Galaxy S8 plus
-
గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ ధరలు తగ్గింపు
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ ఎస్-సిరీస్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్‌ను విడుదల చేసిన అనంతరం, గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్ల ధరలను తగ్గించింది. ప్రస్తుతం గెలాక్సీ ఎస్8 64జీబీ మోడల్ రూ.49,990కు, గెలాక్సీ ఎస్8 ప్లస్ 64జీబీ మోడల్ రూ.53,990కు అందుబాటులో ఉంది. గెలాక్సీ ఎస్8ప్లస్ 128జీబీ మోడల్ ధరను రూ.64,900కు తగ్గించింది. అంటే అంతకముందు ధరలతో పోలిస్తే గెలాక్సీ ఎస్8పై 8వేల రూపాయల డిస్కౌంట్‌ను, గెలాక్సీ ఎస్8ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై 11వేల రూపాయల డిస్కౌంట్‌ను శాంసంగ్ ప్రకటించింది. ఈ తగ్గించిన ధరలు కంపెనీ అధికారిక వెబ్సైట్లోనూ, శాంసంగ్ అధికారిక రిటైల్ ఛానల్స్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్లను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయాలనుకునే వారు రూ.10వేల పేటీఎం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8ప్లస్ వేరియంట్లు శాంసంగ్ ఎక్సీనోస్ 8895 ఎస్ఓసీతో రూపొందాయి. గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్ 5.8 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉండగా.. గెలాక్సీ ఎస్8ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6.2 అంగుళాల స్క్రీన్ షేరింగ్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ను కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో మార్కెట్లోకి వచ్చాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లు కూడా 4జీబీ ర్యామ్‌నే కలిగి ఉన్నాయి. కానీ స్టోరేజ్ విషయంలో గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్ 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 256జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌తో మార్కెట్లోకి రాగ, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 128జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఐరిష్ స్కానర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేసియల్ రికగ్నైజేషన్, 3000 ఎంఏహెచ్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీలతో రూపొందాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లను అతిపెద్ద హైలెట్ బిక్స్బీ వర్చ్యువల్ అసిస్టెంట్. -
గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్‌లపై ధర కోత
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్‌లపై భారత్‌లో ధరలను తగ్గించింది. రూ.57,900గా ఉన్న గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్‌ను రూ.53,900కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాక రూ.64,900గా ఉన్న గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా రూ.58,900కు తగ్గించింది. అంటే మొత్తంగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్ ధరను రూ.4000, రూ.6000 మేర తగ్గించినట్టు ప్రకటించింది. నవరాత్రి సందర్భంగా ఈ రెండు హ్యాండ్సెట్లపై ప్రమోషనల్ డిస్కౌంట్ కింద రూ.4000ను కూడా ఆఫర్ చేసింది. అంతేకాక ఈ నెల మొదట్లో గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే5 ప్రైమ్ స్మార్ట్ఫోన్లపై కూడా శాంసంగ్ ధరలను కోత పెట్టింది. ధరల తగ్గింపు అనంతరం గెలాక్సీ జే7 ప్రైమ్‌ను రూ.14,900కు, గెలాక్సీ జే5 ప్రైమ్‌ను రూ.12,990కు అందుబాటులోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ఎస్8 ఫీచర్లు.. 5.8 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆక్టా-కోర్ ఎక్సీనోస్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 12 ఎంపీ డ్యూయల్-పిక్సెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫీచర్లు... 6.2 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్ 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్. -
ఐఫోన్ కంటే అవే చాలా బెస్ట్
గెలాక్సీ నోట్7 పేలుళ్ల ఘటన అనంతరం శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్‌లను మార్కెట్లలోకి ప్రవేశపెట్టింది. ఐఫోన్లకు కిల్లర్ గా వచ్చిన ఈ ఫోన్లు అన్నమాట నిలబెట్టుకుంటున్నాయి. గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫోన్లు బెస్ట్ స్మార్ట్ ఫోన్లుగా వినియోగదారుల మన్ననలను పొందుతున్నాయి. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ కంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ ఫోన్లే బెస్ట్ స్మార్ట్ ఫోన్లుగా దూసుకుపోతున్నట్టు వినియోగదారుల రిపోర్టులలో వెల్లడైంది. ఎంతో ఆకర్షణీయంగా, ప్రకాశవంతమైన డిస్ ప్లేతో శాంసంగ్ కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల డివైజ్ లు ఉన్నాయని కన్జ్యూమర్ రిపోర్టులు కొనియాడుతున్నాయి. మంచి బ్యాటరీ సామర్థ్యం, అద్భుతమైన కెమెరాలంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్ల ఘటన అనంతరం శాంసంగ్ కొంచెం ఎక్కువగా బ్యాటరీపై దృష్టిసారించింది. మళ్లీ అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఎంతో జాగ్రత్త వహించింది. ఒకవేళ ఈ ఫోన్ పూల్ లో పడిపోయినా ప్రమాదమేమి ఉండదని వినియోగదారులు చెబుతున్నారు. వాటర్ రెసిస్టెన్స్, మంచి కెమెరాలు, అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యంతో శాంసంగ్ కొత్త ఫోన్లు మార్కెట్లో దూసుకెళ్తున్నట్టు తెలిపారు. ఈ కన్జ్యూమర్ రిపోర్టులలో శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ టాప్-రేటు సొంతంచేసుకున్న స్మార్ట్ ఫోన్ గా కంపెనీ అధికార ప్రతినిధి ధృవీకరించారు. ఐఫోన్ 7 ప్లస్ ఐదు రేటును సంపాదించుకుంది. ఐఫోన్ 7 ప్లస్ కంటే గెలాక్సీ ఎస్8 ప్లస్, గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఎల్జీ జీ6 స్మార్ట్ ఫోన్లే ముందంజలో నిలిచాయి. ఒకవేళ వీటిని అధిగమించాలంటే ఆపిల్, ఐఫోన్ 8ను వినియోగదారులకు ఎంతో ఆకర్షణీయంగా తీసుకురావాల్సి ఉంది. ఎస్8, ఎస్8 ప్లస్ ప్రత్యేకతలు... గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ రెండు స్మార్ట్ఫోన్లలోనూ క్యూహెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఇన్విజిబుల్ హోమ్ బటన్, 1.9 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి పలు ప్రత్యేకతలున్నాయి. అయితే ఎస్8లో 5.8 అంగుళాల స్క్రీన్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లుంటే ఎస్8 ప్లస్‌లో మాత్రం 6.2 అంగుళాల స్క్రీన్, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీని కంపెనీ అమర్చింది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్లు అమ్మకాల్లో దుమ్మురేపుతున్నాయి. విక్రయాల్లో ఎస్ 8 దూకుడు ప్రదర్శించడంతో రెండో త్రైమాసికంలో గణనీయమైన లాభాలు ఆర్జించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
సామ్సంగ్ గెలాక్సీ ఎస్8 లాంచ్!
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం సామ్సాంగ్ కంపెనీ బుధవారం రాత్రి ప్రతిష్టాత్మక గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ మోడల్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. అత్యాధునిక ఫీచర్లు, అద్భుతమైన టెక్నాలజీతో ఈ స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు అందిస్తున్నట్టు సామ్సంగ్ ఈ సందర్భంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్లకు సంబంధించిన అనేక ఫీచర్లు ఆన్లైన్లో లీకయ్యాయి. వినియోగదారులను ఊరించినట్టుగానే అనేక అత్యాధునిక ఫీచర్లతో గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ మార్కెట్లోకి రానున్నాయి. ఏప్రిల్ 21 నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్లోని కొన్ని ఫీచర్లు ఇవి.. గత మోడళ్లలాగే ఎస్8, ఎస్8 ప్లస్ కూడా వాటర్, డస్ట్ రెసిస్టెంట్.. గత మోడళ్ల కన్నా ఈ మోడల్ ప్రాసెసర్ 10శాతం, జీపీయూ 21శాతం వేగంగా పనిచేస్తాయి. వైర్లెస్ చార్జర్‌ను సైతం ఈ మోడళ్లు సపోర్ట్ చేస్తాయి అత్యంత రక్షణతో కూడిన 8పాయింట్ బ్యాటరీతో రానున్నాయి. ఈ మోడల్లో ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐరిస్ స్కానర్‌తోపాటు ఫేస్ రికగ్నిషన్ ఆప్షన్ కూడా ఉండనుంది. పాస్వర్డ్, ప్యాటర్న్ అవసరం లేకుండా ఫేస్ రికగ్నిషన్ తో ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. అత్యాధునిక సేవలను అందించేందుకు సాంసంగ్ ప్రత్యేకంగా వాయిస్ అసిస్టెంట్ టూల్ బిక్స్బైను తీసుకొచ్చింది. ఎన్నో ప్రత్యేక సేవలను ఈ టూల్ అందిస్తుంది.