సాక్షి,న్యూఢిల్లీ: టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఇస్తున్న గట్టిపోటీని తట్టుకునేందుకు ఎప్పటికపుడు వ్యూహాలను మారుస్తున్న మరో దిగ్గజ టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ తాజాగా తన రీచార్జ్‌ప్లాన్ మళ్లీ సవరించింది. రూ.149 ప్రీపెయిడ్ ప్యాక్‌పై వినియోగదారులకు డబుల్ డేటా ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా జియో రూ.198 ప్లాన్‌కు కౌంటర్‌గా అదనపు ప్రయోజనాలతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రణాళికలో భాగంగా ఆ సవరణ చేసింది.
ఎయిర్‌టెల్ రూ.149ల ప్రీపెయిడ్ ప్లాన్‌పై ఇపుడు 2జీబీ 2జీబీ/3జీబీడేటాను ఆఫర్ చేస్తోంది. ఇప్పటివరకూ 1 జీబీ మాత్రమే అందిస్తుండగా తాజా నిర్ణయంతో డబుల్ ధమాకాడేటా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు. రూ. 2.68కు జీబీ డేటా చొప్పున మొత్తం 56 జీబీ డేటాను కస్టమర్లకు అందివ్వనుందన్నమాట. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. అయితే పరిమితమైన చందాదారులకు కుమాత్రమే అందుబాటు ఉన్నట్టు తెలుస్తోంది. జియో రూ.198 ప్యాక్‌లో 28రోజుల వాలిడిటీతో రోజుకు 1.5జీబీ చొప్పున 42 జీబీ అందిస్తోంది. గత నెలలోనే రూ.399 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను సవరించిన ఎయిర్‌టెల్ 1.4జీబీ బదుకుగా 2.4జీబీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment