శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ లాంచ్
న్యూఢిల్లీ: ప్రముఖ సెల్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్8, ఎస్ 8ప్లస్’ ను విడుదల చేసింది. భారత మార్కెట్‌లోబుధవారం గ్రాండ్ గా లాంచ్ చేసింది. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్,యూఎస్‌బీ టైప్-సి, వాటర్ రెసిస్టెన్స్ లాంటి ప్రీమియం ఫీచర్స్‌తో ఆ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టింది. ప్రపంచంలో అతి చిన్న 10 ఎన్‌ఎం ప్రాసెసర్ అమర్చినట్టు శాంసంగ్ తెలిపింది. తన కొత్త ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సర్వీస్ బ్రిగ్జ్బీ తోపాటు, ఇటీవల లాంచ్ చేసిన శాంసంగ్ పేయాప్ ను కూడా జోడించింది.
తమ ప్రతి శామ్సంగ్ స్మార్ట్ఫోన్ లో భారతదేశం టచ్ ఉంటుందని లాంచింగ్ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ హెచ్సీ హాంగ్ వ్యాఖ్యానించారు. శాంసంగ్ మొబై ల్‌బిజినెస్ జనరల్ మేనేజర్ ఆదిత్య బబ్బర్ ఎస్ 8 లో కొత్త ఇంటిలిజెన్స్ సర్వీసును పరిచయం చేశారు. ఎస్8 విలువ రూ .57,900 గాను, ఎస్ 8 ప్లస్ రూ.64,900 గా నిర్ణయించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో మే 5 నుంచి అందుబాటులోఉండనున్నాయి. అయితే ప్రి బుకింగ్ ఆర్డర్లు మాత్రమే ఈరోజునుంచే ప్రారంభం.అలాగే ప్రీ బుకింగ్‌పై స్పెషల్ ఆఫర్‌గా వైర్‌లెస్ చార్జర్‌ను అందిస్తోంది.
గెలాక్సీ ఎస్-8 ఫీచర్లు
6.2 ఇంచెస్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7 నౌగట్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐరిస్ స్కానర్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఎస్ 8 లో 3,000 ఏంఏహెచ్ బ్యాటరీ
ఎస్8ప్లస్‌లో 3,500 ఏంఏహెచ్ బ్యాటరీ అమర్చింది.