Samsung Galaxy S8
-
గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్‌లపై స్పెషల్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్ మొదలైంది. కంపెనీలన్నీ వరుసబెట్టి తమ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించేస్తున్నాయి. ఈ-కామర్స్ కంపెనీలైతే ఏకంగా భారీ భారీ డిస్కౌంట్లతో మెగా సేల్స్‌కు తెరలేపాయి. తాజాగా స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ కూడా 'నవ్రాత్ర స్పెషల్ ఆఫర్' ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా తన గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లపై ధరను తగ్గించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్ల ధరను 4వేల రూపాయల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో లాంచింగ్ సందర్భంగా రూ.57,900 ఉన్న గెలాక్సీ ఎస్8, 53,990 రూపాయలకు దిగొచ్చింది. అలాగే 64,900 రూపాయలున్న గెలాక్సీ ఎస్8 ప్లస్ ఇక 60,990 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకైతే మరో 4000 రూపాయలను అదనంగా క్యాష్‌బ్యాక్ కింద అందిస్తుంది. అంటే మొత్తంగా 8వేల రూపాయల మేర ధర తగ్గించినట్టు తెలిసింది. అయితే ఈ తగ్గించిన ధరలు ఇంకా కంపెనీ సొంత ఆన్లైన్ స్టోర్‌లో అప్డేట్ కాకపోవడం గమనార్హం. ఈ ఫోన్లు ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ అయిన తర్వాత చేపట్టిన ఈ కోత, అత్యంత ముఖ్యమైన ధర తగ్గింపుగా కంపెనీ తెలిపింది. గెలాక్సీ ఎస్8 ప్లస్ 6జీబీ ర్యామ్ వేరియంట్‌కు రెండు భిన్నమైన విధానాల్లో ధరల తగ్గింపు శాంసంగ్ చేపట్టింది. గెలాక్సీ ఎస్8 ప్లస్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై కేవలం రూ.1000 ధర మాత్రమే తగ్గించి, 64,900 రూపాయలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ధరల తగ్గింపు ఫెస్టివ్ సీజన్‌కు కాస్త ముందుగా కంపెనీ చేపట్టింది. అంతేకాక త్వరలోనే శాంసంగ్ కొత్త ఫోన్ గెలాక్సీ నోట్ 8 మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఫోన్ గతవారమే భారత్‌లో విడుదలైంది. ప్రస్తుతం భారత్‌లో దీని ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్21 నుంచి సరుకు రవాణా అవుతోంది. గెలాక్సీ నోట్ 8 ధర 67,900 రూపాయలు. -
మరోసారి తగ్గిన గెలాక్సీ ఎస్8 ప్లస్ ధర
దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ గత నెలలోనే గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 4000 రూపాయల మేర తగ్గించింది. ఇప్పుడు మరోసారి ఇదే వేరియంట్‌పై రూ.5000మేర ధరను తగ్గించినట్టు శాంసంగ్ ప్రకటించింది. దీంతో గెలాక్సీ ఎస్8 ప్లస్, 6జీబీ వేరియంట్ ధర రూ.65,900కు దిగొచ్చింది. దీంతో పాటు తీసుకొచ్చిన 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.64,900. 4జీబీ ర్యామ్ వేరియంట్ కంటే కేవలం 1000 రూపాయలే ఈ వేరియంట్ ధర ఎక్కువ. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం ఆఫ్‌లైన్ రిటైలర్లు లేదా ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ స్టోర్ నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటును కంపెనీ కల్పిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫీచర్లు... 6.2 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్సీనోస్ 8895 ఎస్ఓసీ 6జీబీ ర్యామ్‌తో 128జీబీ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరణ మెమరీ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ కాన్ఫిగరేషన్ 12 మెగాపిక్సెల్ డ్యూయల్ పిక్సెల్ రియర్ కెమెరాలు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఐరిస్ స్కానర్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేసియల్ రికగ్నైజేషన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 సర్టిఫికేషన్ -
గెలాక్సీ ఎస్8 ప్లస్‌పై ధర తగ్గింపు, బంపర్ ఆఫర్లు
గెలాక్సీ నోట్7 విఫలమైన తర్వాత శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు గెలాక్సీలు ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వీటిని గత నెలలోనే భారత మార్కెట్లోకి కూడా తీసుకొచ్చింది. భారత్‌లో లాంచ్‌చేసిన ఒక్క నెలలోనే గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్/128జీబీ వేరియంట్‌పై శాంసంగ్ ధరను తగ్గించింది. లాంచింగ్ సందర్భంగా రూ.74,900గా ఉన్న ఈ వేరియంట్ ధర, ప్రస్తుతం శాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్‌లో 70,900 రూపాయలకే అందుబాటులో ఉంది. అంటే 4వేల రూపాయల మేర ధరను తగ్గించేసింది. అయితే తాత్కాలికంగా తగ్గించిందా? లేదా శాశ్వతంగా తగ్గించిందా? అనేది ఇంకా స్పష్టంకాలేదు. ఈ కొత్త ధర కొత్త ఎంఓపీ అని, శాశ్వతంగా ఈ ఫోన్‌పై శాంసంగ్ రేటును తగ్గించినట్టు ముంబైకు చెందిన ఆఫ్‌లైన్ రిటైలర్ మహేష్ టెలికాం చెబుతోంది. ఈ ధర తగ్గింపుతో పాటు 128జీబీ వేరియంట్‌ను ఆన్లైన్లో కొనుగోలుచేసిన వారికి బంపర్ ఆఫర్లకు కూడా ప్రకటించింది. రిలయన్స్ జియో యూజర్లు ఈ ఫోన్‌ను కొనుగోలుచేస్తే రూ.309, రూ.509 ప్లాన్స్‌పై రెండింతలు డేటా ఆఫర్ చేయనుంది. ఈ రెండింతలు డేటా యూజర్లకు 48 గంటల్లోనే క్రెడిట్ కానుంది. అదేవిధంగా పాత ఫోన్‌తో కొత్తగా ఈ ఫోన్‌ను కొనుగోలుచేస్తే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై 3000 రూపాయల క్యాష్ బ్యాక్, ఉచితంగా రూ.4,499 విలువైన వైర్లెస్ ఛార్జర్ ఇవ్వనుంది. ఎలాంటి ఖర్చులు లేని ఈఎంఐ ఆప్షన్లు కూడా గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై శాంసంగ్ అందుబాటులో ఉంచింది. ఆశ్చర్యకరంగా ఈ ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై లేవు. అధికారిక తన ఆన్లైన్ స్టోర్‌లోనే అందిస్తున్నట్టు తెలిసింది. గెలాక్సీ ఎస్8 ప్లస్ స్పెషిఫికేషన్లు... గెలాక్సీ ఎస్ 8ప్లస్ 6.2 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే 1440x2960 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ 6 జీబీర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరణ మెమరీ 12ఎంపీ డ్యూయల్ పిక్సెల్ రియర్ కెమెరాలు 8 ఎంపీ సెల్పీ కెమెరా విత్ మల్టీ-ఫ్రేమ్ ప్రాసెసింగ్ , ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 3500 ఎంఏహెచ్ బ్యాటరీ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ -
ఐఫోన్ కంటే అవే చాలా బెస్ట్
గెలాక్సీ నోట్7 పేలుళ్ల ఘటన అనంతరం శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్‌లను మార్కెట్లలోకి ప్రవేశపెట్టింది. ఐఫోన్లకు కిల్లర్ గా వచ్చిన ఈ ఫోన్లు అన్నమాట నిలబెట్టుకుంటున్నాయి. గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫోన్లు బెస్ట్ స్మార్ట్ ఫోన్లుగా వినియోగదారుల మన్ననలను పొందుతున్నాయి. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ కంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్లే బెస్ట్ స్మార్ట్ ఫోన్లుగా దూసుకుపోతున్నట్టు వినియోగదారుల రిపోర్టులలో వెల్లడైంది. ఎంతో ఆకర్షణీయంగా, ప్రకాశవంతమైన డిస్ ప్లేతో శాంసంగ్ కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల డివైజ్ లు ఉన్నాయని కన్జ్యూమర్ రిపోర్టులు కొనియాడుతున్నాయి. మంచి బ్యాటరీ సామర్థ్యం, అద్భుతమైన కెమెరాలంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్ల ఘటన అనంతరం శాంసంగ్ కొంచెం ఎక్కువగా బ్యాటరీపై దృష్టిసారించింది. మళ్లీ అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఎంతో జాగ్రత్త వహించింది. ఒకవేళ ఈ ఫోన్ పూల్ లో పడిపోయినా ప్రమాదమేమి ఉండదని వినియోగదారులు చెబుతున్నారు. వాటర్ రెసిస్టెన్స్, మంచి కెమెరాలు, అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యంతో శాంసంగ్ కొత్త ఫోన్లు మార్కెట్లో దూసుకెళ్తున్నట్టు తెలిపారు. ఈ కన్జ్యూమర్ రిపోర్టులలో శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ టాప్-రేటు సొంతంచేసుకున్న స్మార్ట్ ఫోన్ గా కంపెనీ అధికార ప్రతినిధి ధృవీకరించారు. ఐఫోన్ 7 ప్లస్ ఐదు రేటును సంపాదించుకుంది. ఐఫోన్ 7 ప్లస్ కంటే గెలాక్సీ ఎస్8 ప్లస్, గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఎల్జీ జీ6 స్మార్ట్ ఫోన్లే ముందంజలో నిలిచాయి. ఒకవేళ వీటిని అధిగమించాలంటే ఆపిల్, ఐఫోన్ 8ను వినియోగదారులకు ఎంతో ఆకర్షణీయంగా తీసుకురావాల్సి ఉంది. ఎస్8, ఎస్8 ప్లస్ ప్రత్యేకతలు... గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ రెండు స్మార్ట్ఫోన్లలోనూ క్యూహెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఇన్విజిబుల్ హోమ్ బటన్, 1.9 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి పలు ప్రత్యేకతలున్నాయి. అయితే ఎస్8లో 5.8 అంగుళాల స్క్రీన్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లుంటే ఎస్8 ప్లస్‌లో మాత్రం 6.2 అంగుళాల స్క్రీన్, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీని కంపెనీ అమర్చింది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్లు అమ్మకాల్లో దుమ్మురేపుతున్నాయి. విక్రయాల్లో ఎస్ 8 దూకుడు ప్రదర్శించడంతో రెండో త్రైమాసికంలో గణనీయమైన లాభాలు ఆర్జించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
శాంసంగ్ ‘ఎస్8’కి పోటీగా ఎల్జీ ‘జీ6’
ధర రూ.51,990 న్యూఢిల్లీ: శాంసంగ్ గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్‌కు దీటుగా ‘ఎల్జీ’ తాజాగా ‘జీ6’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.51,990గా ఉంది. ఇందులో 5.7 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ స్క్రీన్, గూగుల్ అసిస్టెంట్, రెండు 13 ఎంపీ రియర్ కెమెరాలు, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ నుగోట్ ఓఎస్, హీట్కూల్ పైప్స్, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. మంచి పనితీరు, దీర్ఘకాల మన్నిక, అదిరిపోయే డిజైన్ వంటి పలు ఫీచర్లను కోరుకుంటున్న కస్టమర్లకు తమ ప్రొడక్ట్ అనువుగా ఉంటుందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కార్పొరేట్ మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ తెలిపారు. -
శాంసంగ్ గెలాక్సీ ఎస్8, 8ప్లస్ వచ్చేశాయ్..
మే నెల 5 నుంచి అందుబాటులోకి ప్రారంభ ధర రూ.57,900 న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా తన ప్రీమియం స్మార్ట్ఫోన్లు గెలాక్సీ ‘ఎస్8’, ‘ఎస్8 ప్లస్’లను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా రూ.57,900, రూ. 64,900గా ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లు మే నెల 5 నుంచి అందుబాటులోకి వస్తాయని, వీటిని కస్టమర్లు ఎంపిక చేసిన రిటైల్ ఔట్లెట్స్ సహా శాంసంగ్ షాప్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేయవచ్చని కంపెనీ వివరించింది. ఫోన్ల ప్రి–బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపింది. డెక్స్ ఫీచర్ కలిగిన ఎస్8 ఫోన్లను డెస్క్టాప్లాగా వాడుకోవచ్చని శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మొబైల్ బిజినెస్) అసిమ్ వార్సి తెలిపారు. అలాగే ఎస్8 ఫోన్లను కొనుగోలు చేసిన వారు రిలయన్స్ జియో నుంచి డబుల్ డేటా ఆఫర్‌ను పొందొచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే గెలాక్సీ ఎస్8 స్మార్ట్ఫోన్లకు చాలా ప్రి–బుకింగ్స్ వచ్చాయని తెలిపారు. దక్షిణ కొరియా, అమెరికా, కెనడాల్లో ఈ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఏప్రిల్ 21 నుంచే ప్రారంభం కానున్నాయి. ఎస్8, ఎస్8 ప్లస్ ప్రత్యేకతలు... గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ రెండు స్మార్ట్ఫోన్లలోనూ క్యూహెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఇన్విజిబుల్ హోమ్ బటన్, 1.9 గిగాహెర్ట్›్జఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. అయితే ఎస్8లో 5.8 అంగుళాల స్క్రీన్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లుంటే ఎస్8 ప్లస్‌లో మాత్రం 6.2 అంగుళాల స్క్రీన్, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. ఇక రెండు స్మార్ట్ఫోన్లలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ‘బిక్స్బీ’ ఫీచర్ సహా ఐరిస్ స్కానర్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, శాంసంగ్ నాక్స్, శాంసంగ్ పే వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయని వివరించింది. -
జియో 448జీబీ ఫ్రీ డేటా..ఎవరికో తెలుసా?
రిలయన్స్ జియో సంచలనమైన ఆఫర్లతో దూసుకెళ్తోంది. బుధవారం మార్కెట్లోకి లాంచ్ అయిన శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ కొనుగోలుదారులకు జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో, శాంసంగ్ భాగస్వామ్యంలో ఈ ఫోన్లను కొనుగోలు చేసిన జియో యూజర్లకు డబుల్ డేటా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద జియో నెట్ వర్క్‌పై కొత్త గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు 448జీబీ 4జీ డేటాను 8 ఎనిమిది నెలల పాటు ఉచితంగా అందించనున్నట్టు వెల్లడిచింది. అయితే నెలకు 309 రూపాయలతో ఆ యూజర్లు కచ్చితంగా రీఛార్జ్ చేపించుకోవాల్సిందేనట. జియో ధన్ ధనా ధన్ ప్లాన్ కిందనే గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్ 8 ప్లస్ కొనుగోలుదారులు ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ధన్ ధనా ధన్ ఆఫర్‌పై జియో ప్రైమ్ మెంబర్లు 309 రూపాయల రీఛార్జ్‌తో, నెలకు 28జీబీ డేటా చొప్పున మూడు నెలల పాటు కంపెనీ డేటా సర్వీసులను వాడుకోవచ్చు. ప్రస్తుతం శాంసంగ్ కొత్త గెలాక్సీ కొనుగోలుదారులకు నెలకు వాడుకునే డేటా డబుల్ అవుతుంది. వీరు నెలకు 56 జీబీ చొప్పున ఎనిమిది నెలల పాటు 448జీబీని వాడుకునే అవకాశం పొందుతారు. కాగ, ఈ ఫోన్లను శాంసంగ్ నేడే మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్8 ధర రూ.57,900కాగ, గెలాక్సీ ఎస్8 ప్లస్ ధర రూ.64,900. ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లను కంపెనీ ప్రారంభించేసింది. -
ఆ ఫోన్ అచ్చం గెలాక్సీ ఎస్8లా ఉంటుందట!
నెక్సస్ ఫోన్లకు గుడ్ బై చెప్పి, సొంత బ్రాండులో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి గూగుల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్ లో పిక్సెల్ సిరీస్ లో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అయితే తాజాగా పిక్సెల్ సిరీస్ లో మరో స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. పిక్సెల్ 2 పేరుతో రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ అచ్చం శాంసంగ్ ఎస్8, ఎస్8 ప్లస్ లను పోలి ఉంటుందని తెలుస్తోంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ తోనే ఇది రూపొందుతుందట. వన్ ప్లస్5, షియోమి ఎంఐ6లకు కిల్లర్ గా గూగుల్ దీన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్8 మాదిరి బెండబుల్ ఓలెడ్ డిస్ప్లేతో గూగుల్ తన తర్వాతి స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తుందని టాక్. వీటి కోసం ఎల్జీ డిస్ ప్లే సంస్థ నుంచి 880 మిలియన్ డాలర్ల ఓలెడ్ డిస్ ప్లేలను కూడా ఆర్డర్ చేసిందట. మరోవైపు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో నిరంతరం ఆపిల్ తో పోటీపడే శాంసంగ్, ఆ కంపెనీకి ఓలెడ్ డిస్ ప్లేల సరుకు రవాణా చేస్తుందని తెలుస్తోంది. ముందస్తు ఫోన్ల కంటే మెరుగైన కెమెరా, 3.5ఎంఎం ఆడియో జాక్, వాటర్ ప్రూఫ్ బాడీ, ప్రీమియం మెటాలిక్ ఫిన్నిస్ తో దీన్ని రూపొందిస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. -
ప్రీ-రిజిస్ట్రేషన్లకు వచ్చిన శాంసంగ్ లేటెస్ట్ ఫోన్స్
శాంసంగ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్లు గతవారం మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఐఫోన్ కిల్లర్ గా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లు ఇక ఇండియాలోకి చాలా త్వరగానే రాబోతున్నాయట. దీన్ని సూచిస్తూ కంపెనీ గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్ల ప్రీ-రిజిస్ట్రేషన్లను భారత్ లో ప్రారంభించేసింది. ఎగ్జాట్ ధర, అందుబాటులో ఉండే వివరాలపై ప్రస్తుతం కంపెనీ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. కానీ తాజా పరిణామాలను బట్టి చూస్తూంటే శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లు అతిత్వరలోనే మార్కెట్లో కనువిందు చేసే అవకాశముందని తెలుస్తోంది. ప్రీ-రిజిస్ట్రేషన్ పేజీలో యూజర్ల కాంటాక్ట్ సమాచారమంతటిన్నీ సేకరిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చే వివరాలను ఈ-మెయిల్ చేయనుంది. ఎస్8, ఎస్8 ప్లస్ ఫీచర్లు... ఎస్8 డిస్ ప్లే: 5.8 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే ఎస్8 ప్లస్ డిస్ ప్లే: 6.2 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే రెండు స్మార్ట్ ఫోన్లకు 12 మెగాపిక్సెల్ డ్యూయల్ పిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఆటో ఫోకస్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 256 జీబీ వరకు విస్తరణ మెమరీ ఈ రెండు స్మార్ట్ ఫోన్లు వైర్ లెస్ ఛార్జింగ్ ను సపోర్టు చేయనున్నాయి. ఐరిష్ స్కానర్, కళ్ళతో అన్‌లాక్ ఆండ్రాయిడ్ నూగట్ 7.0 ఎస్8కు 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం , ఎస్8 ప్లస్ కు 3500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. -
గెలాక్సీ ఎస్8 అమ్మకాలు ఆ రోజునుంచే..
గెలాక్సీ నోట్7 ఫెయిల్యూర్ తర్వాత శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న గెలాక్సీ ఎస్8, ఎస్8+ స్మార్ట్ ఫోన్లు న్యూయార్క్ వేదికగా మార్చి 29న లాంచ్ కాబోతున్నాయి. వచ్చే నెలలో లాంచ్ చేస్తున్న ఈ గెలాక్సీ ఎస్ 8 విక్రయాలను కంపెనీ ఏప్రిల్ 21 నుంచి చేపడుతుందని తెలుస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం తన స్వదేశంలోనూ, అంతర్జాతీయ మార్కెట్లోనూ గెలాక్సీ ఎస్8 అమ్మకాలు ఏప్రిల్ 21 నుంచే అందుబాటులోకి వస్తాయని సమాచారం. మార్చి 29న గెలాక్సీ ఎస్8ను శాంసంగ్ లాంచ్ చేస్తుందని, ఏప్రిల్ 14 నుంచి అమ్మకాలు ప్రారంభిస్తుందని ముందస్తు రిపోర్టులు పేర్కొన్నాయి. కానీ మరికొన్ని రోజులు ఆలస్యంగా వినియోగదారులకు ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. రెండు స్క్రీన్ సైజు వేరియంట్లలో గెలాక్సీ ఎస్8, ఎస్8+లను శాంసంగ్ తీసుకొస్తోంది. స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ ఈ ఫోన్లలో ఉన్నాయట.డ్యూయల్ రియర్ కెమెరా దీనికి ప్రత్యేక ఆకర్షణ అని తెలుస్తోంది. అంతేకాక ఆదివారం లాంచ్ కాబోతున్న ఎల్జీ తర్వాతి ఫ్లాట్ షిప్ స్మార్ట్ ఫోన్ జీ6 అమ్మకాలు కూడా మార్చి 10 ప్రారంభమవుతాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. బెర్సిలోనాలో దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ముందస్తు రిజిస్ట్రేషన్లను మార్చి2 నుంచి మార్చి 9 వరకు కంపెనీ చేపడుతుందని తెలుస్తోంది.