సోనీ ఎక్స్పీరియా ఎక్స్2 ఫోటోల హల్చల్
సోనీ ఎక్స్పీరియా ఎక్స్2 ఫోటోల హల్చల్
Published Fri, Feb 10 2017 7:04 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
స్మార్ట్ఫోన్ కంపెనీల ఎంతో ప్రతిష్టాత్మక ఈవెంట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో లాంచ్ చేద్దామనుకున్న సోనీ ఎక్స్పీరియా హ్యాండ్సెట్ ఫోటోలు లీకేజీ బారిన పడ్డాయి. త్వరలో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్ఫోన్ ఫోటోలను నెదర్లాండ్స్కు చెందిన వెబ్సైట్ టెక్టాస్టింగ్ రివీల్ చేసింది. ఈ వెబ్సైట్ పబ్లిక్ చేసిన కొన్ని ఫోటోలు ఎక్స్పీరియా ఎక్స్2విగా టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇమేజస్ కూడా కంపెనీ ఇంతకముందు విడుదల చేసిన ఫోన్ల మాదిరిగానే ఉన్నాయంటున్నారు. లీకైన ఫోటోలు సోనీ ఎక్స్పీరియా ఎక్స్2 గురించి మరీ అంత ఎక్కువగా సమాచారం ఇవ్వనప్పటికీ, ఆ స్మార్ట్ఫోన్ ఎక్స్పీరియా ఎక్స్జెడ్ను రీప్లేస్ చేస్తుందని తెలుపుతున్నాయని టెక్ విశ్లేషకుల పరిశీలన. స్టాండర్డ్ ఓమ్నిబ్యాలెన్స్ డిజైన్ను ఇది కలిగి ఉందట. ఇదే డిజైన్ను కంపెనీ తన స్మార్ట్ఫోన్లకు వాడుతోంది.
ఒక ఫోన్ పెద్ద బెజిల్(డిస్ప్లే చుట్టూ ఉండే ఫ్రేమ్)ను కలిగిఉంటే, మరొకటి స్లిమ్ బెజిల్తో దర్శనమిస్తోంది. ఈ ఇమేజ్లోనే ఫోన్ మెమరీ ఎంత కలిగి ఉందో కూడా తెలుస్తుందట. 4జీబీ ర్యామ్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఇది మన ముందుకు రాబోతుందట. ముందస్తు రిపోర్టుల ప్రకారం జపనీస్కు చెందిన ఈ దిగ్గజం ఎండబ్ల్యూసీ ఈవెంట్లో కనీసం ఐదు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుందని తెలిసింది. అయితే ఏయే మోడల్స్ను ఇది విడుదల చేస్తుందో రిపోర్టులు తెలుపలేదు. ఎండబ్ల్యూసీ ఈవెంట్ ప్రారంభ వేడుకలో అంటే ఫిబ్రవరి 27న సోనీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతుంది. ఒకవేళ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్స్పీరియా ఎక్స్2 గురించి ప్రకటన వెలువరిస్తే, ఇక వినియోగదారులు ఎన్నో రోజులు సోనీ కొత్త మొబైల్ గురించి వేచిచూడాల్సినవసరం ఉండదు.
Advertisement