సాక్షి, ముంబై: వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లలో కొత్త డబుల్ డేటా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. రూ .249, రూ .399, రూ .599 రీఛార్జిపై అదనంగా 1.5 జీబీ డేటాను అందించనుంది. రూ. 249 ప్లాన్‌లో 84 జీబీ, రూ.399 ప్లాన్‌లో 168 జీబీ, రూ. 599 ప్లాన్‌లో 252 జీబీ ఫుల్ స్పీడ్ డేటాను వినియోగదారులకు అందించనుంది. ఈ కొత్త ఆఫర్ మొత్తం 23 టెలికాం సర్కిల్స్‌లో అందుబాటులో ఉంటుందని వొడాఫోన్ ఐడియా ప్రకటించింది.
కొత్త సవరణ ప్రకారం రోజు అందిస్తున్న1.5 జీబీ డేటాకు బదులుగా రెట్టింపు అంటే.. రోజుకు 3 జీబీ హై స్పీడ్ 4 జి డేటాను పొందవచ్చు. దీంతోపాటు ఈ మూడు ప్లాన్‌లకు అన్‌లిమిటెడ్ లోకల్, నేషనల్ వాయిస్ కాల్స్‌తోపాటు 100 ఎస్‌ఎంఎస్‌లను ఉచితం, వొడాఫోన్ కస్టమర్లు కాంప్లిమెంటరీ కింద జీ5, ఐడియా సబ్‌స్క్రైబర్‌లకు ఐడియా మూవీస్, టీవీని అందిస్తుంది. రూ .249 ప్లాన్ 28 రోజులు చెల్లుతుంది, రూ. 399 ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. రూ .599 ప్లాన్ 84 రోజుల వాలిడిటీ వుంది. ఈ ప్లాన్లను మై వొడాఫోన్ లేదా మై ఐడియా యాప్‌లు లేదా ఇతర థర్డ్‌పార్టీ ప్లాట్‌ఫాంల ద్వారా కూడా రీచార్జ్ చేసుకోవచ్చు.
ఇది ఇలా వుంటే ఏజీఆర్ బకాయిల చెల్లింపుల వివాదంలో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వొడాఫోన్ గ్లోబల్ సీఈవో నిక్ రీడ్ కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలవనున్నారు. ఆయన ఇండియా పర్యటన సందర్భంగా టెలికాం మంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
వొడాఫోన్ గ్లోబల్ సీఈవో నిక్ రీడ్
Comments
Please login to add a commentAdd a comment