జియో 448జీబీ ఫ్రీ డేటా..ఎవరికో తెలుసా?
జియో 448జీబీ ఫ్రీ డేటా..ఎవరికో తెలుసా?
Published Wed, Apr 19 2017 7:25 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM
రిలయన్స్ జియో సంచలనమైన ఆఫర్లతో దూసుకెళ్తోంది. బుధవారం మార్కెట్లోకి లాంచ్ అయిన శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ కొనుగోలుదారులకు జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో, శాంసంగ్ భాగస్వామ్యంలో ఈ ఫోన్లను కొనుగోలు చేసిన జియో యూజర్లకు డబుల్ డేటా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద జియో నెట్ వర్క్పై కొత్త గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు 448జీబీ 4జీ డేటాను 8 ఎనిమిది నెలల పాటు ఉచితంగా అందించనున్నట్టు వెల్లడిచింది. అయితే నెలకు 309 రూపాయలతో ఆ యూజర్లు కచ్చితంగా రీఛార్జ్ చేపించుకోవాల్సిందేనట.
జియో ధన్ ధనా ధన్ ప్లాన్ కిందనే గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్ 8 ప్లస్ కొనుగోలుదారులు ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ధన్ ధనా ధన్ ఆఫర్పై జియో ప్రైమ్ మెంబర్లు 309 రూపాయల రీఛార్జ్తో, నెలకు 28జీబీ డేటా చొప్పున మూడు నెలల పాటు కంపెనీ డేటా సర్వీసులను వాడుకోవచ్చు. ప్రస్తుతం శాంసంగ్ కొత్త గెలాక్సీ కొనుగోలుదారులకు నెలకు వాడుకునే డేటా డబుల్ అవుతుంది. వీరు నెలకు 56 జీబీ చొప్పున ఎనిమిది నెలల పాటు 448జీబీని వాడుకునే అవకాశం పొందుతారు. కాగ, ఈ ఫోన్లను శాంసంగ్ నేడే మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్8 ధర రూ.57,900కాగ, గెలాక్సీ ఎస్8 ప్లస్ ధర రూ.64,900. ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లను కంపెనీ ప్రారంభించేసింది.
Advertisement
Advertisement