ఎల్జీ జీ6 ఆ రోజుకొంటే 10వేల క్యాష్ బ్యాక్
ఎల్జీ జీ6 ఆ రోజుకొంటే 10వేల క్యాష్ బ్యాక్
Published Mon, Apr 24 2017 3:53 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
శాంసంగ్ గెలాక్సీ లేటెస్ట్ మొబైల్ ఎస్8కి గట్టి పోటీగా మరో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేసింది. ఎల్జీ జీ6 పేరుతో అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ఫోన్ లాంచింగ్ తో పాటు స్పెషల్ ఆఫర్లను కూడా మీకోసం కంపెనీ తీసుకొచ్చేసింది. ఎల్జీ జీ6 ఫోన్ ను ప్రీ బుక్ చేసుకునే వారికి 7000 రూపాయల డిస్కౌంట్ ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే ఆ వినియోగదారులు హెచ్డీఎఫ్సీ లేదా ఎస్బీఐ క్రెడిట్/ డెబిట్ కార్డు హోల్డర్లు అయి ఉండాలని తెలిపింది. అంతేకాక ఏప్రిల్ 25న కొనుగోలు చేసే కస్టమర్లకు 10వేల రూపాయల క్యాష్ బ్యాక్ ను ఇవ్వనున్నట్టు తెలిపింది.
రిలయన్స్ జియో కూడా ఈ ఫోన్ పై బంపర్ ఆఫర్లనే తీసుకొచ్చింది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లకు 2018 మార్చి వరకు 100జీబీ అదనపు డేటాను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. అంటే ప్రతి 309 రీఛార్జ్ పై 10జీబీ అదనపు డేటా అన్నమాట.రెండు వేరియంట్లలో లాంచ్ చేసిన ఈ ఫోన్ ఏప్రిల్ 25 నుంచి ప్రత్యేకంగా అమెజాన్ ఇండియా ప్లాట్ ఫామ్ పై అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధర 51,990 రూపాయలు. మిస్టిక్ వూట్, అస్ట్రో బ్లాక్, ఐస్ ప్లాటినం మూడు రంగుల్లో ఇది లభ్యం కానుంది. డాల్బీ విజన్ ఫీచర్ తో వస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్ ఇదేనని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
Advertisement
Advertisement