S8
-
గెలాక్సీ ఎస్ 8ప్లస్ ఇండియాలో..ధర ఎంత?
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్లస్‌ను ఇండియ న్ మార్కెట్ లో శుక్రవారం లాంచ్ చేసింది. గ్లోబల్‌గా గెలాక్సీ ఎస్8 ,ఎస్8ప్లస్‌లకు మంచి స్పందన లభించిన తర్వాత 6జీబీ వేరియంట్ గెలాక్సీ ఎస్ 8ప్లస్ కొత్త వెర్షన్‌ను భారత్ లో లాంచ్ చేసింది. దీని ధరను రూ. 74,990గా నిర్ణయించింది. ఈ రోజునుంచి (జూన్ 2) ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రీ బుక్ చేసుకోవచ్చనీ, జూన్ 9 నుంచి డెలివరీ మొదలవుతుందని కంపెనీ తెలిపింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో అందుబాటులోకి తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్ మల్టీ టాస్కింగ్ కస్టమర్లకు ఇది అల్టిమేట్ డివైస్ అని శాంసంగ్ ఇండియా మొబైల్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సీ ఒక ప్రకటనలో తెలిపారు. పరిచయ ఆఫర్‌గా వినియోగదారులు ఉచిత వైర్లెస్ ఛార్జర్‌ను అందిస్తోంది. గెలాక్సీ ఎస్ 8ప్లస్ 6.2ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2960×1440 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ 6 జీబీర్యామ్ 128 ఇంటర్నల్ స్టోరేజ్ 12ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్పీ కెమెరా విత్ మల్టీ-ఫ్రేమ్ ప్రాసెసింగ్ , ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 3500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం -
గెలాక్సీ ఎస్8,ఎస్8ప్లస్‌లపై షాకింగ్న్యూస్
దిగ్గజ మొబైల్ మేకర్ శాంసంగ్ సంస్థకు స్మార్ట్ఫోన్ల కష్టాలు వీడేలా కనిపించడంలేదు. శాంసంగ్ నోట్ 7 పేలుళ్లతో అటు ఆర్థికంగాగానూ, ఇటు నైతికంగానూ బాగా దెబ్బతింది. దీంతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆధిపత్యాన్ని చలాయిస్తున్న సౌత్ కొరియన్ మొబైల్ మేకర్ శాంసంగ్ ప్రతిష్ట మరింత మసకబారనుంది. ఇటీవల లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ ఫోన్లు గెలాక్స్ 8, గెలాక్సీ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లలో కూడా సమస్యలు తలెత్తినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇవి తరచూ రీస్టార్ట్ అవుతున్నాయని అమెరికా, తదితర దేశాల యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇది మరిన్ని జోన్లకు విస్తరించే ప్రమాదం ఉందని అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. ఈ సమస్యపై అనేక గెలాక్సీ ఎస్ 8, ఎస్ 8 ప్లస్ వినియోగదారులు సంస్థ అధికారిక ఫోరమ్‌ను, ఎక్స్‌డీఏ డెవలపర్స్ ఫోరమ్‌ను ఆశ్రయించారు. తన గెలాక్సీ ఎస్ 8 దానికదే రిస్టార్ట్ అవుతోందనీ, ఇది తప్ప మిగతా అంతా బావుందని కమ్యూనిటీ ఫోరంను ఆశ్రయించిన మొదటి ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. 10 గంటల్లో ఇప్పటికే 7 సార్లు రీస్టార్ట్ అయిందని ఫిర్యాదు చేశాడు. కెమెరా, శాంసంగ్ థీమ్స్ ఆప్స్ వాడుతున్నపుడు సడెన్‌గా యాప్ ఫ్రీజ్ అయ్యి, కొన్ని సెకన్ల తర్వాత స్క్రీన్ ఆఫ్ అయిపోతోందని తెలిపారు. ఇంకా ఎవరికైనా ఇలాంటి సమస్య ఎదురైందా? దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అని ప్రశ్నించాడు. యాదృచ్ఛికంగా, ఎస్ 8 స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై ఏవేవో దృశ్యాలు కనిపించి (దిగువ భాగంలో) పునఃప్రారంభమవుంతోని మరో యూజర్ ఫిర్యాదు. ఇది యాప్ ప్రాబ్లమ్‌లా తనకు అనిపించడంలేదనీ తెలిపాడు. అంతేకాదు శాంసంగ్‌కు ఫోన్ చేస్తే రీటైలర్ తిరిగి ఇచ్చేసి.. కొత్తది రిప్లేస్మెంట్ అడగమని చెప్పారని పేర్కొన్నాడు. దాదాపు ఎస్ 8 ప్లస్ విషయంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే రావడం గమనార్హం. అయితే వీటిపై శాంసంగ్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు టర్కీ, యూకే లలో ఇలాంటి ఫిర్యాదులే అందుతున్నాయని శాంమొబైల్ నివేదించింది. జర్మనీ టర్కీలలో ఎస్8 ప్లస్‌లో సమస్యలు తలెత్తినట్టు నివేదించింది. ఈ డిస్ప్లే సమస్యలపై శాంసంగ్ పరిశీలిస్తోందని తెలిపింది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ వినియోగదారులచే నివేదించబడిన రెడ్ టింట్ సమస్యను పరిష్కరించే క్రమంలో ఉందని పేర్కొంది. గత వారంలో, దక్షిణ కొరియా వినియోగదారుల కంప్లయింట్లపై బగ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నిస్తోందని తెలిపింది. -
శాంసంగ్ ఎస్8, ఎస్8+ భారత్‌లో విడుదల
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ అభిమానులకు శుభవార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ఎస్8ప్లస్ ఫోన్లు భారత్‌లో లాంచ్ కానున్నాయి. ఏప్రిల్ 19న ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్లో తెలిపింది. దీని ధర సుమారు రూ.59,999 ఉండవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. గతేడాది విడుదల చేసిన గెలాక్సీ నోట్7 బ్యాటరీ సమస్యలతో ఇబ్బందులపాలైన కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ ఎస్8, ఎస్8+ లను ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. ఎస్8, ఎస్8+ ప్రత్యేకతలు ♦ ర్యామ్: 4జీబీ ♦ ఇంటర్నల్ మెమోరీ: 64జీబీ, ఎస్డీకార్డుతో 256 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ♦ కెమెరా: ఫ్రంట్ 8 మెగా ఫిక్సల్, రేర్ 12 మెగా ఫిక్సల్ ♦ బ్యాటరీ: 3000 ఎంఏఎచ్ ఎస్8+లో బ్యాటరీ 3500 ఎంఏఎచ్ ♦ స్ర్కీన్: ఎస్8 5.8 అంగుళాలు, ఎస్8+ 6.2 అంగుళాలు. గొరిళ్లా గ్లాస్5ను అమర్చారు. అధికారిక వెబ్సైట్ సమాచారం ప్రకారం రెండిటిలో ఐరిష్ స్కానర్, ఫేస్ రికగ్నైస్ టెక్నాలజీని నిక్షప్తం చేశారు. వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌గా రూపొందించారు.