LG G6
-
ఎల్జీ జీ6పై మరోసారి భారీ డిస్కౌంట్
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్జీ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ 'జీ6' పై మరోసారి భారీ తగ్గింపును ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ ఎక్స్ క్లూజివ్ డిస్కౌంట్ కింద కొనుగోలుదారులకు రూ.13వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే ఈ డిస్కౌంట్ కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ కలిగి ఉన్నవారికేనని కంపెనీ తెలిపింది. అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ పై కంపెనీ అదనపు డిస్కౌంట్లను, ఎలాంటి ఖర్చులు లేని ఈఎంఐ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐస్ ప్లాటినం, ఆస్ట్రో బ్లాక్ రంగుల ఆప్షన్లపై ఈ డిస్కౌంట్ వర్తించనుంది. దీంతో లాంచింగ్ సందర్భంగా రూ.51,990గా ఈ ఫోన్, ప్రైమ్ మెంబర్లకు రూ.38,990కే లభ్యమవుతోంది. ఎల్జీ జీ6 స్మార్ట్ ఫోన్ పై ఇదే అత్యంత తక్కువ ధర. అంతకముందు మే నెలలో కూడా ఈ ఫోన్ పై 10వేల రూపాయల తగ్గింపును కంపెనీ పరిమిత కాల వ్యవధిలో అందించింది. లాంచ్ అయిన రెండు నెలలోనే రెండు సార్లు భారీ తగ్గింపును కంపెనీ ప్రకటించడం విశేషం. భారీ డిస్కౌంట్ ఆఫర్లతో పాటు బజాజ్ ఫైనాన్స్ కార్డులపై ఎలాంటి ధరలు లేని ఈఎంఐ ఆప్షన్లను ఆఫర్ చేస్తున్నామని అమెజాన్ తెలిపింది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి 100జీబీ వరకు అదనపు 4జీ రిలయన్స్ జియో డేటా కూడా వస్తోంది. ఈ ఫోన్ భారత్ లో లాంచైనప్పటి నుంచి రిలయన్స్ జియో డేటా ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఫిబ్రవరిలో మొదటిసారి ఎండబ్ల్యూసీ 2017లో ఎల్జీ జీ6 ను లాంచ్ చేశారు. ఏప్రిల్ లో భారత్ లో రూ.51,990కు దీన్ని ప్రవేశపెట్టారు. -
ఎల్జీ జీ 6 ధరలో భారీ తగ్గింపు..
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్జీ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ 'జీ6' పై భారీ తగ్గింపును ప్రకటించింది. రూ.10 వేల తగ్గింపుతో రూ.41,990 అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా 2017 వరల్డ్ కాంగ్రెస్‌లో డ్యూయల్ కెమెరాలతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌పోన్‌ను గత నెలలోనే భారత్‌లోనే ప్రవేశపెట్టింది .దీని లాంచింగ్ ధర రూ.51,990. అయితే ఈ ఆఫర్ కేవలం మే 18 నుంచి జూన్ 15 వరకు మాత్రమే ఉంది. ముంబై రీటైలర్ అందించిన సమాచారం ప్రకారం 20 సంవత్సరాల భాగస్వామ్యం సందర్భంగా ఎల్జీ ఇతర ఉత్పతులపై పలు ఆఫర్లను అందిస్తోంది. అయితే మిగతా ఇ-సైట్లలో ఈ స్మార్ట్ ఫోన్ ధరను పరిశీలించాల్సి ఉంది. ఎల్జీ జీ6 ఫీచర్లు 5.7 ఇంచ్ క్యూహెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే 1440 x 2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13, 13 మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరాలు 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0 #LGG6 offer price Rs.41990/- only pic.twitter.com/5dmaIcCg13 — Mahesh Telecom (@MAHESHTELECOM) May 18, 2017 -
ఎల్జీ జీ6 ఆ రోజుకొంటే 10వేల క్యాష్ బ్యాక్
శాంసంగ్ గెలాక్సీ లేటెస్ట్ మొబైల్ ఎస్8కి గట్టి పోటీగా మరో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేసింది. ఎల్జీ జీ6 పేరుతో అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ఫోన్ లాంచింగ్ తో పాటు స్పెషల్ ఆఫర్లను కూడా మీకోసం కంపెనీ తీసుకొచ్చేసింది. ఎల్జీ జీ6 ఫోన్ ను ప్రీ బుక్ చేసుకునే వారికి 7000 రూపాయల డిస్కౌంట్ ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే ఆ వినియోగదారులు హెచ్డీఎఫ్సీ లేదా ఎస్బీఐ క్రెడిట్/ డెబిట్ కార్డు హోల్డర్లు అయి ఉండాలని తెలిపింది. అంతేకాక ఏప్రిల్ 25న కొనుగోలు చేసే కస్టమర్లకు 10వేల రూపాయల క్యాష్ బ్యాక్ ను ఇవ్వనున్నట్టు తెలిపింది. రిలయన్స్ జియో కూడా ఈ ఫోన్ పై బంపర్ ఆఫర్లనే తీసుకొచ్చింది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లకు 2018 మార్చి వరకు 100జీబీ అదనపు డేటాను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. అంటే ప్రతి 309 రీఛార్జ్ పై 10జీబీ అదనపు డేటా అన్నమాట.రెండు వేరియంట్లలో లాంచ్ చేసిన ఈ ఫోన్ ఏప్రిల్ 25 నుంచి ప్రత్యేకంగా అమెజాన్ ఇండియా ప్లాట్ ఫామ్ పై అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధర 51,990 రూపాయలు. మిస్టిక్ వూట్, అస్ట్రో బ్లాక్, ఐస్ ప్లాటినం మూడు రంగుల్లో ఇది లభ్యం కానుంది. డాల్బీ విజన్ ఫీచర్ తో వస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్ ఇదేనని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. -
గెలాక్సీకి పోటీగా ఎల్జీ ‘జీ 6’ లాంచ్..ధర ఎంత?
న్యూఢిల్లీ: సౌత్ కొరియా మొబైల్ మేకర్ ఎల్జీ మార్కెట్లోకి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఎల్జీ జీ 6 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత ఫిబ్రవరిలో మొబైల్ వరల్ఢ్ కాంగ్రెస్ లో ప్రకటించిన ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ ధరను కంపెనీ రూ.51,990గా నిర్ణయించింది. రెండు వేరియంట్లలో వస్తున్న జీ 6 ఏప్రిల్ 25నుంచి అమెజాన్ ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉండనుంది. డాల్బీ విజన్ ఫీచర్ తో వస్తున్న ప్రపంచంలో మొట్టమొదిటి ఫోన్‌గా భావిస్తున్నారు. ఇప్పటివరకు హై ఎండ్ టీవీలలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండడం ఈ జీ6 ప్రత్యేకత. ఎల్జీ జీ 6 ఫీచర్లు 5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే గొరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 2880 x1400 పిక్సెల్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ క్వాల్కామ్ ఎంఎస్ఎం 8996 స్నాప్ డ్రాగన్821 ప్రోసెసర్ 4జీబీ ర్యామ్ 32జీబీ, 64 ఇంటర్నల్ స్టోరేజ్, 2 టీబీ దాకా ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం 13 మెగాపిక్సెల్ రియర్ డబుల్ కెమెరా 5 మెగాపిక్సెల్ ముందు కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా జీ 5కి కొనసాగింపుగా వస్తున్న జీ6లో అసాధారణంగా ఫుల్ విజన్ డిస్ప్లేను అందిస్తున్న ట్టు ప్రకటించింది. మిస్టిక్ వూట్, అస్ట్రో బ్లాక్, ఐస్ ప్లాటినం మూడు రంగుల్లో ఇది లభ్యం కానుంది. రూ.51,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు రేపటి నుంచి లభ్యం కానుంది. మరోవైపు రూ. 57,990 రేంజ్ లో ఇటీవల లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌కి గట్టిపోటీ ఇవ్వనుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. -
గెలాక్సీ ఎస్8 అమ్మకాలు ఆ రోజునుంచే..
గెలాక్సీ నోట్7 ఫెయిల్యూర్ తర్వాత శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న గెలాక్సీ ఎస్8, ఎస్8+ స్మార్ట్ ఫోన్లు న్యూయార్క్ వేదికగా మార్చి 29న లాంచ్ కాబోతున్నాయి. వచ్చే నెలలో లాంచ్ చేస్తున్న ఈ గెలాక్సీ ఎస్ 8 విక్రయాలను కంపెనీ ఏప్రిల్ 21 నుంచి చేపడుతుందని తెలుస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం తన స్వదేశంలోనూ, అంతర్జాతీయ మార్కెట్లోనూ గెలాక్సీ ఎస్8 అమ్మకాలు ఏప్రిల్ 21 నుంచే అందుబాటులోకి వస్తాయని సమాచారం. మార్చి 29న గెలాక్సీ ఎస్8ను శాంసంగ్ లాంచ్ చేస్తుందని, ఏప్రిల్ 14 నుంచి అమ్మకాలు ప్రారంభిస్తుందని ముందస్తు రిపోర్టులు పేర్కొన్నాయి. కానీ మరికొన్ని రోజులు ఆలస్యంగా వినియోగదారులకు ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. రెండు స్క్రీన్ సైజు వేరియంట్లలో గెలాక్సీ ఎస్8, ఎస్8+లను శాంసంగ్ తీసుకొస్తోంది. స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ ఈ ఫోన్లలో ఉన్నాయట.డ్యూయల్ రియర్ కెమెరా దీనికి ప్రత్యేక ఆకర్షణ అని తెలుస్తోంది. అంతేకాక ఆదివారం లాంచ్ కాబోతున్న ఎల్జీ తర్వాతి ఫ్లాట్ షిప్ స్మార్ట్ ఫోన్ జీ6 అమ్మకాలు కూడా మార్చి 10 ప్రారంభమవుతాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. బెర్సిలోనాలో దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ముందస్తు రిజిస్ట్రేషన్లను మార్చి2 నుంచి మార్చి 9 వరకు కంపెనీ చేపడుతుందని తెలుస్తోంది. -
లాంచింగ్ కు ముందే..ఎల్జీ జీ6 లీక్
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ తన జీ సిరీస్ లోని కొత్త స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. అయితే జీ6 పేరుతో వస్తున్న ఈ తాజా ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో లీక్ అయింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ..అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు యోచిస్తున్న జీ6 స్మార్ట్ ఫోను ఇమేజ్ ఇపుడు ఆన్ లైన్ హల్ చల్ చేస్తోంది. ఎల్ జీ జీ5 స్మార్ట్ ఫోను డిజైన్ కు భిన్నంగా దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. పూర్తి గ్లాస్ అండ్ మెటల్ బాడీతో అందుబాటులోకి రానుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కార్యక్రమంలో భారత్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ఫిబ్రవరి 26 న బార్సిలోనాలో జరిగే ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే ఆహ్వానాలు పంపడం ప్రారంభించింది సంస్థ. తాజా లీకుల ప్రకారం ఈ స్మార్ట్ ఫోను 5.7-అంగుళాల డిస్ ప్లే , 3.5ఎంఎ ఆడియో జాక్, వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో అందుబాటులోకి రానుంది. ఎడమవైపు వాల్యూమ్ రాకర్ బటన్లు , డబుల్ కెమెరా సెటప్ , ఫ్రింగర్ ప్రింట్ సెన్సర్, సరికొత్త కూలింగ్ టెక్నాలజీ సామర్థ్యంతో క్వాల్కం స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ తదితర ఫీచర్స్ తో మార్కెట్లోకి రానుంది. అయితే ఈవెంట్ లో శాంసంగ్ పాల్గొనకపోవడంతో ఎల్ జీ పెద్ద ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.