సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 లాంచ్!
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం సామ్‌సాంగ్ కంపెనీ బుధవారం రాత్రి ప్రతిష్టాత్మక గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ మోడల్ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. అత్యాధునిక ఫీచర్లు, అద్భుతమైన టెక్నాలజీతో ఈ స్మార్ట్‌ఫోన్లను వినియోగదారులకు అందిస్తున్నట్టు సామ్‌సంగ్ ఈ సందర్భంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్లకు సంబంధించిన అనేక ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వినియోగదారులను ఊరించినట్టుగానే అనేక అత్యాధునిక ఫీచర్లతో గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ మార్కెట్‌లోకి రానున్నాయి. ఏప్రిల్ 21 నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ ఫోన్‌లోని కొన్ని ఫీచర్లు ఇవి..
- గత మోడళ్లలాగే ఎస్8, ఎస్8 ప్లస్ కూడా వాటర్, డస్ట్ రెసిస్టెంట్..
- గత మోడళ్ల కన్నా ఈ మోడల్ ప్రాసెసర్ 10శాతం, జీపీయూ 21శాతం వేగంగా పనిచేస్తాయి.
- వైర్‌లెస్ చార్జర్‌ను సైతం ఈ మోడళ్లు సపోర్ట్ చేస్తాయి
- అత్యంత రక్షణతో కూడిన 8పాయింట్ బ్యాటరీతో రానున్నాయి.
- ఈ మోడల్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐరిస్ స్కానర్‌తోపాటు ఫేస్ రికగ్నిషన్ ఆప్షన్ కూడా ఉండనుంది. పాస్‌వర్డ్, ప్యాటర్న్ అవసరం లేకుండా ఫేస్ రికగ్నిషన్ తో ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
- అత్యాధునిక సేవలను అందించేందుకు సాంసంగ్ ప్రత్యేకంగా వాయిస్ అసిస్టెంట్ టూల్ బిక్స్‌బైను తీసుకొచ్చింది. ఎన్నో ప్రత్యేక సేవలను ఈ టూల్ అందిస్తుంది.