ప్రీ-రిజిస్ట్రేషన్లకు వచ్చిన శాంసంగ్ లేటెస్ట్ ఫోన్స్
ప్రీ-రిజిస్ట్రేషన్లకు వచ్చిన శాంసంగ్ లేటెస్ట్ ఫోన్స్
Published Wed, Apr 5 2017 3:27 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM
శాంసంగ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్లు గతవారం మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఐఫోన్ కిల్లర్ గా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లు ఇక ఇండియాలోకి చాలా త్వరగానే రాబోతున్నాయట. దీన్ని సూచిస్తూ కంపెనీ గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్ల ప్రీ-రిజిస్ట్రేషన్లను భారత్ లో ప్రారంభించేసింది. ఎగ్జాట్ ధర, అందుబాటులో ఉండే వివరాలపై ప్రస్తుతం కంపెనీ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. కానీ తాజా పరిణామాలను బట్టి చూస్తూంటే శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లు అతిత్వరలోనే మార్కెట్లో కనువిందు చేసే అవకాశముందని తెలుస్తోంది. ప్రీ-రిజిస్ట్రేషన్ పేజీలో యూజర్ల కాంటాక్ట్ సమాచారమంతటిన్నీ సేకరిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చే వివరాలను ఈ-మెయిల్ చేయనుంది.
ఎస్8, ఎస్8 ప్లస్ ఫీచర్లు...
ఎస్8 డిస్ ప్లే: 5.8 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే
ఎస్8 ప్లస్ డిస్ ప్లే: 6.2 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే
రెండు స్మార్ట్ ఫోన్లకు 12 మెగాపిక్సెల్ డ్యూయల్ పిక్సెల్ రియర్ కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఆటో ఫోకస్
4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్, 256 జీబీ వరకు విస్తరణ మెమరీ
ఈ రెండు స్మార్ట్ ఫోన్లు వైర్ లెస్ ఛార్జింగ్ ను సపోర్టు చేయనున్నాయి.
ఐరిష్ స్కానర్, కళ్ళతో అన్‌లాక్
ఆండ్రాయిడ్ నూగట్ 7.0
ఎస్8కు 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం , ఎస్8 ప్లస్ కు 3500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంది.
Advertisement
Advertisement