MWC 2017
-
బ్లాక్ బెర్రీ ఆఖరి స్మార్ట్ ఫోన్..ధరెంతో తెలుసా?
స్మార్ట్ ఫోన్ కంపెనీల మెగా ఈవెంట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ప్రారంభానికి ముందు బ్లాక్ బెర్రీ తన లాస్ట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. బ్లాక్ బెర్రీ కీవన్ పేరుతో ఈ కెనడియన్ కంపెనీ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన ఇన్-హౌజ్‌లో రూపొందించిన చివరి స్మార్ట్ ఫోన్ బ్లాక్ బెర్రీకి ఇదే కాబోతుంది. ఇప్పటినుంచి స్మార్ట్ ఫోన్ డిజైన్‌ను, ఉత్పత్తిని ఈ కంపెనీ పూర్తిగా నిలిపివేయబోతుంది. గత సెప్టెంబర్‌లోనే ఈ నిర్ణయాన్ని బ్లాక్ బెర్రీ ప్రకటించింది. చివరిగా మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త బ్లాక్ బెర్రీ కీవన్, పిజికల్ కీబోర్డును కలిగి ఉంది. 2017 ఏప్రిల్ నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. ధర 549 డాలర్లు(సుమారు రూ.38,600)గా కంపెనీ నిర్ణయించింది. అయితే యూకేలో ఈ ఫోన్ 499 జీబీపీ(సుమారు రూ.41,400), యూరప్‌లో 599 యూరోలకు(సుమారు రూ.41,400) అందుబాటులో ఉండనుంది. బ్లాక్ బెర్రీ కీవన్ స్పెషిఫికేషన్లు... 4.5 అంగుళాల ఫుల్-హెచ్డీ ఐపీఎస్ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టా-కోర్ ఎస్ఓసీ 3జీబీ ర్యామ్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ 2టీబీ వరకు విస్తరణ మెరీ 3505 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 7.1 నోగట్ విత్ బ్లాక్ బెర్రీ బిజినెస్, సెక్యురిటీ ఫీచర్లు -
మోటో కొత్త ఫోన్లు లీక్.. ఫీచర్లివేనట!
లెనోవో మిడ్ రేంజ్లో తీసుకొస్తున్న మోటో జీ5, జీ5 ప్లస్ స్మార్ట్ఫోన్లు లాంచింగ్‌కు ముందే లీకైపోయాయి. ఫిబ్రవరి 26న బార్సిలోనాలో జరుగబోయే ఎండబ్ల్యూసీ 2017 ఈవెంట్లో వీటిని కంపెనీ అధికారికంగా లాంచ్ చేసేందుకు రంగం చేసుకుంది. కానీ అధికారికంగా లాంచింగ్‌కు ముందే వీటిని స్పానిస్ ఆన్ లైన్ రిటైలర్ తన సైట్ లో లిస్టుచేసేసింది. స్పెషిఫికేషన్స్, ఫీచర్లు, ఇతర వివరాలన్నింటిన్నీ ఈ రిటైలర్ లిస్టు చేసింది. మోటో జీ5, జీ5 ప్లస్ డిజైన్... మార్కెట్లోకి ఇక ఎంట్రీ ఇవ్వబోతున్న మోటో జీ5, జీ5 ప్లస్‌లు స్పోర్ట్ మెటల్ బాడీస్‌తో రాబోతున్నాయట. సైడ్ ప్యానెల్స్ విషయంలో లెనోవో బ్రాండింగ్ లో ఈ ఫోన్ మన ముందుకు వస్తోందని తెలుస్తోంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫ్రంట్ ప్యానెల్ లో ఉండబోతుందట. ప్రైమరీ కెమెరా వెనుకవైపు సర్క్యూలర్ డిజైన్ లో ఉంటుంది. మోటో ''ఎం'' లోగో కూడా వెనుకవైపే ఉంది. మోటో జీ5 స్పెషిఫికేషన్స్... 5 అంగుళాల ఫుడ్-హెచ్డీ డిస్ ప్లే, 32జీబీ బోర్డు స్టోరేజ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 1.4గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 430 ఎస్ఓసీ, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ సపోర్టును కలిగి ఉంటుంది. మోటో జీ5 ప్లస్ స్పెషిఫికేషన్స్... 5.2 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ ప్లే, 64జీబీ స్టోరేజ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 ఎంపీ కెమెరా విత్ డ్యూయల్ ఆటోఫోకస్ ఫీచర్, 2 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీ, 4జీ ఎల్టీఈ, 155 గ్రాముల బరువు ఇవీ మోటో జీ5 ప్లస్ ప్రత్యేకతలు. రెండు ఫోన్లకు ఉండబోయే సిమిలర్ ఫీచర్స్.. ఫుల్-హెచ్డీ స్క్రీన్ రెజుల్యూషన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కవర్ ఆండ్రాయిడ్ 7.0 నోగట్ 128జీబీ వరకు ఎక్స్ పాండబుల్ మెమరీ 2జీబీ ర్యామ్ 5ఎంపీ ఫ్రంట్ కెమెరా వాటర్ రిపేలెంట్ కోటింగ్ -
నోకియా బుల్లి ఫోన్ కమింగ్ సూన్...
అప్పట్లో మొబైల్ ప్రపంచానికి ఐకానిక్ బ్రాండు. ఎప్పటికీ చెక్కుచెదరని డిజైన్, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యత గల ఫోన్ గా మధ్యతరగతి ప్రజలతో ఎక్కువగా మమేకమైన నోకియా 3310, మళ్లీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. బెర్సీలోనాలో జరుగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(ఎండబ్ల్యూసీ) 2017లో దీన్ని ప్రవేశపెట్టాలని కంపెనీ ప్లాన్ చేస్తుందట. ఈ ఫోన్ ను 2000లో మొదటిసారి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం తీసుకురాబోతున్న ఈ ఫోన్ ధర సుమారు రూ.4173గా ఉండనున్నట్టు తెలుస్తోంది. మార్కెట్లోకి రాబోతున్న ఫోన్లను ముందస్తుగా లీక్ చేసే ఇవాన్ బ్లాస్ ఈ విషయాన్ని తెలిపారు. నోకియా ఫోన్లను ఉత్పత్తి చేయడానికి లైసెన్సు హక్కులను రాబట్టుకున్న హెచ్ఎండీ గ్లోబల్, ఫిన్నిస్ కంపెనీ దీన్ని ప్రవేశపెట్టబోతుందని పేర్కొన్నారు. నోకియా 3310 ఫోన్ అంటే అప్పట్లో ఎక్కువగా క్రేజ్ ఉండేది. దానికి గల కారణం, అది అందించే ఫీచర్లే. ఎస్ఎంఎస్ క్యారెక్టర్ కంటే ఎక్కువగా మెసేజ్ లు చేసుకునే సామర్ధ్యం, 84 x 48 పిక్సెల్ మోనోక్రోమ్ స్క్రీన్, స్క్రీన్ సేవర్స్, క్యాలిక్యులేటర్, గేమ్స్, ఏడు రింగ్ టోన్స్, వెనుక, ముందు వైపు ఎప్పడికప్పుడూ కవర్ మార్చుకుంటూ ఎప్పుడు కొత్త ఫోన్ లా మెరిసిపోయేలా చేసుకోవడం దీన్ని ప్రత్యేకతలు. అంతేకాక 55 గంటల పాటు నిరంతరాయంగా పనిచేయగల ఫోన్ గా ఇది తెగ గుర్తింపు పొందింది. దీంతో మళ్లీ ఈ ఫోన్ ను తీసుకొచ్చి లో ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వాలని కంపెనీ ప్లాన్ చేస్తుందట.ఈ ఏడాది జనవరిలో నోకియా మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హెచ్ఎమ్డీ గ్లోబల్ నోకియా 6 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. రిలీజ్‌కు ముందే 14 లక్షల బుకింగ్స్ రావడం విశేషం. చైనా ఈకామర్స్ వెబ్సైట్ జేడీ.కామ్ ద్వారా ఈ ఫోన్లు విక్రయానికి ఉంచారు. -
సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్2 ఫోటోల హల్చల్
స్మార్ట్‌ఫోన్ కంపెనీల ఎంతో ప్రతిష్టాత్మక ఈవెంట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో లాంచ్ చేద్దామనుకున్న సోనీ ఎక్స్‌పీరియా హ్యాండ్సెట్ ఫోటోలు లీకేజీ బారిన పడ్డాయి. త్వరలో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటోలను నెదర్లాండ్స్‌కు చెందిన వెబ్సైట్ టెక్టాస్టింగ్ రివీల్ చేసింది. ఈ వెబ్సైట్ పబ్లిక్ చేసిన కొన్ని ఫోటోలు ఎక్స్‌పీరియా ఎక్స్2విగా టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇమేజస్ కూడా కంపెనీ ఇంతకముందు విడుదల చేసిన ఫోన్ల మాదిరిగానే ఉన్నాయంటున్నారు. లీకైన ఫోటోలు సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్2 గురించి మరీ అంత ఎక్కువగా సమాచారం ఇవ్వనప్పటికీ, ఆ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఎక్స్జెడ్ను రీప్లేస్ చేస్తుందని తెలుపుతున్నాయని టెక్ విశ్లేషకుల పరిశీలన. స్టాండర్డ్ ఓమ్నిబ్యాలెన్స్ డిజైన్‌ను ఇది కలిగి ఉందట. ఇదే డిజైన్‌ను కంపెనీ తన స్మార్ట్ఫోన్లకు వాడుతోంది. ఒక ఫోన్ పెద్ద బెజిల్(డిస్ప్లే చుట్టూ ఉండే ఫ్రేమ్)ను కలిగిఉంటే, మరొకటి స్లిమ్ బెజిల్తో దర్శనమిస్తోంది. ఈ ఇమేజ్‌లోనే ఫోన్ మెమరీ ఎంత కలిగి ఉందో కూడా తెలుస్తుందట. 4జీబీ ర్యామ్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఇది మన ముందుకు రాబోతుందట. ముందస్తు రిపోర్టుల ప్రకారం జపనీస్‌కు చెందిన ఈ దిగ్గజం ఎండబ్ల్యూసీ ఈవెంట్లో కనీసం ఐదు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుందని తెలిసింది. అయితే ఏయే మోడల్స్‌ను ఇది విడుదల చేస్తుందో రిపోర్టులు తెలుపలేదు. ఎండబ్ల్యూసీ ఈవెంట్ ప్రారంభ వేడుకలో అంటే ఫిబ్రవరి 27న సోనీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతుంది. ఒకవేళ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎక్స్‌పీరియా ఎక్స్2 గురించి ప్రకటన వెలువరిస్తే, ఇక వినియోగదారులు ఎన్నో రోజులు సోనీ కొత్త మొబైల్ గురించి వేచిచూడాల్సినవసరం ఉండదు. -
లాంచింగ్ కు ముందే..ఎల్జీ జీ6 లీక్
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ తన జీ సిరీస్ లోని కొత్త స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. అయితే జీ6 పేరుతో వస్తున్న ఈ తాజా ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో లీక్ అయింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ..అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు యోచిస్తున్న జీ6 స్మార్ట్ ఫోను ఇమేజ్ ఇపుడు ఆన్ లైన్ హల్ చల్ చేస్తోంది. ఎల్ జీ జీ5 స్మార్ట్ ఫోను డిజైన్ కు భిన్నంగా దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. పూర్తి గ్లాస్ అండ్ మెటల్ బాడీతో అందుబాటులోకి రానుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కార్యక్రమంలో భారత్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ఫిబ్రవరి 26 న బార్సిలోనాలో జరిగే ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే ఆహ్వానాలు పంపడం ప్రారంభించింది సంస్థ. తాజా లీకుల ప్రకారం ఈ స్మార్ట్ ఫోను 5.7-అంగుళాల డిస్ ప్లే , 3.5ఎంఎ ఆడియో జాక్, వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో అందుబాటులోకి రానుంది. ఎడమవైపు వాల్యూమ్ రాకర్ బటన్లు , డబుల్ కెమెరా సెటప్ , ఫ్రింగర్ ప్రింట్ సెన్సర్, సరికొత్త కూలింగ్ టెక్నాలజీ సామర్థ్యంతో క్వాల్కం స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ తదితర ఫీచర్స్ తో మార్కెట్లోకి రానుంది. అయితే ఈవెంట్ లో శాంసంగ్ పాల్గొనకపోవడంతో ఎల్ జీ పెద్ద ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.