శామ్‌సంగ్ మొబైల్ ఫోన్ల ధరలు పెరిగాయి. ఇటీవల శామ్‌సంగ్ మార్కెట్‌లోకి తెచ్చిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్‌ఓ2, శామ్‌సంగ్ గెలాక్సీ ఎంఓ2, శామ్‌సంగ్ గెలాక్సీ12 ధరలు పెరిగాయి. ఈ మెడల్స్ అన్నీ ఈ ఏడాదిలోనే శామ్‌సంగ్ రిలీజ్ చేసింది.
చిప్‌సెట్ ఎఫెక్ట్
గ్లోబల్ మార్కెట్‌లో చిప్‌సెట్ల ధరలు పెరిగాయి. దాంతో వరుసగా ఒక్కో కంపెనీ తమ మొబైల్ హ్యాండ్సెట్ల ధరలను పెంచుతూ పోతున్నాయి. గత వారం షావోమి నోట్ 10 సిరీస్‌లో మొబైల్ ఫోన్ల ధరలు పెంచింది. తాజాగా శామ్‌సంగ్ కూడా ధరల పెంపు నిర్ణయం తీసుకుంది.
రూ.500 పెంపు
శామ్‌సంగ్ ఎఫ్‌ఓ2 మోడల్‌పై రూ. 500 పెరిగింది. 3జీబీ 32 జీబీ స్టోరేజీ, 4 జీబీ 64 జీబీ వేరియంట్లలో ఈ మోడల్ లభిస్తోంది. ఈ ఫోన్ లాంఛ్ చేసినప్పుడు 3 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ. 8,999 ఉండగా ప్రస్తుతం రూ. 9,499గా ఉంది. 4 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ. 9,999 నుంచి రూ. 10,499కి చేరుకుంది. శామ్‌సంగ్ ఎఓ2ఎస్, శామ్‌సంగ్ ఏ 12ల మోడల్స్‌లో కూడా అన్ని వేరియంట్లపై రూ. 500 వరకు ధర పెరిగింది. అయితే ధరల పెంపుపై శామ్‌సంగ్ ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. కానీ వెబ్‌సైట్‌లో మాత్రం పెంచిన ధరలతోనే ఫోన్ అందుబాటులో ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment