న్యూఢిల్లీ: వర్షాలు, నియంత్రణ సంస్థల నుంచి పూర్తిగా అనుమతులు రాకపోవడం తదితర అంశాల కారణంగా 2024–25 రెండో త్రైమాసికంలో కాస్త ప్రతికూల ప్రభావం పడినా లిస్టెడ్ రియల్టీ దిగ్గజాల విక్రయాలు గణనీయంగా నమోదయ్యాయి. 26 సంస్థలు ఏకంగా రూ. 35,000 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలను విక్రయించాయి.
గోద్రెజ్ ప్రాపర్టీస్ అత్యధికంగా రూ. 5,198 కోట్ల బుకింగ్స్ నమోదు చేసింది. నియంత్రణ సంస్థలకు సమర్పించిన వివరాల ప్రకారం 26 దిగ్గజ సంస్థలు రూ. 34,985 కోట్ల ప్రాపర్టీలు విక్రయించాయి. అత్యధికంగా రెసిడెన్షియల్ సెగ్మెంట్‌లో ప్రీ–సేల్స్ నమోదయ్యాయి. లోధా బ్రాండ్‌పై కార్యకలాపాలు సాగించే ముంబైకి చెందిన మ్యాక్రోటెక్ డెవలపర్స్ రూ. 4,290 కోట్ల బుకింగ్స్ సాధించింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్ రూ. 4,100 కోట్లు, బెంగళూరు కంపెనీలు ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ రూ. 4,023 కోట్లు, సిగ్నేచర్ గ్లోబల్ రూ. 2,780 కోట్ల ప్రాజెక్టులు విక్రయించాయి.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ జాగ్రత్తలు
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో చాలా మటుకు రియల్టీ కంపెనీలు రూ. 500 – రూ. 1,000 కోట్ల అమ్మకాలు నమోదు చేశాయి. అయితే, తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో కొన్ని సంస్థల విక్రయాలు నెమ్మదించాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా అగ్రస్థానంలో ఉన్న డీఎల్‌ఎఫ్ తొలి త్రైమాసికంలో రూ. 6,404 కోట్ల ప్రీ–సేల్స్ సాధించగా కొత్త ప్రాజెక్టులేమీ ప్రకటించకపోవడంతో రెండో త్రైమాసికంలో రూ. 692 కోట్లు మాత్రమే నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment