లాంచింగ్ కు ముందే..ఎల్జీ జీ6 లీక్
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ తన జీ సిరీస్ లోని కొత్త స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. అయితే జీ6 పేరుతో వస్తున్న ఈ తాజా ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో లీక్ అయింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ..అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు యోచిస్తున్న జీ6 స్మార్ట్ ఫోను ఇమేజ్ ఇపుడు ఆన్ లైన్ హల్ చల్ చేస్తోంది. ఎల్ జీ జీ5 స్మార్ట్ ఫోను డిజైన్ కు భిన్నంగా దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. పూర్తి గ్లాస్ అండ్ మెటల్ బాడీతో అందుబాటులోకి రానుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కార్యక్రమంలో భారత్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ఫిబ్రవరి 26 న బార్సిలోనాలో జరిగే ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే ఆహ్వానాలు పంపడం ప్రారంభించింది సంస్థ. తాజా లీకుల ప్రకారం ఈ స్మార్ట్ ఫోను 5.7-అంగుళాల డిస్ ప్లే , 3.5ఎంఎ ఆడియో జాక్, వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో అందుబాటులోకి రానుంది. ఎడమవైపు వాల్యూమ్ రాకర్ బటన్లు , డబుల్ కెమెరా సెటప్ , ఫ్రింగర్ ప్రింట్ సెన్సర్, సరికొత్త కూలింగ్ టెక్నాలజీ సామర్థ్యంతో క్వాల్కం స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ తదితర ఫీచర్స్ తో మార్కెట్లోకి రానుంది.
అయితే ఈవెంట్ లో శాంసంగ్ పాల్గొనకపోవడంతో ఎల్ జీ పెద్ద ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.