Double Data Offer
-
వొడాఫోన్ ఐడియా బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మూడు ప్రీపెయిడ్ ప్లాన్లలో కొత్త డబుల్ డేటా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. రూ .249, రూ .399, రూ .599 రీఛార్జిపై అదనంగా 1.5 జీబీ డేటాను అందించనుంది. రూ. 249 ప్లాన్‌లో 84 జీబీ, రూ.399 ప్లాన్‌లో 168 జీబీ, రూ. 599 ప్లాన్‌లో 252 జీబీ ఫుల్ స్పీడ్ డేటాను వినియోగదారులకు అందించనుంది. ఈ కొత్త ఆఫర్ మొత్తం 23 టెలికాం సర్కిల్స్‌లో అందుబాటులో ఉంటుందని వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. కొత్త సవరణ ప్రకారం రోజు అందిస్తున్న1.5 జీబీ డేటాకు బదులుగా రెట్టింపు అంటే.. రోజుకు 3 జీబీ హై స్పీడ్ 4 జి డేటాను పొందవచ్చు. దీంతోపాటు ఈ మూడు ప్లాన్లకు అన్లిమిటెడ్ లోకల్, నేషనల్ వాయిస్ కాల్స్‌తోపాటు 100 ఎస్ఎంఎస్లను ఉచితం, వొడాఫోన్ కస్టమర్లు కాంప్లిమెంటరీ కింద జీ5, ఐడియా సబ్స్క్రైబర్లకు ఐడియా మూవీస్, టీవీని అందిస్తుంది. రూ .249 ప్లాన్ 28 రోజులు చెల్లుతుంది, రూ. 399 ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. రూ .599 ప్లాన్ 84 రోజుల వాలిడిటీ వుంది. ఈ ప్లాన్లను మై వొడాఫోన్ లేదా మై ఐడియా యాప్‌లు లేదా ఇతర థర్డ్‌పార్టీ ప్లాట్‌ఫాంల ద్వారా కూడా రీచార్జ్ చేసుకోవచ్చు. ఇది ఇలా వుంటే ఏజీఆర్ బకాయిల చెల్లింపుల వివాదంలో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వొడాఫోన్ గ్లోబల్ సీఈవో నిక్ రీడ్ కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలవనున్నారు. ఆయన ఇండియా పర్యటన సందర్భంగా టెలికాం మంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. వొడాఫోన్ గ్లోబల్ సీఈవో నిక్ రీడ్ -
ఎయిర్టెల్ రూ.149 ప్లాన్ : డబుల్ ఆఫర్
సాక్షి,న్యూఢిల్లీ: టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఇస్తున్న గట్టిపోటీని తట్టుకునేందుకు ఎప్పటికపుడు వ్యూహాలను మారుస్తున్న మరో దిగ్గజ టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ తాజాగా తన రీచార్జ్‌ప్లాన్ మళ్లీ సవరించింది. రూ.149 ప్రీపెయిడ్ ప్యాక్‌పై వినియోగదారులకు డబుల్ డేటా ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా జియో రూ.198 ప్లాన్‌కు కౌంటర్‌గా అదనపు ప్రయోజనాలతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రణాళికలో భాగంగా ఆ సవరణ చేసింది. ఎయిర్టెల్ రూ.149ల ప్రీపెయిడ్ ప్లాన్‌పై ఇపుడు 2జీబీ 2జీబీ/3జీబీడేటాను ఆఫర్ చేస్తోంది. ఇప్పటివరకూ 1 జీబీ మాత్రమే అందిస్తుండగా తాజా నిర్ణయంతో డబుల్ ధమాకాడేటా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు. రూ. 2.68కు జీబీ డేటా చొప్పున మొత్తం 56 జీబీ డేటాను కస్టమర్లకు అందివ్వనుందన్నమాట. దీంతోపాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. అయితే పరిమితమైన చందాదారులకు కుమాత్రమే అందుబాటు ఉన్నట్టు తెలుస్తోంది. జియో రూ.198 ప్యాక్‌లో 28రోజుల వాలిడిటీతో రోజుకు 1.5జీబీ చొప్పున 42 జీబీ అందిస్తోంది. గత నెలలోనే రూ.399 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను సవరించిన ఎయిర్టెల్ 1.4జీబీ బదుకుగా 2.4జీబీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. -
జియో 448జీబీ ఫ్రీ డేటా..ఎవరికో తెలుసా?
రిలయన్స్ జియో సంచలనమైన ఆఫర్లతో దూసుకెళ్తోంది. బుధవారం మార్కెట్లోకి లాంచ్ అయిన శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ కొనుగోలుదారులకు జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో, శాంసంగ్ భాగస్వామ్యంలో ఈ ఫోన్లను కొనుగోలు చేసిన జియో యూజర్లకు డబుల్ డేటా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద జియో నెట్ వర్క్‌పై కొత్త గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు 448జీబీ 4జీ డేటాను 8 ఎనిమిది నెలల పాటు ఉచితంగా అందించనున్నట్టు వెల్లడిచింది. అయితే నెలకు 309 రూపాయలతో ఆ యూజర్లు కచ్చితంగా రీఛార్జ్ చేపించుకోవాల్సిందేనట. జియో ధన్ ధనా ధన్ ప్లాన్ కిందనే గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్ 8 ప్లస్ కొనుగోలుదారులు ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ధన్ ధనా ధన్ ఆఫర్‌పై జియో ప్రైమ్ మెంబర్లు 309 రూపాయల రీఛార్జ్‌తో, నెలకు 28జీబీ డేటా చొప్పున మూడు నెలల పాటు కంపెనీ డేటా సర్వీసులను వాడుకోవచ్చు. ప్రస్తుతం శాంసంగ్ కొత్త గెలాక్సీ కొనుగోలుదారులకు నెలకు వాడుకునే డేటా డబుల్ అవుతుంది. వీరు నెలకు 56 జీబీ చొప్పున ఎనిమిది నెలల పాటు 448జీబీని వాడుకునే అవకాశం పొందుతారు. కాగ, ఈ ఫోన్లను శాంసంగ్ నేడే మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్8 ధర రూ.57,900కాగ, గెలాక్సీ ఎస్8 ప్లస్ ధర రూ.64,900. ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లను కంపెనీ ప్రారంభించేసింది. -
వొడాఫోన్ రెండింతల డేటా ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ వొడాఫోన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని ప్రి-పెయిడ్ కస్టమర్ల కోసం డబుల్ డేటా ఆఫర్‌ను ప్రకటించింది. 2జీ, 3జీ కస్టమర్లు రెండింతల విలువను అన్ని డేటా రిచార్జ్ ప్యాక్‌లపై పొందవచ్చు. 121 నంబరు, వొడాఫోన్ వెబ్సైట్, మై వొడాఫోన్ యాప్ ద్వారా డేటా రిచార్జ్ చేసుకునేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని సర్కిల్ బిజినెస్ హెడ్ రోహిత్ టాండన్ తెలిపారు. సర్కిల్లో వొడాఫోన్‌కు 65 లక్షల మంది వినియోగదార్లుంటే, 20 లక్షల మందికిపైగా డేటా వాడుతున్నారు.