ఎల్‌జీ జీ 6 ధరలో భారీ తగ్గింపు.. | LG G6 Receives Price Cut, Available for Rs 41,990 Now | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ జీ 6 ధరలో భారీ తగ్గింపు..

Published Sat, May 20 2017 3:27 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

ఎల్‌జీ జీ 6 ధరలో  భారీ తగ్గింపు.. - Sakshi

ఎల్‌జీ జీ 6 ధరలో భారీ తగ్గింపు..

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'జీ6' పై భారీ తగ్గింపును   ప్రకటించింది.  రూ.10 వేల తగ్గింపుతో రూ.41,990 అందుబాటులోకి తీసుకొచ్చింది.  కాగా  2017 వరల్డ్‌ కాంగ్రెస్‌లో డ్యూయల్‌ కెమెరాలతో విడుద‌ల చేసిన ఈ స్మార్ట్‌పోన్‌ను గత నెలలోనే భారత్‌లోనే ప్రవేశపెట్టింది .దీని  లాంచింగ్‌  ధర రూ.51,990.   అయితే   ఈ ఆఫ‌ర్ కేవ‌లం  మే 18 నుంచి జూన్ 15 వ‌ర‌కు మాత్ర‌మే ఉంది.  ముంబై రీటైలర్‌  అందించిన సమాచారం   ప్రకారం  20 సంవత్సరాల భాగస్వామ్యం సందర్భంగా  ఎల్‌జీ  ఇతర ఉత్పతులపై పలు ఆఫర్లను అందిస్తోంది.  అయితే    మిగతా ఇ-సైట్లలో  ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధరను పరిశీలించాల్సి ఉంది. 
 

ఎల్‌జీ జీ6 ఫీచ‌ర్లు
5.7 ఇంచ్ క్యూహెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
1440 x 2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
 క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
4 జీబీ ర్యామ్
64 జీబీ  ఇంటర‍్నల్‌ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

13, 13 మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement