Pre-Registrations
-
BGMI టీజర్ విడుదల: గేమ్‌ను 2060లో విడుదల చేస్తావా ఏంటి?!
పబ్జీ గేమ్.. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(BGMI) పేరుతో భారత్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గేమ్‌ను డిజైన్ చేసిన క్రాఫ్టన్ సంస్థ ప్రీ-రిజిస్ట్రేషన్లు, అప్డేట్స్, దానికి సంబంధించిన ఓ టీజర్ విడుదల చేయడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే గేమింగ్ లవర్స్ ఆసక్తికి అనుగుణంగా సదరు సంస్థ గేమ్‌ను విడుదల చేయడంతో విఫలమైందంటూ గేమింగ్ ప్రియులు పెదవి విరుస్తున్నారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా రానున్న పబ్జీ గేమ్ ను ఆడేందుకు ఔత్సాహికులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో ఈ గేమ్‌ను విడుదల చేసేందుకు పబ్జీ మాతృసంస్థ క్రాఫ్టన్ సంస్థ ప్రతినిధులు గేమ్‌ను రీ డిజైన్ చేసి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభింభించారు. దీంతో గేమ్ లవర్స్ భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అదే సమయంలో టీజర్‌ను విడుదల చేసింది. అయితే ఈ టీజర్ విడుదలతో గేమ్‌ను ఇన్స్టాల్ చేసుకొని ఆడేందుకు గేమింగ్ ప్రియులు ప్రయత్నించారు. కానీ ఆ గేమ్ ఇన్స్టాల్ చేసే ఆప్షన్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో ప్రి రిజిస్ట్రేషన్లు భారీ స్థాయిలో చేసుకుంటున్నారని ప్రచారం చేసుకోవడం కాదు.. గేమ్ ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్‌ను కూడా క్రియేట్ చేయాలి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు 2060 సంవత్సరం అయినా క్రాఫ్టన్ సంస్థ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా ప్రి రిజిస్ట్రర్ నౌ అని ప్రచారం చేసుకుంటుందని ట్రోల్ చేస్తున్నారు. కాగా, ప్రముఖ పబ్జీ గేమ్ మొబైల్ ఇన్ఫ్లుయెన్సర్ సాగర్ ఠాకూర్ ఇటీవల పబ్జీ మొబైల్ ఇండియన్ వెర్షన్ విడుదల తేదీని ప్రకటించి విషయం తెలిసిందే. జూన్ 18న విడుదల కానుందని బైనరీ కోడ్ ద్వారా ఆయన వెల్లడించారు. -
ప్రీ-రిజిస్ట్రేషన్లకు వచ్చిన శాంసంగ్ లేటెస్ట్ ఫోన్స్
శాంసంగ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్లు గతవారం మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఐఫోన్ కిల్లర్ గా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లు ఇక ఇండియాలోకి చాలా త్వరగానే రాబోతున్నాయట. దీన్ని సూచిస్తూ కంపెనీ గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్ల ప్రీ-రిజిస్ట్రేషన్లను భారత్ లో ప్రారంభించేసింది. ఎగ్జాట్ ధర, అందుబాటులో ఉండే వివరాలపై ప్రస్తుతం కంపెనీ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. కానీ తాజా పరిణామాలను బట్టి చూస్తూంటే శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లు అతిత్వరలోనే మార్కెట్లో కనువిందు చేసే అవకాశముందని తెలుస్తోంది. ప్రీ-రిజిస్ట్రేషన్ పేజీలో యూజర్ల కాంటాక్ట్ సమాచారమంతటిన్నీ సేకరిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చే వివరాలను ఈ-మెయిల్ చేయనుంది. ఎస్8, ఎస్8 ప్లస్ ఫీచర్లు... ఎస్8 డిస్ ప్లే: 5.8 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే ఎస్8 ప్లస్ డిస్ ప్లే: 6.2 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే రెండు స్మార్ట్ ఫోన్లకు 12 మెగాపిక్సెల్ డ్యూయల్ పిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఆటో ఫోకస్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 256 జీబీ వరకు విస్తరణ మెమరీ ఈ రెండు స్మార్ట్ ఫోన్లు వైర్ లెస్ ఛార్జింగ్ ను సపోర్టు చేయనున్నాయి. ఐరిష్ స్కానర్, కళ్ళతో అన్‌లాక్ ఆండ్రాయిడ్ నూగట్ 7.0 ఎస్8కు 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం , ఎస్8 ప్లస్ కు 3500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంది.