గెలాక్సీ ఎస్ 8 కమింగ్ సూన్..!
న్యూఢిల్లీ: కొరియా ఎలక్ట్రానికి దిగ్గజం శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 8 త్వరలోనే మార్కెట్లను పలకరించనుంది. మీడియా నివేదికలు ప్రకారం, అనుకున్న దానికంటే ముందుగానే ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులో ఉంచడానికి శాంసంగ్ సిద్ధపడుతోంది. వినియోగదారుల విశ్వాసం పొందేందుకు గాను ఫిబ్రవరి 2017 లోను దీన్ని లాంచ్ చేయనుంది. ముందు ఇది ఏప్రిల్ 2017 లో రానుందని అంచనావేశారు. ఫీచర్లు, ధర తదితర వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడి చేయనప్పటికీ...వివిధ అంచనాల ప్రకారం ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.
గెలాక్సీ ఎస్ 8 ఫీచర్లు
1440 x 2560 ఎంపీ రిజల్యూషన్
4కె స్క్రీన్,
6 జీబీ ర్యామ్
256 జీబీ ఎక్స్ పాండబుల్ మొమొరీ
30 మెగాపిక్సెల్ కెమెరా
4,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
అయితే 3.5ఎంఎం ఆడియో జాక్ ను ఎస్ 8 లో తొలగించినట్టు తెలుస్తోంది. ఇక ధర విషయానికి వస్తే ఎస్ 7 ఎస్ 7ఎడ్జ్ రేంజ్ లోనే ఉండొచ్చని భావిస్తున్నారు. రెండు వేరియంట్లలో వస్తున్న గెలాక్సీ ఎస్ 8 64 జీబీ రూ.55,000, 128 జీబీ రూ. 60,000 ఉండొచ్చని అంచనా.
కాగా గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యూర్ కారణంగా వినియోగదారుల విశ్వసనీయతను కోల్పొవటంతో పాటు వేల కోట్ల నష్టపోయింది. దీంతో బ్యాటరీ లో మరిన్ని జాగ్రత్తలతో పాటు, ఎక్సినాస్ 8895 ప్రాసెసర్ విత్ మాలి-జీ71 జీపీయుతో గెలాక్స్ ఎస్ 7కంటే 1.8 రెట్ల అధిక సామర్ధ్యంతో రానుందని తెలుస్తోంది. అలాగే వైర్ లెస్ ఎయిర్ బడ్స్ ను కూడా లాంచ్ చేయనుంది. సామ్‌సంగ్ తన అప్ కమింగ్ గెలాక్సీ ఎస్8 ద్వారా తిరిగి తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.