రీచార్జ్‌ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో 56 రోజుల వ్యాలిడిటీ | Vodafone Idea Prepaid Plans with 56 Days Service Validity | Sakshi
Sakshi News home page

రీచార్జ్‌ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో 56 రోజుల వ్యాలిడిటీ

Mar 1 2025 9:11 PM | Updated on Mar 1 2025 9:19 PM

Vodafone Idea Prepaid Plans with 56 Days Service Validity

దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వొడాఫోన్ ఐడియా (Vi) తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజుల వ్యాలిడిటీని ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. వీటితో వినియోగదారులు 56 రోజుల సర్వీస్ వాలిడిటీని పొందుతారు. అలాగే ఈ ప్లాన్లు వైవిధ్యమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. 56 రోజుల వ్యాలిడిటీ కలిగిన నాలుగు ప్లాన్లు వొడాఫోన్ ఐడియాలో నాలుగు ఉన్నాయి. వాటి ధరలు వరుసగా రూ.369, రూ.579, రూ.795, రూ.649. దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలోనూ ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

రూ.369 ప్లాన్ 
వీఐ రూ.369 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 4 జీబీ డేటా, 600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇది డేటా ఫోకస్డ్ ప్లాన్ కాదు. వినియోగదారులు దీనితో 56 రోజుల సర్వీస్ వ్యాలిడిటీని పొందుతారు. ఎఫ్‌యూపీ (ఫెయిర్ యూసేజ్ పాలసీ) పరిమితి ముగిసిన తర్వాత ఎక్కువ డేటా అవసరమైనప్పుడు డేటా వోచర్లతో రీఛార్జ్ చేసుకోవచ్చు.

రూ.579 ప్లాన్ 
వీఐ నుంచి రూ.579 ప్లాన్‌తో యూజర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్స్ వంటి వీఐ హీరో అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ ఉన్నాయి.

రూ.649 ప్లాన్
వొడాఫోన్ ఐడియా రూ.649 ప్లాన్ లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ తో వినియోగదారులు ప్రతిరోజూ ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అపరిమిత డేటాను పొందుతారు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. వీకెండ్ డేటా రోల్‌వోవర్, డేటా డిలైట్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

రూ .795 ప్లాన్ 
వొడాఫోన్ ఐడియా నుండి రూ .795 ప్లాన్ అపరిమిత కాలింగ్, 3 జీబీ రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఉదయం 12 నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య అపరిమిత డేటా, డేటా డిలైట్స్, వారాంతపు డేటా రోల్ఓవర్ వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో 16 ఓటీటీలతో 60 రోజుల పాటు వీఐ మూవీస్ అండ్ టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది.

ఇదీ చదవండి: ఎయిర్‌టెల్‌ రీచార్జ్‌ ప్లాన్లు.. రూ.200 దగ్గరలో మంత్లీ వ్యాలిడిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement