గెలాక్సీ ఎస్8 అమ్మకాలు ఆ రోజునుంచే..
గెలాక్సీ ఎస్8 అమ్మకాలు ఆ రోజునుంచే..
Published Fri, Feb 24 2017 9:52 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM
గెలాక్సీ నోట్7 ఫెయిల్యూర్ తర్వాత శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న గెలాక్సీ ఎస్8, ఎస్8+ స్మార్ట్ ఫోన్లు న్యూయార్క్ వేదికగా మార్చి 29న లాంచ్ కాబోతున్నాయి. వచ్చే నెలలో లాంచ్ చేస్తున్న ఈ గెలాక్సీ ఎస్ 8 విక్రయాలను కంపెనీ ఏప్రిల్ 21 నుంచి చేపడుతుందని తెలుస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం తన స్వదేశంలోనూ, అంతర్జాతీయ మార్కెట్లోనూ గెలాక్సీ ఎస్8 అమ్మకాలు ఏప్రిల్ 21 నుంచే అందుబాటులోకి వస్తాయని సమాచారం. మార్చి 29న గెలాక్సీ ఎస్8ను శాంసంగ్ లాంచ్ చేస్తుందని, ఏప్రిల్ 14 నుంచి అమ్మకాలు ప్రారంభిస్తుందని ముందస్తు రిపోర్టులు పేర్కొన్నాయి. కానీ మరికొన్ని రోజులు ఆలస్యంగా వినియోగదారులకు ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి.
రెండు స్క్రీన్ సైజు వేరియంట్లలో గెలాక్సీ ఎస్8, ఎస్8+లను శాంసంగ్ తీసుకొస్తోంది. స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ ఈ ఫోన్లలో ఉన్నాయట.డ్యూయల్ రియర్ కెమెరా దీనికి ప్రత్యేక ఆకర్షణ అని తెలుస్తోంది. అంతేకాక ఆదివారం లాంచ్ కాబోతున్న ఎల్జీ తర్వాతి ఫ్లాట్ షిప్ స్మార్ట్ ఫోన్ జీ6 అమ్మకాలు కూడా మార్చి 10 ప్రారంభమవుతాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. బెర్సిలోనాలో దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ముందస్తు రిజిస్ట్రేషన్లను మార్చి2 నుంచి మార్చి 9 వరకు కంపెనీ చేపడుతుందని తెలుస్తోంది.
Advertisement