదారుల కంప్లయింట్లపై బగ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నిస్తోందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement