kaala
-
ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసిన హీరోయిన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రముఖ తారలు వెబ్‌సిరీస్‌లో నటించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఎందుకంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులకు దగ్గర కావచ్చు. ఈ క్రమంలో హీరోయిన్ నివేదా పేతురాజ్‌ను కూడా అలాంటి లక్కీఛాన్స్కు ఓకే చెప్పింది. ఇంతకు ముందు పలు చిత్రాలలో కథానాయికగా నటించిన ఈమె ఆ తరువాత తెలుగులోనూ సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది. తాజాగా కాలా అనే వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అవినాష్ తివారీ కథానాయకుడిగా నటించిన ఇందులో రోహన్ వినోద్ మెహ్రా, నితిన్ గులాటి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను భూషణ్ కుమార్, కిషణ్ కుమార్, బిజాయ్ నంబియార్ కలిసి నిర్మించారు. ఈ సిరీస్ ఈ నెల 15వ తేది నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది మనీ లాండరింగ్, హవాలా కుంభకోణంతో సాగే క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అని నటుడు అవినాష్ తివారీ పేర్కొన్నారు. తను ఐబీ ఆఫీసర్‌గా నటించినట్లు చెప్పారు. తాను కూడా ఐబి అధికారిణిగా నటించినట్లు నివేద పేతురాజ్ పేర్కొంది. తాను నటించిన తొలి వెబ్‌సిరీస్ ఇదేనని చెప్పింది. ఇందులో నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొంది. కాలా వెబ్‌సిరీస్‌లో పలు యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అలాంటి సీన్లలో నటించేందుకు అవినాష్ తివారీ ఎంతగానో సహకరించారని తెలిపింది. ఈ వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీంతో పాటు తెలుగులో పరువు అనే మరో వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నానంది. అదేవిధంగా తమిళంలోనూ చిత్రాలు చేయబోతున్నట్లు తెలిపింది. చదవండి: 6 ఏళ్ల తర్వాత సడన్‌గా ఫోటోలు లీక్.. అంటే ముందే ప్లాన్.. ఇలాంటి పనులు చేసేముందు ఆలోచించాలి.. రాహుల్ ఫైర్ -
కాలా దర్శకుడితో సూర్య?
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. దీంతో రజనీకాంత్ తన తాజా చిత్రానికి రెడీ అయిపోయారు. కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది కూడా. కాలా చిత్ర దర్శకుడు పా.రంజిత్ నెక్ట్స్ చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. అట్టకత్తి చిత్రంలో మొదలైన ఈ దర్శకుడిగా పయనం ఈ దర్శకుడు మెడ్రాస్, కబాలి, కాలా వరకూ సక్సెస్‌ఫుల్‌గా సాగింది. దీంతో నెక్ట్స్ ఏంటీ అన్నదానికి పా.రంజిత్ ఇటీవల నటుడు శింబును కలిశారు. ఆయనతో చిత్రం చేయనున్నారా అనే ప్రచారం జరిగింది. తాజాగా నటుడు సూర్య హీరోగా చిత్రం చేయనున్నారనే ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. నిజానికి పా.రంజిత్ మెడ్రాస్ చిత్రం తరువాతే సూర్యతో చిత్రం చేయాల్సింది. అయితే రజనీకాంత్‌ను దర్శకత్వం చేసే అవకాశం రావడంతో ఆ ప్రపోజల్ ఆగింది. తాజాగా మళ్లీ సూర్య హీరోగా పా.రంజిత్ చిత్రం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరి కలయికలో చిత్రం వస్తే ఎలా ఉంటుందో ఊహించవచ్చు. సామాజిక అంశాలే పా.రంజిత్ కథా చిత్రాలుగా ఉంటాయనడానికి ఆయన గత చిత్రాలే సాక్ష్యం. అయితే ఈ కాంబినేషన్లో చిత్రం గురించి ఇంకా అధికారికపూర్వక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సూర్య ఎన్జీకే చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించనున్నారు. ఆ తరువాతే పా.రంజిత్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. -
కాలాకు ముందే టచ్‌లో ఉన్నాం
తమిళసినిమా: కాలా చిత్ర ప్రారంభానికి ముందే తామిద్దరం టచ్‌లో ఉన్నాం అని చెప్పింది నటి హ్యూమఖురేషీ. ఈ సుందరి కోలీవుడ్ ఎంట్రీనే సంచలన చిత్రంతో కావడం అదృష్టమే. రజనీకాంత్‌తో ఒక్క సన్నివేశంలో నటించినా చాలని ఎందరో కోలీవుడ్ ప్రముఖ నటీమణులు ఆశ పడుతుంటే అలాంటి అవకాశాన్ని హ్యూమఖురేషీని చాలా సులభంగా వరించిందనే చెప్పాలి. కాలా చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రేయసిగా నటించే లక్కీచాన్స్‌ను దక్కించుకుని ఆ పాత్రతో మంచి గుర్తింపు పొందిన బాలీవుడ్ బ్యూటీ హ్యూమఖురేషీ. ఇంతకీ కాలా చిత్రానికి ముందు మేము టచ్‌లో ఉన్నాం అని ఈ అమ్మడు ఎవరి గురించి అంటుందనేగా మీ ఉత్సుకత. ఆ కథేంటో ఈ జాణ మాటల్లోనే చూద్దాం. నేను నటించిన హిందీ చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్ చూశారట. అందులో నా నటన ఆయనకు బాగా నచ్చేసింది. ఆయన నా గురించి చాలా మందికి చెప్పారట. అయితే నాకు నటుడు ధనుష్ నుంచే ఫోన్‌కాల్ వచ్చింది. నేను ధనుష్ చాలా కాలంగానే టచ్‌లో ఉన్నాం. ఆయన ప్రతిభావంతుడైన నటుడు. ఇద్దరం కలిసి చిత్రం చేయాలనుకున్నాం. ఒక చిత్రంలో నటించాలనుకున్నా, పలు కారణాల వల్ల అది జరగలేదు. అలాంటిది ఒక సారి ధనుష్ నుంచి ఫోన్ వచ్చింది. అది చిత్రం గురించి మాట్లాడడానికేనని భావించాను. అయితే నేను నిర్మించనున్న చిత్రంలో నటించాలి. హీరో రజనీకాంత్ అని ఆయన చెప్పగానే నేను వింటోంది నిజమేనా అన్న సందేహం కూడా కలిగింది. ధనుష్ నిజమేనని నిర్ధారణ చేయడంతో ఆనందంతో ఎగిరి గంతేశాను. ఆ తరువాత దర్శకుడు పా.రంజిత్‌ను కలిశాను. ఆయన చెప్పిన కథ బాగా నచ్చేసింది. కాలా చిత్రంలో నటించాలని వెంటనే నిర్ణయించుకున్నాను. ఈ చిత్రంలో కష్టమైన విషయం ఏమిటంటే నేను రజనీకాంత్‌ను తిట్టడమే. ఆ సన్నివేశంలో నటించడానికి చాలా కష్టపడ్డాను. అయితే ఆ సన్నివేశానికి మంచి పేరు వచ్చింది. రజనీకాంత్‌తో నటించడం మధురమైన అనుభవం. -
రజనీకాంత్ రిటైర్మెంట్పై ఐశ్వర్య కామెంట్
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తెర మీద కనిపిస్తే చాలని భావించే వీరభిమానలకు కొదువే లేదు. కోలీవుడ్ సినీ జనాలకు రజనీ దేవుడితో సమానం. ఇతంటి క్రేజ్ ఉన్న రజనీకాంత్‌ను ఆయన కూతురు ఓ అనూహ్యమైన కోరిక కోరారు. రజనీ కుమార్తె ఐశ్వర్య ధనుష్ తండ్రిని సినిమాలు మానేయాలని కోరారట. ఈ విషయాన్ని ఐశ్వర్య స్వయంగా వెల్లడించారు. కాలా రిలీజ్ తరువాత జాతీయ మీడియాతో మాట్లాడిన ఐశ్వర్య, తండ్రి కుటుంబానికి కొంత సమయం కేటాయించాలని కోరారు. పూర్తిగా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించకపోయినా.. కాస్త పని తగ్గించుకొని కుటుంబంతో ఆనందంగా గడపాలని తాము కోరుకుంటున్నట్టుగా వెల్లడించారు. హీరోగా ఎదుగుతున్న దశలో రజనీ ఏడాదికి ఏడెనిమది సినిమాల్లో నటించేవారన్న ఐశ్వర్య, సినిమాల కారణంగా ఆయన ఫ్యామిలీతో గడపాల్సిన సమయాన్ని కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ఆయన మూలంగా ప్రజలు ఎంత ఆనందం పొందుతున్నారో నాకు తెలుసు అందుకే రిటైర్మెంట్ ప్రకటించకమని కోరలేకపోతున్నామన్నారు ఐశ్వర్య. ఇటీవల కాలాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రస్తుతం యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. రజనీ హీరోగా తెరకెక్కిన 2.ఓ నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. -
‘కాలా’ కలెక్షన్లు.. అట్టర్ ఫ్లాప్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ స్టార్ అభిమానులకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. రజనీ ఇమేజ్ తగ్గ కథా కథనాలు కాకపోవటంతో కాలాపై అభిమానులు కూడా పెదవి విరిచారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాలా, ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. కలెక్షన్లు కూడా అదే స్థాయిలో ఉండటంతో ఈ సినిమా.. రజనీ ఖాతాలో మరో భారీ డిజాస్టర్ అంటున్నారు విశ్లేషకులు. తమిళనాట కాస్త పరవాలేదనిపించినా తెలుగు, హిందీ భాషల్లో కాలా వసూళ్లు భారీ నష్టాలు మిగిల్చేలా ఉన్నాయి. కాలా తెలుగు డబ్బింగ్ రైట్స్ 30 కోట్లకు పైగా ధర పలికినట్టుగా వార్తలు వినిపించాయి. అంటే ఈ సినిమా తెలుగులో విజయం సాధించాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి 30 కోట్లకు పైగా వసూళ్లు సాదించాలి. కానీ తొలి ఐదు రోజుల్లో కాలా కేవలం 7 కోట్లు మాత్రమే వసూళు చేసింది. సోమవారం తరువాత కలెక్షన్లు మరింతగా పడిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో కాలాకు భారీ నష్టాలు తప్పవంటున్నారు విశ్లేకులు. -
కలెక్షన్స్‌లో ‘కాలా’ అక్కడ టాప్
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాకు టాక్‌తో సంబంధం ఉండదు. సినిమా విడుదలయ్యిందా.. రికార్డులు బద్దలయ్యాయా? లేదా? అన్నట్లు ఉంటుంది. తలైవాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. కాలా సినిమాకు తెలుగులో నెగిటివ్ టాక్ వచ్చినా.. తమిళనాట మాత్రం సినిమా దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లను రాబట్టింది కాలా. ఓవర్సీస్లో కూడా సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆస్ట్రేలియాలో తొలి వారాంతానికి 2 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీంతో ఫస్ట్ వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా కాలా నిలిచింది. కాగా సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావత్’ సినిమా టాప్ ప్లేస్‌లో ఉంది. రానున్న రోజుల్లో కాలా మరిన్ని రికార్డులు తిరగరాస్తుందేమో చూడాలి. #Kaala is SUPERB in Australia... Emerges SECOND HIGHEST *opening weekend grosser* of 2018 [Indian films], after #Padmaavat... Thu A$ 105,672 Fri A$ 100,662 Sat A$ 110,616 Sun A$ 85,263 Total: A$ 402,213 [₹ 2.04 cr]@Rentrak — taran adarsh (@taran_adarsh) June 11, 2018 -
మేకింగ్ ఆఫ్ మూవీ - కాలా
-
రజనీ ‘కాలా’... దుమ్మురేపుతున్న వసూళ్లు!
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా సినిమా ‘కాలా’... అంతగా గ్రాండ్ ఓపెనింగ్స్‌ను రాబట్టలేకపోయింది. రజనీ సినిమాలంటే సహజంగానే బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. కలెక్షన్ల సునామీ పోటెత్తుతుంది. అయితే, తొలిరోజు కాలా సినిమాకు చాలావరకు థియేటర్లు హౌస్‌ఫుల్ కాలేదని, అన్బుక్డ్ సీట్లు చాలా మిగిలిపోయాయని వార్తలు వచ్చాయి. రెండోరోజు నుంచి ఈ సినిమా వసూళ్లు మెల్లిగా ఊపందుకున్నాయని సినీ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రెండ్రోరోజుల్లో ఒక్క చెన్నైలోనే కాలా సినిమా మూడు కోట్లు వసూలు చేసింది. ఇక అమెరికా బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్లో మిలియన్ మార్క్ (రూ. 6.83 కోట్లు)ను అందుకుంది. మొత్తానికి టాక్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. కాలా సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విట్టర్లో వెల్లడించారు. చెన్నైలో ఈ సినిమా తొలి వీకెండ్లో రూ. 4.9 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో కాలా సినిమా సంచలన వసూళ్లు రాబడుతోంది. పద్మావతి సినిమా తర్వాత అత్యధిక విదేశీ వసూళ్లు రాబట్టిన సినిమాగా కాలా నిలిచింది. శాటిలైట్, మ్యూజిక్ తదితర హక్కుల ద్వారా విడుదలకు ముందే రూ. 230 కోట్ల బిజినెస్ చేసిన కాలా.. విడుదల తర్వాత కూడా వసూళ్లతో ఆకట్టుకుంటోందని సినీ విశ్లేషకులు చెపుతున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కాలా సినిమా రజనీ ద్రవిడ డాన్‌గా, మురికివాడల్లో నివసించే తన ప్రజల హక్కుల కాపాడే వ్యక్తిగా అద్భుతమైన నటన కనబర్చారు. #BREAKING: In 3 Days, #Kaala has crossed ₹ 100 Cr Gross at the WW Box Office.. pic.twitter.com/N9NS1no2Mg — Ramesh Bala (@rameshlaus) June 10, 2018 -
కాలాతో పెట్టుకుంటే అంతే!
తమిళసినిమా: కాలా అంటే ఎవరు కరాకాలుడు. ఆయనతో పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా? సినీ ప్రేక్షకులకు సూపర్‌స్టార్, అభిమానులకు తలైవా రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా.ఆయన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మించిన ఈ భారీ చిత్రానికి కబాలి చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకుడు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తరువాత వస్తున్న చిత్రం కాలా కావడంతో దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ మధ్య తూత్తుకుడి కాల్పులనంతరం ఆ సంఘటనలో మరణించిన వారి కటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన రజనీకాంత్ ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారి తీశాయి. ముఖ్యంగా ప్రతి విషయానికి పోరాటాలు చేసుకుంటూ పోతే తమిళనాడు శ్మశానంగా మారుతుందన్న రజనీ వ్యాఖ్యలను పలు తమిళ సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించాయి. కాలా చిత్రంకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేశారు. అయినా రజనీకాంత్ అలాంటి వాటిని పట్టించుకోలేదు. అయితే అందకు ముందు కావేరి మేనేజ్మెంటట్ బోర్డు ఏర్పాటు కోసం చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర త్యతిరేకతకు గురి చేశాయి. ఎంతగా అంటే కాలా చిత్ర విడుదలను ఆ రాష్ట్రంలో నిషేధించే స్థాయికి. దీంతో కోర్టు తీర్పు, కర్ణాటక ముఖ్యమంత్రి సహకారం, పోలీసుల రక్షణ వంటి చర్యలు కూడా కాలాకు ఆటంకాలను అడ్డుకోలేకపోయాయి. గురువారం కాలా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చినా, కర్ణాటకలో పూర్తిగా విడుదల కాలేదు. అయితే శుక్రవారం నుంచి చిత్రం అక్కడ కూడా థియేటర్లకు వెళ్లింది. 400 వెబ్సైట్లు మూతబడ్డాయి కాగా కాలా చిత్రం కూడా పైరసీకి గురి కాక తప్పలేదు. చిత్రం విడుదలైన సాయంత్రమే 45 నిమిషాల చిత్రం ఫేస్‌బుక్‌లోకి వచ్చేసింది. అయితే అందుకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారనుకోండి. కాగా ఆ తరువాత కాలా చిత్రాన్ని 400 వెబ్‌సైట్స్ ప్రసారం చేసి చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చాయి.అయితే కాలాతో పెట్టుకోవడం అంటే మాటలా? పోలీసులు రంగప్రవేశం చేశారు. ఫలితం ఇప్పుడా వెబ్‌సైట్స్ అన్నీ మూత బడ్డాయన్నది తాజా సమాచారం. అదే విధంగా కాలా చిత్ర పైరసీ వ్యవహారంపై నిర్మాతల మండలి సీరియస్ అయ్యింది. ఎవరైనా కాలా చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లలో పైరసీకి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. అభిమానుల మధ్య ఘర్షణ కాగా రజనీకాంత్ రాజకీయరంగప్రవేశం గురించి ప్రకటించిన తరువాత ఆయన నటించిన చిత్రం కావడంతో కాలా చిత్రాన్ని చూడడానికి అబిమానులు విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు. కాలా చిత్రాన్ని పుదుకోట్టైలో రెండు థియేటర్లలో విడుదల చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు థియేటర్ల బంధోబస్తు కల్పించారు. ఇలాంటి పరిస్థితిలో పుదుకోట్టైలోని ఒక థియేటర్లో 4 గంటల షోకు వచ్చిన గంధర్వకోట్టైకు చెందిన రజనీ అభిమానులకు, వండిపేట్టైకు చెందిన అభిమానులకు మధ్య థియేటర్లో సీట్ల విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. చిత్ర ప్రదర్శన అనంతరం ఈ రెండు జట్ల మధ్య గొడవ కొట్లాటకు దారి తీసింది. దీంతో వారి ఇరు వాహనాలు ధ్వంసం అయ్యే స్థాయికి చేరాయి. ఒకరి వాహనంపై మరొకరు రాళ్లు, కట్టెలతో దాడి చేసి ధ్వంసం చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అక్కడి నుంచి పంపేశారు. అయితే ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. పోలీసులు ఘర్షణకు పాల్పడిన వారి గురించి దర్యాప్తు చేస్తున్నారు. -
కాలా ది రజనీ స్టైల్
-
‘కాలా’పై ఆమిర్‌ఖాన్ వ్యాఖ్యలు
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ థియేటర్స్‌లోకి వచ్చేసింది. తలైవా సినిమా వస్తోందంటే అభిమానులకే కాదు సెలబ్రెటీలకు కూడా పండుగే. ఎందుకంటే రజనీ సూపర్‌స్టార్స్‌కే సూపర్‌స్టార్స్. రజనీ సినిమాకు ఏరియాలతో పని ఉండదు. తెరపై రజనీ బొమ్మ కనబడితే చాలు. అందుకే రజనీ సినిమాకు ఇండియావైడ్ క్రేజ్ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కాలా సినిమాపై కామెంట్ చేశారు. ‘రజనీకి వీరాభిమానినైన నేను కాలా సినిమాను చూడటానికి ఇక ఎదురుచూడలేను’ అంటూ రజనీపై తన ప్రేమను సోషల్ మీడియా ద్వారా తెలిపారు. హ్యూమా ఖురేషి, ఈశ్వరీ రావు, నానా పటేకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను హీరో ధనుష్ నిర్మించారు. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వం వహించారు. Have always been a huge Rajni fan, can’t wait to watch Kaala.https://t.co/JgxBA8UcTa — Aamir Khan (@aamir_khan) June 7, 2018 -
'కాలా'కు తప్పని పైరసీ భూతం
-
‘కాలా’పై కన్నెర్ర!
కుల, మత సంస్థలు, ఇతర బృందాలు చలనచిత్రాల జోలికి రాకూడదని న్యాయస్థానాలు పదే పదే హితవు చెబుతున్నాయి. చలనచిత్రాల మంచి చెడ్డలు నిర్ణయించడానికి సెన్సార్ బోర్డు ఉన్నదని, దాని నిర్ణయాలను ప్రశ్నించేందుకు ఇతరత్రా వేదికలు కూడా అందుబాటులో ఉన్నా యని గుర్తు చేస్తున్నాయి. అయినా చిత్రం పేరు మార్చాలని, ఫలానా సన్నివేశం తొలగించాలని, పాటల్లో ఫలానా పదాలు తీసేయాలని, లేదంటే చిత్రం విడుదలను అడ్డుకుంటామని బెది రింపులకు దిగే బృందాలు తామరతంపరగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం విడుదల కావలసిన రజనీకాంత్ చిత్రం ‘కాలా’ అలాంటివారి బారిన పడింది. ఆశ్చర్యమేమంటే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో చిత్రం విడుదలను వాయిదా వేసుకోమని సలహా ఇస్తున్నారు. కర్ణాటకలో ఆ చిత్రం విడుదలను అడ్డుకుం టామని కన్నడ సంఘాలు కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నాయి. కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశించినట్టు కావేరీ నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని రజనీ కాంత్ డిమాండ్ చేయడం ఆ సంఘాలకు నచ్చలేదు. కన్నడ సంఘాలు మాత్రమే కాదు... తమిళనాడులోని కొన్ని ఇతర సంఘాలు కూడా ‘కాలా’కు సమస్యలు సృష్టించా లని చూస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసేయాలని డిమాండ్ చేస్తూ సాగిన ఉద్యమంపై ఉక్కుపాదం మోపి పలువురిని కాల్చి చంపిన ఉదంతంపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆ సంఘాలకు అభ్యంతరకరం అనిపించాయి. పోలీసులపై కొన్ని అసాంఘిక శక్తులు దౌర్జన్యానికి దిగడం వల్లే వారు కాల్పులు జరపాల్సివచ్చిందన్నది రజనీ వ్యాఖ్యల సారాంశం. తూత్తుకుడి కాల్పుల దృశ్యాలను చూసిన వారెవరూ అలా మాట్లాడరు. పోలీసులు ఉద్యమ కారులను గురిచూసి కాల్చిచంపిన దృశ్యాలు బయటికొచ్చాక కూడా రజనీ అలా మాట్లాడి ఉండా ల్సింది కాదు. అసాంఘిక శక్తులపై పోలీసులు చర్యలు తీసుకుంటే ఎవరూ అభ్యంతర పెట్టరు. కానీ ఆ క్రమంలో పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇష్టానుసారం ప్రవర్తిస్తే అంగీకరించరు. ఈ విషయంలో రజనీకాంత్‌తో విభేదించే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ సాకుతో చిత్రానికి అడ్డంకులు కల్పించడం సరికాదు. ఆమధ్య హిందీ చిత్రం ‘పద్మావత్’పై కూడా ఇలాంటి వివాదాలే ముసురుకున్నాయి. ఆ చిత్రంలో పద్మావతిని కించపరిచేలా చూపుతున్నారని అనుమానించి రాజ్పుట్ సంఘాలు షూటింగ్ మొదలైనప్పటినుంచే దాడులు మొదలుపెట్టాయి. చివరకు చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తలలు తెచ్చినవారికి రూ. 5 కోట్లు బహుమాన మిస్తామని కూడా ప్రకటించాయి. తీరా విడుదలయ్యాక చూస్తే ఆ చిత్రంలో ఎలాంటి అభ్యం తరకమైన అంశాలూ లేవు. రెండు నెలలక్రితం పంజాబీ చిత్రం ‘గురునానక్ దేవ్’ను కూడా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ), అకల్ తఖ్త్లు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. మూడేళ్లక్రితం ఈ చిత్రం విడుదలైనప్పుడు ఎస్జీపీసీ అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, కొన్ని సిక్కు గ్రూపులు ఆందోళనకు దిగడంతో తన అభిప్రాయాన్ని మార్చుకుంది. అప్పట్లో చిత్ర నిర్మాతలు ఒక్క పంజాబ్‌లో మినహా మిగిలినచోట్ల విడుదల చేశారు. కానీ కొద్దిరోజులకే నిలిపివేశారు. ఇప్పుడు తిరిగి విడుదల చేద్దామనుకుంటున్న తరుణంలో ఎస్జీపీసీ అభ్యంతరపెట్టింది. అసలు చిత్రంలో గురునానక్ పాత్రే ఉండరాదని, అలా చూపితే ఆయనకు అపచారం చేసినట్టేనని దాని వాదన. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో అదంతా సద్దుమణిగింది. కానీ ఇకపై సిక్కు సంప్ర దాయానికి సంబంధించి తీసే చిత్రాలకు తమ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరని ఈమధ్య ఎస్జీపీసీ ప్రకటించింది. అందుకోసం 21మంది సభ్యులతో సిక్కు సెన్సార్ బోర్డు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. సెన్సార్‌బోర్డుకు సిక్కు సంప్రదాయాలపై అవగాహన ఉండదు కనుక తామే అందుకోసం దీన్ని ఏర్పాటు చేశామంటున్నది. యువతపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని చర్చించిన ‘ఉడ్తా పంజాబ్’ చిత్రంపైనా 2016లో వివాదం చెలరేగింది. సెన్సార్ బోర్డు 89 కత్తిరింపులు ప్రతిపాదించగా చిత్ర నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి చిత్రం విడుదల చేసుకోవాల్సి వచ్చింది. మన దేశంలో ఒక్క సినిమాలపై మాత్రమే కాదు... వివిధ కళారూపాల గొంతు నొక్కడానికి ఏదో ఒక రూపంలో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. విఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రించిన పెయింటింగ్‌లపై హిందూత్వ సంస్థలు విరుచుకుపడ్డాయి. అనేకచోట్ల కేసులు నమో దుకావడం, బెదిరింపులు రావడం వగైరాలతో విసిగి ఆయన 2006లో భారత్ వదిలి వెళ్లి పోయారు. 2011లో మరణించేనాటికి ఆయన దోహాలో ఉన్నారు. తమిళనాడులో రచయిత పెరు మాళ్ మురుగన్ రాసిన నవలపై కూడా పెద్ద వివాదం తలెత్తింది. ఆయనను అనేకవిధాల వేధిం చారు. కుల, మత సంఘాలు ఆయనపై ఎన్నో కేసులు పెట్టాయి. చివరకు మూడేళ్లక్రితం ఆ రచయిత సృజనాత్మకతపై ఆంక్షలు విధించడానికి వీల్లేదని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. రచయితల, కళాకారుల భావ వ్యక్తీకరణను అడ్డుకునేందుకు, వారి భావాలు ప్రజలకు చేరకుండా నిరోధించేందుకు ప్రభుత్వాలు, ప్రైవేటు బృందాలు అనేక విధాల ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై నిర్మించిన డాక్యుమెంటరీ విడుదలను ఆపాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేస్తూ నిరుడు సుప్రీంకోర్టు విలువైన తీర్పును వెలువరించింది. చట్ట పరిధిలో ఏ కళాకారుడైనా తనకు నచ్చిన రూపంలో భావాలు వ్యక్తం చేయొచ్చునని, అందులో జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వాలకుగానీ, ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకుగానీ లేదని స్పష్టం చేసింది. ఇలాంటి అంశాల్లో ఉదారంగా స్టేలు మంజూరు చేయొద్దని కింది కోర్టులకు సూచించింది. సుప్రీంకోర్టు పదే పదే ఇంత వివరంగా చెప్పినా సమస్యలు తలెత్తడం, అధికారంలో ఉన్నవారు వంతపాడటం విచారకరం. ఇలాంటి ధోరణులను నివారించకపోతే ప్రజాస్వామ్య భావనే ప్రమాదంలో పడుతుంది. -
బ్రేకింగ్ : విడుదలకు ముందే ఆన్లైన్లో 'కాలా'
సాక్షి, హైదరాబాద్ : పైరసీ భూతం మరోసారి కాటేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా యాక్షన్ చిత్రం కాలా విడుదలకు ముందే సోషల్ మీడియా ఫేస్బుక్లో దాదాపు 45 నిమిషాల వీడియో లైవ్ టెలికాస్ట్ అయింది. భారత్ కంటే ముందుగా సింగపూర్‌లో ప్రీమియర్ షోలు పడ్డాయి. దీంతో అక్కడే ఉంటున్న ప్రవీణ్ దేవర సినిమాకు వెళ్లి, తన మొబైల్‌తో దాదాపు 45 నిమిషాలపాటు సినిమాను ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. దీనిపై సమాచారం అందుకున్న సింగపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ చిత్రం గురువారం ప్రపంచవాప్తంగా గురువారం విడుదల కానుంది. నేపథ్యంలో ఈ సంఘటన సినీ వర్గాల్లో కలకలం రేపింది. ముఖ్యంగా రజనీ అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. -
‘కాలా’ కోసం ఆసక్తిగా చూస్తున్నారు : సుప్రీం కోర్టు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కోలీవుడ్ హీరో, రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నారు. మంగళవారం కర్ణాటక హైకోర్టు కాలా రిలీజ్‌కు లైన్ క్లియర్ చేసింది. సినిమాను రిలీజ్ చేసేందుకు థియేటర్ల యజమానులు ముందుకు వస్తే ప్రభుత్వం భద్రత కల్పించాలని ఆదేశించింది. తాజాగా సుప్రీం కోర్టులోనూ కాలా కు ఊరట లభించింది. ‘అందరూ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో రిలీజ్ విషయంలో మేం జోక్యం చేసుకోలేం’ అంటూ సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. కాపీరైట్ విషయంలో దాఖలైన పిటీషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పలు వాయిదాల తరువాత ఈ గురువారం విడుదలకు రెడీ అయిన ఈ సినిమాకు కర్ణాటకలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో రజనీ చేసిన వ్యాఖ్యలు కారణంగా పలు కన్నడ సంఘాలు కాలా రిలీజ్‌ను వ్యతిరేఖిస్తున్నాయి. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కాలా సినిమాను రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నిర్మించారు. -
స్టంట్ చేయాల్సిన అవసరం లేదు
తమిళసినిమా: కాలా చిత్రం కోసం స్టంట్ చేయాల్సిన అవసరం తనకు లేదని ఆ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ పేర్కొన్నారు. రజనీ నటించిన తాజా చిత్రం కాలా పలు విమర్శలు, ఆరోపణలు, వ్యతిరేకతల మధ్య శుక్రవారం తెరపైకి రానుంది. ఇటీవల తూత్తుక్కుడి కాల్పుల వ్యవహారంలో రజనీ వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే రజనీ చర్యలు కాలా ప్రచారం కోసం చేసిన పెద్ద స్టంట్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భగవంతుడి దయ భగవంతడి దయ వల్ల తనకు అభిమానులు, ప్రేక్షకుల ఆదరణ మెండుగా ఉందనీ, చిత్రం ఆడటం కోసం తాను స్టంట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. తాను సినిమాల్లోకి వచ్చి 43 ఏళ్లు అయ్యిందని, ఇప్పుడు స్టంట్స్, జిమిక్కులు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాలా చిత్రానికి తాను ఊహించిన దాని కంటే తక్కువ సమస్యలే ఎదురయ్యాయని అన్నారు. కర్ణాటకలో కాలా విడుదలకు ఎలాంటి సమస్య రాదని భావిస్తున్నానని, చిత్రాన్ని వ్యతిరేకించడానికి ఎలాంటి కారణాలు లేవన్నారు. ఈ విషయం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి తెలుసని పేర్కొన్నారు. అక్కడ తమిళులు మాత్రమే కాకుండా ఇతర భాషలకు చెందిన లక్షలాది మంది కాలా చిత్రాన్ని చూసేందుకు ఆస్తకిగా ఉన్నారని అన్నారు. వారందరినీ నిరాశ పరచకుండా చిత్ర విడుదలకు అన్ని చర్యలు తీసుకుంటారని తగిన రక్షణ కల్పిస్తారని భావిస్తున్నానన్నారు. దేవేగౌడ లాంటి పెద్దాయన ఉన్నారని, ఆయన కాలా చిత్రాన్ని నిషేధించడానికి అంగీకరించరని రజనీకాంత్ పేర్కొన్నారు. కాలాకు కోర్టు గ్రీన్ సిగ్నల్ కాలా చిత్రం వ్యవహారంలో ఆ చిత్ర నిర్మాత ధనుష్ సోమవారం కర్ణాటక కోర్టును ఆశ్రయించారు. ఆయన పీటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు చిత్ర విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, కర్ణాటక ప్రభుత్వం కాలా చిత్రానికి తగిన భద్రతను కల్పించాలని, థియేటర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. మద్రాసు హైకోర్టులో మరో పిటిషన్ కాలా పై చెన్నై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ముంబైలో నివశిస్తున్న తూత్తుక్కుడికి చెందిన త్రివియం నాడార్ అనే వ్యక్తి ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం కాలా అనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో త్రివియం నాడార్ పేరుకు కళంకం ఆపాదించే విధంగా, జాతి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందంటూ, కాలా విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ ముఖ్యమంత్రి సెల్ ద్వారా తమిళనాడు నాడార్ సంఘం నిర్వాహకులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగనుంది. ఇదిలాఉండగా మరోవైపు నటుడు సత్యరాజ్ రజనీకాంత్ రాజకీయంపై దండెత్తుతున్నారు. రజనీది రాజకీయం కాదని, వ్యాపారం అని ఆయన బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు. టికెట్ ధరపైనా రచ్చ కాలా చిత్ర టికెట్ ధరపైనా రచ్చ జరుగుతోంది. సినిమా టికెట్ ధర రూ.165.78 కాగా, కాలా చిత్ర టిక్కెట్లను రూ.207.25 ధరకు విక్రయించేందకు ప్రత్యేక అనుమతినిచ్చారు. అయితే వాస్తవానికి కాలా చిత్ర టికెట్ ధరను రూ.వెయ్యికి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై పీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు రామ్‌దాస్ ఇప్పుటికే ఖండించగా, బుధవారం ఆ పార్టీ కార్యధ్యక్షుడు అన్భుమణి రామ్‌దాస్ స్పందిస్తూ కాలా చిత్ర టిక్కెట్ ధరను నియంత్రించడానికి నటుడు రజనీకాంత్ చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కమల్‌కు రజనీ మద్దతు తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరి జలాల సమస్యను ఇరు రాష్ట్రాలు సామరస్య చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని, అందుకు తాను ప్రయత్నిస్తానని ఆ మధ్య నటుడు, మక్కల్ నీది మయం పార్టీ అధినేత కమలహాసన్ చెప్పిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆయన సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిసి కావేరి నదీ జలాల వివాదంపై చర్చించారు. కమలహాసన్ చేస్తున్న ప్రయత్నానికి రజనీకాంత్ మద్దతు పలుకుతున్నట్లు ఒక భేటీలో పేర్కొన్నారు. ఇదే విధంగా కాలా చిత్రం సమస్యలను ఎదురొడ్డి విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని కమల్ వ్యక్తం చేయడం విశేషం. -
రజనీ కాలాకు కన్నడనాట చిక్కులు
-
కళ్లు చెదిరే ‘కాలా’ రికార్డు
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఇండియావైడ్‌గా క్రేజ్ ఉంటుంది. రజనీ సెలబ్రిటీలకే సెలబ్రిటీ. తలైవా సినిమా వస్తోందంటే ఎవరైనా వెనక్కి వెళ్లాల్సిందే. రజనీ తాజా చిత్రం కాలా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు. విడుదలకు ముందే ‘కాలా’ కళ్లు చెదిరే రికార్డులను నెలకొల్పింది. కబాలి ఆశించినంతగా ఆడకపోయినా ఈ సినిమా దాదాపు 600కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. కేవలం సూపర్‌స్టార్ మేనియా ఈ సినిమా కలెక్షన్లను పెంచింది. ప్రసుత్తం కాలా సినిమా విడుదలకు ముందే 230కోట్ల బిజినెస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్లో 70కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 33కోట్లు, కేరళలో పది కోట్లు, రెస్టాఫ్ కంట్రీ ఏడు కోట్లు, ఓవర్సిస్ హక్కులు 45కోట్లు, థియేట్రికల్ హక్కులు 155కోట్లు, బ్రాడ్ కాస్ట్ హక్కులు 70కోట్లు, మ్యూజిక్ ద్వారా 5కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటకలో కాలాకు కష్టాలు తొలగి, విడుదలకు మార్గం సులువైతే ఇంకో 20కోట్ల బిజినెస్ జరగవచ్చు. కానీ కాలాకు కర్ణాటకలో కష్టాలు తప్పేలా లేవు. దాదాపు ఈ సినిమా 280కోట్లు కలెక్ట్ చేస్తేనే హిట్‌గా చెప్పవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. -
‘కాలా’ను విడుదల చేయొద్దు
బెంగళూరు: ‘కాలా’ సినిమాను రాష్ట్రంలో రిలీజ్ చేయవద్దని కర్ణాటక సీఎం కుమారస్వామి సినిమా పంపిణీ దారులను కోరారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని చెప్పారు. హైకోర్టు తీర్పు తర్వాత కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ‘ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా విడుదల చేయటం మంచిది కాదని నిర్మాతకు, పంపిణీ దారులకు సూచిస్తున్నా. ఒక పౌరునిగా, కన్నడిగునిగా చెబుతున్నా..ఇలాంటి పరిస్థితుల్లో ‘కాలా’తో అనవసరపు వివాదాలు తలెత్తుతాయి. స్వతహాగా నేనూ సినిమా పంపిణీదారుడిని, నిర్మాతనే’అని వ్యాఖ్యానించారు. కావేరి వివాదానికి పరిష్కారం దొరికిన తర్వాత ఆ సినిమాను ఎప్పుడైనా విడుదల చేసుకోవచ్చునన్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా ‘కాలా’ విడుదల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన పోలీసు బందోబస్తు కల్పించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదంగా మారింది. కావేరి అంశంపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ‘కాలా’ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామంటూ వివిధ కన్నడ సంఘాలు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 7వ తేదీన ఈ సినిమా రాష్ట్రంలో విడుదల కావాల్సి ఉండగా ఆ చిత్ర పంపిణీ, ప్రదర్శనను నిలిపివేయాలని నిర్ణయించినట్లు కర్ణాటక ఫిలిం చాం బర్ ఆఫ్ కామర్స్(కేఎంసీసీ) కూడా ఇంతకుముందే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రజనీ కుమార్తె ఐశ్వర్య, అల్లుడు, కాలా నిర్మాత కె.ధనుష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న జస్టిస్ జి.నరేందర్.. ‘కాలా’ విడుదల సందర్భంగా అవసరమైన బందోబస్తు చేయాలని ఆదేశించారు. అయితే, ఆ సినిమాను తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ థియేటర్ల యజమానులను కోరబోమన్నారు. -
‘కాలా’కు ఊరట
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కోలీవుడ్ హీరో, రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నారు. పలు వాయిదాల తరువాత ఈ గురువారం విడుదలకు రెడీ అయిన ఈ సినిమాకు కర్ణాటకలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో కావేరి వివాదంలో రజనీ వ్యాఖ్యల కారణంగా వివాదం మొదలైంది. పలు కన్నడ సంస్థలు కాలా రిలీజ్‌ను అడ్డుకుంటామంటూ ప్రకటలు చేశాయి. ఈ విషయంపై చిత్ర నిర్మాత ధనుష్.. కర్ణాటక హైకోర్డును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం, సినిమా ప్రదర్శించేందుకు ముందుకు రాని థియేటర్ల యజమానులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. కానీ కాలా సినిమాను ప్రదర్శించేందుకు సిద్ధమైన థియేటర్ల లిస్ట్ ప్రభుత్వానికి అందిస్తే వారు ఆ థియేటర్లకు రక్షణ కల్పిస్తారని కోర్టు వ్యాఖ్యనించింది. కోర్టు వ్యాఖ్యాలతో కర్ణాటకలో కాలా రిలీజ్‌కు మార్గం సుగమమైనట్టుగా భావిస్తున్నారు రజనీ ఫ్యాన్స్. జూన్ 7న కాలా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. -
కాలా ప్రీరిలీజ్ ఫంక్షన్ హైలైట్స్
-
అన్నింటికంటే అవకాశం గొప్పది: రజనీకాంత్
‘‘1978లో నా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయింది. పది పదిహేను సినిమాలు చేశాను. ‘అంతులేని కథ, తొలి రేయి’... సినిమాలు చేశాను. బ్రేక్ వచ్చింది. తెలుగులో సినిమాలు చేయాలా తమిళంలో సినిమాలు చేయాలా అనే క్వశ్చన్ వచ్చింది. నన్ను బాలచందర్‌గారు ఫస్ట్ తమిళంలో పరిచయం చేశారు. తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చాను. తమిళ వాళ్లు ఎంత ప్రేమ చూపించారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ప్రేమను చూపించారు. అది నా భాగ్యం’’ అని రజనీకాంత్ అన్నారు. రజనీకాంత్ హీరోగా హ్యూమా ఖురేషి, ఈశ్వరీరావ్, నానా పటేకర్, సముద్రఖని ముఖ్య తారలుగా వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మించిన చిత్రం ‘కాలా’. ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకుడు. ఈ నెల 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘తెలుగులో మోహన్‌బాబు ‘పెదరాయుడు’తో నాకు మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ‘భాషా, నరసింహా, చంద్రముఖి, రోబో’ ఇలా నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ ఎప్పుడొచ్చినా అన్నగారు ఎన్టీఆర్‌గారిని కలిసి ఆశీర్వాదం తీసుకునేవాణ్ణి. ఇప్పుడు చాలా గుర్తొస్తున్నారు. ఎందుకో మీకు తెలుసు (తాను రాజకీయాల్లోకి వస్తున్న విషయాన్ని ఉద్దేశించి). గురువుగారు బాలచందర్‌గారు, దాసరిగారిని గుర్తు చేసుకుంటున్నాను. గొప్ప దర్శకులు అని మనకు తెలియనిది కాదు. దాసరిగారు నన్ను బిడ్డలా చూసుకునేవారు. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి అని కోరుకుంటున్నాను. ధనుష్ ఇందాక ‘ఒక్కరే రజనీకాంత్’ అన్నాడు. ఒక్కరే చిరంజీవి. ఒక్కరే నాగార్జున, ఒక్కరూ వెంకటేశ్, ఒక్కరే బాలకృష్ణ. అన్నింటికంటే అవకాశం చాలా గొప్పది. అవకాశం రావడం ముఖ్యం. దేవుణ్ణి నమ్మనివారు లక్ అంటారు, నమ్మే వాళ్లు దైవబలం, దేవుని ఆశీర్వాదం అంటారు. నాకు వచ్చిన అవకాశాన్ని వదులుకోను. కష్టపడి శ్రమించాను. ఫలితం దొరుకుతోంది. ‘కబాలి’ సినిమాకి దర్శకుడు పా. రంజిత్‌కి అవకాశం ఇచ్చినప్పుడు ‘ఎందుకు అంత కొత్త కుర్రాడు’ అని అన్నారంతా. అతను సినిమా తీసే విధానం నాకు నచ్చింది. మళ్లీ నా అల్లుడు ధనుశ్‌తో కలిసి తనతోనే రెండో సినిమా చేశా. మొన్నే ‘కాలా’ సినిమా చూశా. చాలా బావుంది. కమర్షియల్‌గా కంటే కూడా మెసేజ్ ఇస్తుంది. రియాలిటీ ఉంటుంది. రంజిత్ బాగా ప్రజెంట్ చేశాడు. ఆసియాలోనే పెద్ద స్లమ్ ధారావీ. అక్కడివాళ్లు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు? అనే ఐడియాని సినిమాలో చూపిస్తున్నాం. సాధారణంగా సినిమాలో ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్‌గా ఉంటుంది. కానీ ‘కాలా’లో 5–6 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గుర్తుంటాయి. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది సినిమా. ధారావీలోని జనం స్ట్రగుల్ ఏంటి? అనే విషయాన్ని చూపించాం. సంతోశ్ నారాయణ్ ఈజ్ బెస్ట్. క్లాసీ మ్యూజిక్ ఇచ్చాడు. ఈశ్వరీ రావ్ తెలుగమ్మాయే. చాలా బాగా చేసింది. హ్యూమా ఖురేషి ఎంతో ఓపికగా ఉన్నారు. ముంబై నుంచి చైన్నై రావడం. బాగా సహకరించారు. హ్యాట్సాఫ్. ధనుష్ మంచి నటుడు అని తెలుసు. కానీ నిర్మాతగా ఎలా చేస్తాడా? అని అనుకున్నాను. నిర్మాతగా కూడా ప్రూవ్ చేçసుకున్నాడు. ఈ సినిమా డెఫినెట్‌గా మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ధనుష్ మాట్లాడుతూ – ‘‘కాలా’ జనం సినిమా. వాళ్ల మీద తీసిన సినిమా. వాళ్ల కోసం తీసిన సినిమా. బోల్డ్‌గా, రీసెర్చ్ చేసి తీసిన సినిమా. కేవలం ధారావి అనే కాదు ప్రపంచంలో అణగారిపోతున్న వాళ్ల గురించి చెప్పే సినిమా. వాళ్లందర్నీ లీడ్ చేయడానికి ఒక లీడర్ కావాలి. రజనీకాంత్ కంటే ఇంకెవరున్నారు? 40 ఏళ్లుగా రజనీకాంత్‌గారి మీద ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. చాలా మంది నెక్ట్స్ రజనీకాంత్ అవ్వాలని స్ట్రగుల్ అవుతున్నారు. దానికి ఫార్ములా లేదు. ఒక్కరే రజనీకాంత్. మన దేశం గర్వించేలా చేస్తున్నారు రజనీకాంత్‌గారు. తెలుగు సూపర్‌స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘రజనీగారి సినిమా గురించి మాట్లాడే స్థాయి లేదు. 1999లో డిస్ట్రిబ్యూటర్‌గా ‘నరసింహా’ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశా. ఆ సక్సెస్‌ని ఎంత ఎంజాయ్ చేశానో రత్నంగారికి తెలుసు. మళ్లీ 19 ఏళ్ల తర్వాత ‘కాలా’ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. మామ హీరోగా అల్లుడు ధనుష్ తీసిన ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుంది. ‘కబాలి’ సక్సెస్‌ను పట్టించుకోకుండా రజనీగారు రంజిత్‌కు మళ్లీ చాన్స్ ఇవ్వడం గ్రేట్’’ అని చెప్పారు. రంజిత్ మాట్లాడుతూ – ‘‘కాలా సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. రజనీకాంత్ యాక్షన్ మనందర్నీ అలరిస్తుంది. సినిమా మొత్తం పాలిటిక్స్ మాట్లాడుతుంది. మా ఐడియాలజీ మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ల్యాండ్ ఇష్యూని డిస్కస్ చేశాం. వాళ్ల కష్టాల్ని చూపించాం’’ అన్నారు. ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘రజనీకాంత్‌గారు నాకు భగవంతుడితో సమానం. ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన ఎంతో ఇష్టంతో చేసిన ‘బాబా’ను నాకు తెలుగులో రిలీజ్ చేసే అవకాశం ఇచ్చారు. వారం తర్వాత ఎలా ఆడుతుందని అడిగారు. ఆ తర్వాత నెలరోజులకి రమన్నారు. మొత్తం లెక్కలు చూస్తే.. కోటీ అరవై లక్షలు నష్టం వచ్చింది. దానికి ఇంకో లక్ష కలిపి ఇచ్చారు. లక్ష రూపాయిలు ప్రాఫిట్ అన్నారు. ఫ్యూచర్లో ఇంకా ఎన్నో సంచలనాలకు కారకుడు అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఏయం రత్నం మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్ అంటే సక్సెస్, సింపుల్, స్టైల్. ఇవన్నీ అందరికీ ఇన్స్పిరేషన్. ‘అరుణాచలం, నరసింహా’ సినిమాలు తెలుగులో రిలీజ్ చే శా. రజనీని దేశంలో ఎవరైనా ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని రంజిత్ న్యాచురల్, డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌తో తీశారు. కచ్చితంగా సక్సెస్ సాధిస్తుంది’’ అన్నారు.‘‘ఈ అవకాశం ఇచ్చిన రజనీకాంత్గారికీ, ధనుష్, రంజిత్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో భాగం అయినందుకు హానర్‌గా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు హ్యూమా ఖురేషీ. ‘‘ కాలా సినిమా స్లమ్ గురించి మాట్లాడుతుంది. రజనీకాంత్‌గారితో మళ్లీ వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ’’ అన్నారు సంతోష్ నారాయణ్. -
‘కాలా’ కమర్షియల్ కాదు... మెసెజ్ ఓరియంటెడ్ : రజనీ
‘కాలా సినిమాను నేను రెండు మూడు సార్లు చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ కాదు.. ఒక మంచి మెసెజ్ ఉంటుంద’ని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడకు వస్తే నా గత సినిమాలు గుర్తొస్తాయి. అంతులేని కథ, అన్నదమ్ముల సవాల్ ఇలా ఓ పదిహేను తెలుగు సినిమాలు చేశాను. అయితే నేను తెలుగులో సినిమాల్లో కొనసాగాలా.. లేదా తమిళంలో చేయాలా అని ఆలోచించాను. నా గురువు బాలచందర్ గారు తమిళ్లో నాకు మొదటి సినిమాను ఇచ్చారు. నా సినీ జీవితం తమిళంలో మొదలైంది. అలా నా కెరీర్ తమిళ్లో కంటిన్యూ అయింది. తరువాత కొద్ది కాలానికి మోహన్‌బాబు పెదరాయుడు సినిమాలో పాత్ర ఇచ్చారు. దాని తరువాత మళ్లీ భాషా, ముత్తు, అరుణాచలం, నరసింహా, చంద్రముఖి, రోబో, శివాజి లాంటి సినిమాలతో మీ ముందుకు వచ్చాను. తమిళ్ ప్రేక్షకులు నన్నుఎంతగా అభిమానిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే అభిమానిస్తున్నారు. ఇది నా భాగ్యం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ గారిని కలిసి వారి ఆశీర్వాదాన్ని తీసుకునే వాడిని. దాసరి గారు చనిపోవడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. నేను అమెరికాలో ఉండడం వల్ల కబాలి సినిమా సమయంలో నేనిక్కడికి రాలేకపోయాను. కబాలి చేస్తున్నప్పుడు ఇంత చిన్న కుర్రాడికి ఎందుకు చాన్స్ ఇచ్చారని అడిగారు. అతను కథ చెప్పినప్పుడు చేసినప్పుడే నాకు చాలా నచ్చింది. కబాలి సినిమాను ఎంత బాగా తీశాడో చూశాం. అందుకే మళ్లీ రంజిత్‌తో కలిసి చేయాలని అనిపించింది. అందుకే కాలా చేశాను. నా అల్లుడు (ధనుష్) నిర్మాత అంటే సినిమాను బాగా తీయగలడా అనే అనుమానం కలిగింది. కానీ అతను మంచి నటుడే కాదు, మంచి నిర్మాత అని కూడా నిరూపించుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన హ్యూమా ఖురేషి కూడా ఎంతో సహకరించింది. అందుకు ఆమెకు ధన్యవాదాలు. సినిమాకు సంతోష్ నారాయణ మంచి సంగీతం అందించారు. ఆసియాలో అతి పెద్ద మురికివాడ అయిన ధారావి ప్రాంతానికి సంబంధించిన ఈ సినిమాలో, వారి జీవన పరిస్థితులు, అక్కడి మనుషుల ప్రేమలను అందంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర ఆకట్టుకుంటుంద’ని రజనీ అన్నారు. -
కాలాలో పోరాట సన్నివేశాలపై రగడ
తమిళసినిమా: కాలా చిత్రంలో 30 నిమిషాల పోరాట సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 7వ తేదీన విడుదల కానుంది. ఇదిలాఉండగా రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అవుతున్నారు. ఆయన రాజకీయ రంగప్రవేశం అభిమానుల 25 ఏళ్ల ఆకాంక్ష. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల తూత్తుక్కుడిలో స్టెరిలైట్ పోరాటంలో గాయపడిన వారిని పరామర్శిచడానికి రజనీకాంత్ వెళ్లిన విషయం తెలిసిందే. వారికి ఆర్థిక సాయం అందించిన రజనీకాంత్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్టెరిలైట్ పోరాటంలో సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని, అన్నిటికీ పోరాటాలు చేసుకుంటూ పోతే రాష్ట్రం శ్మశానం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోరాటానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన రజనీ తన కాలా చిత్రంలో 30 నిమిషాల పాటు పోరాట దృశ్యాలు చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కాలా కోసం రంగంలోకి విశాల్
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ కాలా కోసం నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ రంగంలోకి దిగారు. రజనీకాంత్ నటించిన కాలా చిత్రానికి సంబంధించిన కర్ణాటక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాలా చిత్రం 7న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు వ్యవహారంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటకలోని కొన్ని సంఘాలు తీవ్రంగా పరిగణించారు. దీంతో కాలా చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ప్రజల మనోభావాలకనుకుగుణంగా కర్ణాటక ఫిలిం చాంబర్ కూడా కాలా చిత్ర విడుదలపై నిషేధం విధించింది. దీంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ సమస్యల సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కర్ణాటక ఫిలిం చాంబర్ నిర్వాహకులతో కాలా విషయమై చర్చించారు. ఈ సందర్భంగా విశాల్ గురువారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో రజనీకాంత్ నటించిన కాలా చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయకూడదని, చిత్రంపై నిషేధం విధించాలని కొన్ని కర్ణాటక సంఘాలు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై తాము కర్ణాటక ఫిలించాంబర్ నిర్వాహకులతో చర్చలు జరిపాం. బుధవారం సాయత్రం సమావేశం జరిగింది. గురువారం ఒక నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ఫిలించాంబర్ నిర్వాహకులు చెప్పారు. సినిమా, రాజకీయాలు వేర్వేరు. కాలా చిత్రం నిర్మాత నిర్మించగా అందులో రజనీకాంత్ నటించారు. ఇది సినిమా. రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం వేరు. అయితే కర్ణాటక ఫిలించాంబర్ ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కాలా వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమరస్వామిని తాము కలుస్తాం. కాలా చిత్రం అన్ని ప్రాంతాల్లోనూ సక్రమంగా విడుదల కావాలన్నదే మా భావన. కావేరి సమస్య గురించి.. కావేరి సమస్య గురించి రజనీకాంత్, కమలహాసన్, శింబు, నేను కూడా మాట్లాడాం. అది వ్యక్తిగతం. వ్యక్తిగత అభిప్రాయాలు చిత్రానికి బాధింపు కాకూడదు. మీరు రాజకీయాల్లోకి వస్తారా? అంటే ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు. ఏ సంఘాలైనా రాజకీయాలను, సినిమాలను కలపడం తప్పు. మనమంతా భారతీయులం. రాష్ట్రాలన్నవి ఒక సరిహద్దులు అంతే. వారి పేర్లు చరిత్రలో లిఖించాలి తుత్తుక్కుడి పోలీసుల కాల్పులకు 13 మంది మరణించారు. అయితే అక్కడ మరణించి లెక్కకు రానివారు ఇంకా ఎందరున్నారో నాకు తెలుసు. అక్కడి స్టెర్లైట్ పరిశ్రమను మూసేశారు. అందుకు ప్రాణాలర్పించిన వారి పేర్లు చరిత్రలో లిఖించాలి. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పుడు మోకాళ్లకు కింద భాగంలోనే షూట్ చేయాలన్నది అందరికీ తెలిసినదే. ప్రజలకు సంబంధించి విషయాలు అది జల్లికట్టు సమస్య, నెడువాసలా, స్టెర్లైట్ సమస్య ఏదైనా సరే వారి భావోద్రేకాలను గుర్తించి వారి అవసరాలకనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధానమంత్రి విదేశీ పర్యటన చేయకుండా స్వదేశంలో సమస్యలను పరిష్కరిస్తే సంతోషం. మేమూ తమిళ సినిమా కోసం పోరాడుతున్నాం. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రధానిని కోరుకుంటున్నాం. స్వదేశీ సమస్యలు పట్టించుకుని పరిష్కరిస్తే మేమూ ఆయనకు ఓటు వేస్తాం. మంచి చేయకుంటే ఎలా ఓటు వేస్తాం. నిర్మాతల మండలి చేయూత తూత్తుక్కుడిలో కాల్పులకు బలైన వారి కుటుంబాలకు నిర్మాతల మండలి తరఫున ఆర్థిక సాయం చేయాలని భావిస్తున్నామని తెలిపారు 13 మందిని కోల్పోవడం ఆ కుటుంబాలకు తీరని లోటే అని వారిని మరచిపోకూడదని ఆయన ఆవేదనతో చెప్పారు. భారత ప్రధాని మోదీని ఓటు వేసిన వాడిగా వేడుకుంటున్నానని మన దేశ సమస్యలపై ఆయన దృష్టి సారించండి అని విశాల్ పేర్కొన్నారు. -
స్క్రీన్ ప్లే 29th May 2018
-
కాలా ట్రైలర్
-
తలైవా అభిమానుల అసంతృప్తి
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా వస్తోందంటే అభిమానులకు పండుగే. రజనీ సినిమాలు ఫెయిల్ అయినా సరే ఈ సూపర్‌స్టార్ క్రేజ్ ఏ మాత్రం చెక్కుచెదరదు. గత కొంతకాలంగా తలైవాకు సరైన హిట్ లేదు. కొచ్చాడియన్, లింగా, కబాలి సినిమాలు ఆశించనంతగా ఆడలేదు. అయినా సరే మళ్లీ రజనీ సినిమా వస్తుందంటే అభిమానలు వేయి కళ్లతో ఎదురు చూస్తూంటారు. ప్రస్తుతం కాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కబాలి ఫేం పా రంజిత్ డైరెక్షన్లో రాబోతున్న కాలా చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కబాలి విడుదల సమయంలో చేసిన ప్రమోషన్ కార్యక్రమాలు బహుశా ఏ ఇతర భారతీయ సినిమాలకు చేసి ఉండరు. ఏకంగా విమానాలపై కబాలి పోస్టర్స్‌ను వేశారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు కబాలి రిలీజ్ రోజున సెలవు కూడా ప్రకటించాయి. ఇప్పుడు కాలా సినిమాకు ట్విటర్ ఎమోజీని క్రియేట్ చేశారు చిత్రయూనిట్. అయితే దీనిపై తలైవా అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ఆ ఎమోజీలో రజనీ సరిగా కనబడటం లేదని అభిమానులు వాపోతున్నారు. మరికొందరు కొన్ని నమూనాలను డిజైన్ చేసి చిత్రయూనిట్‌కు ట్యాగ్ చేశారు. మరి వీరి బాధను కాలా టీం పట్టించుకుంటుందో లేదో చూడాలి. #Kaala emoji. All i see is a think red line with a black background. Wish they chose a different pic or worked on the resolution. — Prashanth Rangaswamy (@itisprashanth) May 28, 2018 Actually, i expected an Emoji of something like this from the team #Kaala , what they delivered is hardly visible Made some quick images, please take my samples into consideration, @wunderbarfilms @dhanushkraja @beemji or ask designer to comeup something visible to eyes! pic.twitter.com/zNBhQXzPfx — AG (@arunrp555) May 28, 2018 -
పది కాలాల పాటు చెప్పుకునేలా..
తమిళసినిమా: దక్షిణాది ప్రేక్షకులు ఏ పాటి అభిమానం కురిపిస్తారోనన్న ఆసక్తితో ఎదురుచూస్తున్న ఉత్తరాది బ్యూటీ హ్యూమాఖురేషి. ఐశ్వర్యారాయ్, దీపికాపదుకొనే, సోనాక్షిసిన్హా వంటి బాలీవుడ్ బ్యూటీల తరువాత సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జతకట్టే అవకాశాన్ని అందుకున్న నటి హ్యూమాఖురేషీ. రజనీకాంత్ నటించిన కాలా చిత్రంలో నటి ఈశ్వరిరావు ఆయన భార్యగా నటించగా, నటి హ్యూమాఖురేషి ఆయన ప్రియురాలిగా నటించిందని సమాచారం. హిందీ నటుడు నానాపటేకర్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందించారు. నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించిన కాలా చిత్రానికి పా.రంజిత్ దర్శకుడన్నది తెలిసిందే. కబాలి తరువాత వెంటనే రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసిన అరుదైన దర్శకుల్లో ఆయన చేరతారు. కాలా చిత్ర విడుదలపై పలు ఊహాగానాలు ప్రచారం అయిన నేపథ్యంలో ఎట్టకేలకు అలాంటి ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెట్టే విధంగా నిర్మాత ధనుష్ జూన్ 7న కాలా చిత్రం విడుదలను ఖరారు చేశారు. ఆ విధంగా తెరపైకి ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇందులో నటించిన హ్యూమాఖురేషీ కాలా చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు, కథానాయకుడు రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇందులో తన 1980 కాలం నాటి రజనీకాంత్ ప్రియురాలిగా 45 ఏళ్ల ప్రౌడగా నటించినట్లు సమాచారం. హ్యూమాఖరేషి తన ట్విట్టర్లో పేర్కొంటూ కాలా చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు, పది కాలాల పాటు గుర్తుండిపోయే మంచి పాత్రలో నటింపజేసినందుకు దర్శక నిర్మాతలకు, కథానాయకుడు రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని పేర్కొంది. ముంబయిలోని ధారవి నేపథ్యంలో సాగే కాలా చిత్రంలో రజనీకాంత్ మరోసారి దాదాగా నటించారన్నది తెలిసిన విషయమే. ఇందులో 8 పాటలు చోటుచేసుకుంటాయట. కొన్ని సన్నివేశాలను ముంబయిలోని ధారవి ప్రాంతంలో చిత్రీకరించినా, అధిక భాగాన్ని చెన్నైలోనే ధారవిసెట్ను వేసి చిత్రీకరించారు. రజనీకాంత్ తన తాజా చిత్రాన్ని యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రం జూన్ రెండవ వారంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. -
‘కాలా’ను విడుదల కానివ్వం!
యశ్వంతపుర : సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ‘కాలా’పై కన్నడనాట నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కావేరి జలాల విషయంలో కన్నడిగులకు వ్యతిరేకంగా మాట్లాడిన రజనీ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కానివ్వబోమని కన్నడ చళువళి వాటాల్ పార్టీ అధ్యక్షుడు వాటాల్ నాగరాజ్ తెలిపారు. కర్ణాటకవాడైన రజనీకాంత్ సొంత రాష్ట్రమని కూడా మమకారం చూపకుండా కావేరి నిర్వహణ మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయటం సమంజసం కాదన్నారు. శనివారం నాగరాజు ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడారు. కాలా సినిమాను విడుదల చేసే తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. రజనీకాంత్ సినిమాలతో పాటు కమల్‌హాసన్ సినిమాలను కూడా అడ్డుకొంటామని ఆయన చెప్పారు. పలు కన్నడసంఘాలు కూడా కాలాను అడ్డుకుంటామని శనివారం ప్రకటించాయి. -
7న ‘కాలా విడుదలయ్యేనా?
తమిళసినిమా: జూన్ 7న కాలా చిత్రం తెరపైకి రావడం ఖాయం కాదా? ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన అంశం ఇదే. 2.ఓ చిత్రం మాదిరిగానే కాలా చిత్రానికి అడ్డంకులు ఎదురై నిర్మాతలను ఇబ్బందికి గురిచేస్తున్నాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలే ఈ రెండూ కావడం విశేషం. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న బ్రహ్మాండ భారీ బడ్జెట్ చిత్రం 2.ఓ. ఈ చిత్ర నిర్మాణం మొదలై దాదాపు మూడేళ్లు కావస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకునే చాలా కాలం అయినా నిర్మాణాంతర కార్యక్రమాల్లో(గ్రాఫిక్స్) జాప్యం కారణంగా ఇప్పటికే రెండుసార్లు విడుదల తేదీని వాయిదా వేయాల్సిన పరిస్థితి. చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేసినా, అది కాస్తా ముందుగానే సామాజిక మాధ్యమాల్లో లీక్ అవడంతో శంకర్ ఆ ట్రైలర్‌ను మూట కట్టి అటకెక్కించి కొత్తగా టీజర్‌ను రెడీ చేశారు. దీన్ని ఐపీఎల్ ఫైనల్ వేదికపై విడుదల చేయడానికి సిద్ధం అయినట్లు, అయితే ఇటీవల తూత్తుక్కుడిలో స్టెర్లైట్ కాల్పులు తమిళనాడును అతలాకుతలం చేయడంతో 2.ఓ చిత్ర యూనిట్ తన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఇక రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన మరో చిత్రం కాలా. దీన్ని ఆయన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మించడం విశేషం కాగా, కబాలి చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వం వహించారన్నది గమనార్హం. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కంటే ముందు చిత్రీకరణ పూర్తి చేసుకున్న 2.ఓ చిత్రం గ్రాఫిక్స్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ధనుష్ కాలా చిత్రాన్ని ముందు విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. గత ఏప్రిల్ 27న కాలా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు కూడా. అయితే ఆ సమయంలో చిత్ర పరిశ్రమ సమ్మె కాలా విడుదలకు అడ్డుపడింది. దీంతో జూన్ 7వ తేదీకి చిత్ర విడుదలను వాయిదా వేసుకోక తప్పలేదు. ఇక ఈ తేదీ మారే అవకాశం లేదులే అనుకుంటున్న సమయంలో తూత్తుక్కుడిలో స్టెర్లైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటంలో పోలీసుల కాల్పులు, అమాయక ప్రజలను బలిగొనడం వంటి సంఘటనలతో ఇప్పుడు తమిళనాడు ఆగ్రహ జ్వాలలతో రగులుతోంది. రాజకీయ రంగప్రవేశానికి పునాదులు వేసుకుంటున్న రజనీకాంత్ ఈ సమయంలో కాలా చిత్రాన్ని విడుదల చేయడం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. 2.ఓ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఐపీఎల్ ఫైనల్ వేదికపై నిర్వహించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు గానే కాలా చిత్ర తెలుగు వెర్షన్ ఆడియోను ఈ వారంలో నిర్వహించాలన్న ప్రణాళికలోనూ మార్పులు చేసినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కాలా చిత్ర విడుదల జూన్ 7వ తేదీ ఉంటుందా? అన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తం అవుతోంది. విషయం ఏమిటంటే ఈ రెండు చిత్రాల విడుదల రజనీకాంత్ రాజకీయ జీవితానికి ముడి పడిఉన్నాయన్నది. ఆయన రాజకీయ రంగప్రవేశం గురించి గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రజనీకాంత్ నటించిన రెండు చిత్రాల విడుదలకు ఏదో ఒక రూపంలో అవాంతరాలు వస్తున్నాయన్నది గమనార్హం. -
కాలా కాస్త ఎక్కువే
క్వాలిటీ అండ్ కంటెంట్ పరంగా సినిమాలో పవర్ ఉంటే నిడివి ఎంత ఉన్నా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు ‘అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మహానటి’ చిత్రాలే నిదర్శనం. ఈ సినిమాల నిడివి దాదాపు రెండున్నర గంటల పైమాటే. తాజాగా ఈ క్లబ్‌లోకి ‘కాలా’ కూడా చేరాడు. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో హీరో ధనుష్ నిర్మించిన చిత్రం ‘కాలా’. ఈ సినిమా సెన్సార్ కంప్లీటైంది. ‘కాలా’ చిత్రం నిడివి 2గంటల 46 నిమిషాల 59 సెకన్లు. ఈ సినిమా సెకండాఫ్‌లో రజనీ రౌడీయిజం, డైలాగ్స్ సూపర్బ్‌గా ఉంటాయట. అందుకే ‘కాలా’ టీమ్ నిడివి తగ్గించేందుకు రాజీ పడలేదని టాక్. నానా పటేకర్ కీలక పాత్ర చేసిన ఈ సినిమాలో అంజలీ పాటిల్, హ్యూమా ఖురేషీ కథానాయికలు. ఈ సినిమా జూన్ 7న విడుదల కానుంది. -
ఒక్క పాటలో పది లక్షల గొంతులు
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కబాలి ఫేం పా రంజిత్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 7న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ వెల్లడించారు. ఈ సినిమాలోని ఒక పాటను ఏకంగా పది లక్షల మందితో రికార్డ్ చేసినట్టుగా తన సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించారు సంతోష్. ‘నాకు ఎప్పటి నుంచో ఒక పాటు పది లక్షల గొంతులను రికార్డ్ చేయాలన్న కల ఉంది. కాలా సినిమాలోని పాటకు ఆ అవకాశం దక్కింది. అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో రికార్డింగ్ చేయడం గౌరవంగా భావిస్తున్నా. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.’ అంటూ ట్వీట్ చేశారు సంతోష్ నారాయణన్. రజనీకాంత్ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్, ఈశ్వరీ రావు, హుమా ఖురేషీ, సముద్రఖనిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. I have always had this dream of recording a million voices in a song & have the perfect opportunity in a song from #kaala. It would be a great honour recording people from all walks of life. We are so excited and will update details very shortly.Peace! #kaala1million — Santhosh Narayanan (@Music_Santhosh) 29 April 2018 -
నెక్ట్స్ సినిమాకు రజనీ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తమిళనాట మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా రజనీకాంత్ సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తాయి. రోబో తరువాత రజనీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. రజనీ స్టైల్స్‌కు బాలీవుడ్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే రజనీకాంత్ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా భారీగా కలెక్షన్లు వస్తుంటాయి. అందుకు తగ్గట్టుగా రజనీకాంత్ రెమ్యూనరేషన్ కూడా భారీగా అందుకుంటున్నాడు. ప్రస్తుతం కాలా, 2.ఓ సినిమాల రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న తలైవా, త్వరలో యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు రజనీకాంత్ 65 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. కేవలం 40 రోజుల షూటింగ్‌కు గాను రజనీ ఈ మొత్తం అందుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తుండగా విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. -
అదిరే యాక్షనట!
తమిళసినిమా: రజనీకాంత్ ఈ పేరే అభిమానులకు ఒక మంత్రం. సూపర్‌స్టార్ రాజకీయాల్లోకి రావాలని వారు జపం చేస్తున్నారు. ఎట్టకేలకు అభిమానుల తపం ఫలించింది. రజనీకాంత్ రాజకీయ పయనానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే సినీప్రియులు మాత్రం ఆయన నటించిన కాలా, 2.ఓ చిత్రాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గ్రాఫిక్స్ పనులు పూర్తికాకపోవడంతో ముందుగా తెరపైకి రావలసిని 2.ఓ వెనక్కు, ఆ తరువాత రావలసిన కాలా ముందుకు వస్తోంది. అన్నీ బాగుంటే ఈ శుక్రవారం కాలా చిత్రం ప్రేక్షకులకు విందు అయ్యేది. కోలీవుడ్ సమ్మె కారణంగా జూన్ 7వ తేదీకి వాయిదా పడింది. రజనీకాంత్‌తో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు నానాపటేకర్, నటి హ్యూమ ఖురేషి, ఈశ్వరిరావు, అంజలిపటేల్, అరుంధతి, సాక్షి అగర్వాల్, సుకన్య సముద్రకని, సంపత్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహించారు. కబాలి తరువాత ఆయన రజనీకాంత్‌తో చేసిన రెండవ చిత్రం కాలా. సంతోష్ నారా యణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించారు. కాలా చిత్రం వ్యా పార పరంగా ఇప్పటికే ధనుష్‌కు భారీ లా భాలను అందించి పెట్టింది. తాజాగా శాటిలైట్ హక్కులను భారీ మొత్తంలో విజయ్ టీవీ దక్కించుకుందన్నదని సమాచారం. ఒక ఈ విషయం ఇలా ఉంటే రజనీకాంత్ మరో చిత్రానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్ వైద్య పరీక్షలకు అమెరికా వెళ్లిన రజనీకాంత్ చెన్నైకి తిరిగి రాగానే రాజకీయ పార్టీ ఏర్పాటు కార్యక్రయంతో పాటు, కొత్త చిత్ర షూటింగ్‌లోనూ పాల్గొననున్నారనే ప్ర చారం జరుగుతోంది. రజనీ కాంత్ కొత్త చిత్రానికి యువదర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్నాన్న విషయం తెలిసిందే. ఇది రాజకీయ నేపథ్యంలో సాగుతుందనే ప్రచారం జ రుగుతున్న విషయం తెలి సిందే. కొత్తగా వెలువడ్డ విషయం ఏమిటంటే ఇది అదిరే యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియడానికి ఎంతో దూరం లేదు. -
వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు రజనీ
కాలా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికా వెళ్లనున్నారు. గతంలో తీవ్ర ఆరోగ్య సమస్యతో అమెరికాలోని హాస్పిటల్లో చేరిన రజనీ తరువాత తరుచూ చెకప్ కోసం అక్కడికే వెళ్తున్నారు. సోమవారం రాత్రి మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. రజనీ రెండు వారాల పాటు అమెరికాలోనే ఉండే అవకాశం ఉంది. సూపర్ స్టార్ హీరోగా తెరకెక్కిన కాలా జూన్ 7న రిలీజ్ కు రెడీ అవుతుండగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 2.ఓ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించారు రజనీ. ఈ సినిమా త్వరలో ప్రారంభంకానుంది. -
ముందు కమల్.. తరువాతే రజనీ
కోలీవుడ్ ఇండస్ట్రీ సమ్మె విరమిస్తున్నట్టుగా ప్రకటించటంతో సినిమాల రిలీజ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. అయితే ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న కన్య్ఫూజన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా, కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన విశ్వరూపం 2 సినిమాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉన్నాయి. ఇద్దరు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అగ్ర తారలు కావటంతో ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. కోలీవుడ్ సమాచారం మేరకు ముందుగా విశ్వరూపం 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుందట. విశ్వరూపం 2 సెన్సార్ కార్యక్రమాలు ముందుగా పూర్తయినందున ఆ సినిమానే ముందుగా విడుదల అవుతుందని తెలుస్తోంది. మే నెలలో విశ్వరూపం 2ను విడుదల చేసి తరువాత జూన్‌లో రజనీకాంత్ కాలాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం చిత్ర నిర్మాతలు ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. -
విడుదలకు సిద్ధంగా ముప్ఫై సినిమాలు
చెన్నై: సినీ పరిశ్రమ సమ్మెతో ముప్పైకి పైగా చిత్రాలు 48 రోజులుగా ఎదురు చూపులతో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో రజనీకాంత్ కాలా, కమలహాసన్ విశ్వరూపం–2 చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇవి తెరపైకి వచ్చేది ఎప్పుడన్న ఆసక్తి కోలీవుడ్‌లో నెలకొంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు, థియేటర్ల సంఘాలతో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిర్మాతల సంఘం జరిపిన చర్చలు ఫలించకపోవడంతో గత మార్చి 1 నుంచి కొత్త చిత్రాల విడుదలను, 16వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేసి సమ్మెకు దిగారు. 48 రోజుల సమ్మె అనంతరం రాష్ట్ర సమచార, ప్రసారాల శాఖ మంత్రి కడంబూర్ రాజు నేతృత్వంలో మంగళవారం సినీ సంఘాల నేతలు నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు ఫలించాయి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ తమ రేట్లను 50శాతం తగ్గించుకోవడానికి అంగీకరించారు. అదేవిధంగా టిక్కెట్ బుక్కింగ్ విధానం కంప్యూటర్లో పొందుపరచడం లాంటి డిమాండ్లకు థియేటర్ల యాజమాన్యం అంగీకరించింది. దీంతో చిత్ర షూటింగ్‌లు ప్రారంభోత్సవం, కొత్త చిత్రాల విడుదల విషయంలో నిర్మాతల మండలి బుధవారం సమావేశమై నిర్ణయం వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చిత్రా విడుదల సెన్సార్ అయిన తేదీల ప్రకారం ఉంటుందని నిర్మాతల మండలి ప్రకటించింది. విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్లో కాలా, విశ్వరూపం– 2, మెర్క్యూరీ, మిస్టర్ చంద్రమౌళి, మోహిని, కరు, టిక్ టిక్ టిక్, నరకాసురన్, ఇరుట్టు అరైయిల్ మొరట్టు కుత్తు, గజినీకాంత్, ఇరుంబుతిరై, అసురవధం, పరియేరుమ్ పెరుమాళ్, ఆణ్‌దేవదై, అభియుమ్ అనువుమ్, భాస్కర్ ఒరు రాస్కెల్, సర్వర్సుందరమ్, కుప్పత్తురాజా, ఆర్కే.నగర్, పార్టీ, కడైకుట్టిసింగం, ఇమైకా నోడిగళ్ అంటూ 30 చిత్రాలకు పైగా రెడీగా ఉన్నాయి. సెన్సార్ అయిన తేదీ ప్రకారం చూస్తే కాలా చిత్రం ఈ నెల 27న విడుదలయ్యే అవకాశం లేదనిపిస్తోంది. కాలా కంటే ముందే విశ్వరూపం–2 సెన్సార్‌ను పూర్తి చేసుకుని ఉండడంతో ఆ చిత్రమే ముందుగా తెరపైకి రావాల్సి ఉంది. ఈ విషయంలో నిర్మాతల మండలి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
‘కాలా’ టీజర్లో ధోని..
సాక్షి, చైన్నై: సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాలా’ సినిమా ఫీవర్ దక్షిణాదిలో సినీప్రియులకు ఎంతలా సోకిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను విడుదలైన 24 గంటల్లోనే కోటి ఇరవై లక్షల మంది వీక్షించారు. దీన్ని బట్టి తెలుస్తుంది కాలా ప్రభంజనం. అయితే తాజాగా క్రికెటర్లూ రజనీ ‘కాలా’ టీజర్‌కు ఫిదా అయిపోయారు. ఈ సినిమా ట్రైలర్‌ను స్పూఫ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (సీఎస్కే) రజనీపై తమ అభిమానాన్ని చాటుకుంది. సీఎస్కే టీజర్లో క్రికెటర్ హర్భజన్ సింగ్ ‘కాలా’ అదేం పేర్రా..! అంటాడు. వెంటనే ఓపెనర్ విజయ్ కాలా అంటే కరికాలుడు..చావుకే దడ పుట్టించేవాడు అనే డైలాగ్ విసురుతాడు. వెస్టిండీస్ ప్లేయర్ డ్వేన్ బ్రావో కాలా అంటే కాపాడేవాడు.. నమ్మిన వాళ్లను గొడవ పడైనా కాపాడతాడు అంటూ విజయ్‌ని అనుసరిస్తాడు. టీజర్ చివర్లో.. టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ‘ఏం రా సెట్టింగా’ అంటూ రజనీ స్టైల్లో చెప్తాడు. చివర్లో మళ్లీ సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఈ కరికాలుడి పూర్తి రౌడీయిజాన్ని ఎప్పుడు చూళ్లేదు కదూ... ఇప్పుడు చూపిస్తా అని విలన్లను రఫ్పాడిస్తాడు. ఇలా కాలా టీజర్లో సీఎస్కే క్రికెటర్లు హంగామా చేశారు. ఒక పక్క ‘కాలా’ సినిమా టీజర్‌ను చూసి రజనీ అభిమానులు ఎంజాయ్ చేస్తుండగా.. మరోపక్క సీఎస్కే జట్టు ఈ సినిమా టీజర్‌ని తన వెర్షన్లో చూపించి అటు సినిమా ఇటు క్రికెట్ అభిమానులని ఆకట్టుకుంటోంది. -
సీఎస్కే ‘కాలా’ టీజర్
-
‘దంగల్’ సరసన ‘కాలా’
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే బిజినెస్ పరంగా సంచలనాలు నమోదు చేస్తున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 75 కోట్లకు స్టార్ సంస్థ ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్‌ను సొంతం చేసుకుందట. దీంతో శాటిలైట్ రైట్స్ రూపంలో అత్యధిక మొత్తం సాధించిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది ఈ సినిమా. అంతేకాదు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దంగల్ సినిమా రైట్స్ కూడా ఇదే మొత్తానికి అమ్ముడవ్వటం విశేషం. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న 2.ఓ, సంచలన విజయం సాధించిన బాహుబలి 2 చిత్రాలు మాత్రమే ఈ లిస్ట్‌లో కాలా కన్నా ముందున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో రజనీ మాఫియా డాన్ కరికాలన్‌గా నటిస్తున్నాడు. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ ప్రతీనాయకుడిగా నటిస్తుండగా హ్యూమా ఖురేష్ రజనీకాంత్‌కి జోడిగా నటిస్తోంది. రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. -
‘కాలా’ కొత్త టీజర్...సోషల్ మీడియాలో వైరల్!
-
సోషల్ మీడియాలో ‘కాలా’ కొత్త టీజర్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ టీజర్‌ను కొంత మంది ధోని అభిమానులు ఎడిట్ చేసి ధోనిని కాలాగా చూపిస్తూ టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ధోని ఆడిన మ్యాచ్‌లు, పలు సందర్భాల్లో ధోని పాల్గొన్న ప్రెస్మీట్లు, కొన్ని యాడ్ కోసం ధోని యాక్ట్ చేసిన సన్నివేశాలతో ఈ టీజర్‌ను ఎడిట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ అన్ని ధోని కోసమే డిజైన్ చేసినట్టుగా సింక్ అవ్వటంతో అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. రజనీ హీరోగా తెరకెక్కిన కాలా ఏప్రిల్ 27న రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
విలన్ కాదు సోదరుడు..!
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ నూతన చిత్రంలో ఆయనకు ప్రతినాయకుడిగా యువ నటుడు విజయ్‌సేతుపతి నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది నిజమా? అని సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. చిన్న సహాయ నటుడి స్థాయి నుంచి సక్సెస్ఫుల్ హీరో స్థాయికి ఎదిగిన నటుడు విజయ్‌సేతుపతి. ప్రస్తుతం కథానాయకుడిగా వరుస విజయాలతో మంచి జోరుమీదున్నారు. చేతి నిండా చిత్రాలున్నాయి. పైగా నిర్మాతగా కూడా మారి జుంగా అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు. తెలుగులో చిరంజీవితో కలిసి భారీ చారిత్రాత్మక చిత్రంలో నటిస్తునారు. ఇలాంటి తరుణంలో రజనీకాంత్ తాజా చిత్రంలో ఆయనకు ప్రతినాయకుడిగా మారనున్నారనే ప్రచారం హల్చల్ చేస్తోంది. రజనీకాంత్ 2.ఓ, కాలా చిత్రాల తరువాత యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక రాజకీయ నేపథ్యంతో కూడిన చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. ఇందులో రజనీకాంత్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్న విషయం ఇంకా ఒక కొలిక్కి రాకపోయినా, విలన్‌గా మాత్రం విజయ్‌సేతుపతి నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో విజయ్ విలన్‌గా కాదు రజనీకి తమ్ముడిగా నటించనున్నారట.నిజానికి ఈ విషయం గురించి చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. -
ఇద్దరు సూపర్స్టార్లకు పోటీగా..!
స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ఏప్రిల్ నెలలో వెండితెరపై సందడి నెలకొననుంది. తెలుగు, తమిళ టాప్ హీరోల సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ అవుతుండటంతో థియేరట్ల సమస్యకు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే భారీ పోటితో సతమతమవుతుంటే తాజాగా లోకనాయకుడు కమల్ కూడా అదే సీజన్లో బరిలో దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు స్టార్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు ఇబ్బందులు కలగకుండా రెండు వారాల గ్యాప్ ఉండేలా సర్ధుబాటు చేసుకున్నారు. మహేష్ భరత్ అనే నేను, అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాలను ముందుగా ఏప్రిల్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఒక ఒప్పందానికి వచ్చిన నిర్మాతలు భరత్ అనే నేనును ఏప్రిల్ 20న, నా పేరు సూర్యను మే 4న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. తమిళ చిత్రాలతో మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు. ఏప్రిల్ 27న రజనీకాంత్ కాలా రిలీజ్ అవుతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించేశారు. తాజాగా కమల్ కూడా విశ్వరూపం 2ను ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. అనుకున్నట్టుగా ఏప్రిల్‌లోనే రిలీజ్ చేస్తే కాలా, భరత్ అనే నేను సినిమాలతో పోటి పడాల్సి ఉంటుంది. మరి కమల్ ఆ రిస్క్ చేస్తాడా.. లేదా..? చూడాలి. -
లీకైన రజనీ యాక్షన్ వీడియో
స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద తప్పటం లేదు. సినిమా రిలీజ్ కు ముందే సినిమాలోని సన్నివేశాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుండటంతో చిత్రయూనిట్ తలలు పట్టుకుంటున్నారు. తాజాగా రజనీకాంత్ సినిమా క్లిప్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలీ ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై మాఫీయా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశం లీకైంది. యాక్షన్ సీన్‌కు సంబంధించిన ఈ క్లిప్ లో రజనీ మంటల మధ్యలో విలన్లతో పోరాడుతున్నాడు. వీడియో లీక్‌పై ఇప్పటికే చిత్రయూనిట్ చర్యలు ప్రారంభించింది. ఎడిటింగ్ జరుగుతున్న సమయంలోనే క్లిప్ లీక్ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కాలా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 27న సినిమా రిలీజ్ కానుంది. -
కన్ఫర్మ్: ‘కాలా’ రిలీజ్ డేట్ వచ్చేసింది. మరి 2.0?
ఊహించినట్టుగానే ‘కాలా’ ముందుకు జరిగాడు. 2.0 (రోబో-2) వెనుకడుగు వేశాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా సినిమా ‘కాలా’ ఏప్రిల్ 27న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత, రజనీ అల్లుడు ధనుష్ శనివారం అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీతో కూడిన ‘కాలా’ పోస్టర్లు రిలీజ్ చేశారు. నిజానికి ఏప్రిల్ 27న శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 2.0 సినిమా విడుదల కావాల్సి ఉంది. మొదట గత ఏడాది దీపావళిలో ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. తీరా గణతంత్ర దినోత్సవానికి వాయిదా వేసి.. అప్పటికీ కుదరకపోవడంతో ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు తెస్తామని ప్రకటించారు. తాజా రూమర్ల ప్రకారం ఏప్రిల్‌లోనూ ఈ సినిమా వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. దీనికితోడు 2.0 విడుదల తేదీగా భావిస్తున్న ఏప్రిల్ 27న ‘కాలా’ వస్తుండటంతో మరోసారి శంకర్ సినిమా వాయిదా ఖాయమని వినిపిస్తోంది. పా. రంజిత్ దర్శకత్వంలో సంచలన విజయం సాధించిన ‘కబాలి’ సినిమాకు సీక్వెల్‌గా ’కాలా’ రూపొందింది. ఈ సినిమాలో ముంబై గ్యాంగ్‌స్టర్‌గా రజనీ నటిస్తున్నాడు. ఈ సినిమాలో నానాపటేకర్, హ్యూమా ఖురేషీ, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు రజనీకాంత్, అక్షయ్‌కుమార్ కీలక పాత్రల్లో ‘రోబో’ సినిమాకు సీక్వెల్‌గా రూ. 400 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా శంకర్ ‘2.0’ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. -
2.ఓను వెనక్కునెట్టిన కాలా
రజనీకాంత్, శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 2.ఓ కన్నా ముందుగా కాలా విడుదల కానుందా? ఇందుకు అవుననే బదులు కోలీవుడ్ నుంచి వస్తోంది. 2.ఓ, కాలా చిత్రాల కథానాయకుడు సూపర్‌స్టార్ రజనీకాంతే అన్న విషయం తెలిసిందే. స్టార్ దర్శకుడు శంకర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వెండితెరపై అద్భుతా లు చూపే ప్రయత్నం 2.ఓ. ఇందులో ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్ నాయకిగా నటించింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా గర్జిస్తున్న ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్నారు. లైకా సంస్థ సుమారు రూ. 450కోట్ల వ్యయంతో తెరకెక్కిస్తున్న చిత్రం 2.ఓ. ఈ చిత్ర విడుదల తేదీ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర వర్గాలు వెల్ల డించాయి. అయితే గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడంతో 2.ఓ విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక రజనీ నటిస్తున్న మరో చిత్రం కాలా. పా.రంజత్ తెరక్కిస్తున్న మరో సంచలన చిత్రం కాలా. కబాలి తరహాలోనే మరోసారి రజనీకాంత్‌ను దర్శకుడు దాదాగా చూపిస్తున్నారు. నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీకి జంటగా ఈశ్వరీరావు నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. రజనీకాంత్ ఇటీవలే ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పారన్నది గమనార్హం. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం 2.ఓ తరువాత ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని కాలా చిత్ర యూనిట్ భావించారు. అయితే 2.ఓ విడుదల ఆలస్యం జరుగుతుండటంతో దాన్ని ఓవర్టేక్ చేసి కాలా చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం. -
సూపర్ స్టార్ చివరి చిత్రం అదేనా..?
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశం పై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల అభిమానులతో జరిగిన సమావేశాల సందర్భంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించిన రజనీ, త్వరలోనే పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రజనీ పొలిటికల్ ఎంట్రీ తరువాత సినిమాల్లో కొనసాగుతారా.. లేదా అని అభిమానులు కలవరపడుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నటించిన 2.ఓ, కాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ముందుగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 2.ఓ రిలీజ్ కానుంది. ఆ తరువాత మూడున్నళ్ల గ్యాప్ తో కాలా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ రెండు సినిమాల తరువాత రజనీ చేయబోయే సినిమాపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. దీంతో రజనీ ఇక సినిమాలకు గుడ్ బై చెపుతారన్న ప్రచారం జరుగుతోంది. కాలా రిలీజ్ తరువాత రజనీ పూర్తిగా రాజకీయ కార్యచరణకే సమయం కేటాయిస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే వార్తలపై రజనీ వర్గం మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. రజనీ కూడా తన తదుపరి చిత్రాన్ని దేవుడే నిర్ణయిస్తాడంటూ అభిమానులను సందిగ్ధంలో పడేశాడు. -
రజనీకాంత్, ధనుష్‌లకు ఊరట
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన అల్లుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా కాలా. రజనీకాంత్ తో కబాలి సినిమాను తెరకెక్కించిన పా రంజిత్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాపై కథలో రాజశేఖర్ అనే వ్యక్తి కేసు వేసిన సంగతి తెలిసిందే. తాను కరికాలన్ పేరుతో తయారు చేసుకున్న కథను తన అనుమతి లేకుండా కాలా పేరుతో తెరకెక్కిస్తున్నారని. తాను రిజిస్టర్ చేయించుకున్న కరికాలన్ అనే పేరులోని కాలా అన్న పదాన్ని కూడా తన అనుమతి లేకుండానే వినియోగించుకుంటున్నారని కాలా యూనిట్ పై రాజశేఖర్ కేసు వేశారు. ఈ పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం హీరో రజనీకాంత్, నిర్మాత ధనుష్, దర్శకుడు పా రంజిత్ లకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించిన చిత్రయూనిట్, తాము ఎవరి కథను తీసుకోలేదని పా రంజిత్ స్వయంగా రాసుకున్న కథతోనే కాలాను తెరకెక్కిస్తున్నామని తెలిపారు. టైటిల్ పూర్తి చాలా రోజుల క్రితమే రిజిస్టర్ చేయించామని క్లారిటీ ఇచ్చారు. కేవలం వ్యక్తిగత లాభం కోసమే రాజశేఖర్ తమ చిత్రంపై ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. టైటిల్ రిజిస్టర్ చేయించిన సంవత్సరం లోపు చిత్రాన్ని ప్రారంభించాలని కానీ రాజశేఖర్ కరికాలన్చిత్రాన్నిఇంత వరకు ప్రారంబించలేదు. 2006లో టైటిల్ రెన్యువల్ కూడా చేయలేదని తెలిపారు. కాలా యూనిట్ వాదనతో ఏకభవించిన న్యాయస్థానం రాజశేఖర్ పిటీషన్‌ను కొట్టివేస్తూ తీర్పు నిచ్చింది. -
సంక్రాంతికి రిలీజ్ లేదు : రజనీ సినిమా నిర్మాతలు
చాలా ఏళ్ల తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్, ఒకే ఏడాదిలో రెండు సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ముందుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 2.ఓ సినిమాను జనవరి 25న తరువాత మూడు నెలల విరామం తీసుకొని వేసవి కానుకగా కాలా సినిమాను రిలీజ్ చేయాలని భావించారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో 2.ఓ సినిమా అనుకున్నట్టుగా జనవరిలో కాకుండా ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కోలీవుడ్‌లో మరో ప్రచారం మొదలైంది. 2.ఓ ఆలస్యం అవుతుంది కనుక ఈ లోగా జనవరిలో పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాలా సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని కాలా చిత్ర నిర్మాత, హీరో ధనుష్ ఖండించారు. ఇంకా కాలా షూటింగ్ పూర్తి కాలేదని జనవరిలోనే రిలీజ్ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. దీంతో మరో సారి సూపర్ స్టార్ అభిమానులకు నిరాశే ఎదురైంది. Contrary to rumours and articles, #Kaala would not be ready for a January nor Pongal release. @dhanushkraja @vinod_wunderbar — Wunderbar Films (@WunderbarFilms_) 30 October 2017 -
రజనీకాంత్ డ్యాన్సే హైలెట్..!
అంతర్జాతీయ సినిమాగా తెరకెక్కిన 2.0 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న రజనీకాంత్, తన నెక్ట్స్ సినిమా కాలా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాను 2.0 తరువాత రెండు నెలల గ్యాప్ లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రజనీ అల్లుడు, హీరో ధనుష్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల పరిచయ గీతాన్ని భారీగా తెరకెక్కించారు. ఈ పాటలో రజనీ డ్యాన్స్ మూమెంట్స్ హైలెట్ గా నిలవనున్నాయట. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హుమా ఖురేషీ, నానా పటేకర్, సముద్రఖని, పంకజ్ త్రిపాఠి, అంజలీ పాటిల్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. -
మూడు నెలల్లో సూపర్ స్టార్ రెండు సినిమాలు
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త ఏడాదిలో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. షార్ట్ గ్యాప్ లో రెండు సినిమాలను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల కాలం రజనీ ఏడాది ఒక్క సినిమా చేయటమే గగనమైపోయింది. కథ ఎంపిక, షూటింగ్ ల కోసం ఎక్కువ సమయం కేటాయించటంతో సూపర్ స్టార్ సినిమాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అయితే 2018లో మూడు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు రజనీ. ఇప్పటికే జనవరి 25న రోబో సీక్వల్ 2.ఓ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కాలా షూటింగ్ కూడా 70 శాతానికి పైగా పూర్తయింది. మరో రెండు షెడ్యూల్స్ లో నవంబర్ నెలాఖరుకి షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు కాలా టీం. ఈ సినిమాను కూడా 2.ఓ రిలీజ్ అయిన మూడు నెలలోపే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ నిర్మాణంలో కబాలి ఫేం పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రజనీ ముంబై మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం ముంబైలోనే షూట్ చేస్తున్నారు. -
నాకు నచ్చనది అదే: రజనీకాంత్!
చెన్నై: తనకు నచ్చని విషయాల్లో వర్క్ హాలిడే ఒకటని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళసినిమా పెద్ద సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తమిళ నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య(ఫెఫ్సీ)కి మధ్య వేతనాలు, విధి విధానాల విషయంలో విభేదాల కారణంగా ఫెఫ్సీ సమ్మెకు దిగడంతో మంగళవారం నుంచి చాలా వరకు చిత్రాల షూటింగ్‌లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి బృందం నిన్న ఉదయం నటుడు రజనీకాంత్‌ను కలిసి పరిస్థితులను వివరించారు. దీనిపై రజనీకాంత్ స్పందిస్తూ ఇరు సంఘాల వారు సామరస్య చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ తనకు నచ్చని కొన్ని విషయాల్లో పని నిలిపివేయడం ఒకటన్నారు. ఎలాంటి సమస్య అయినా చర్చలతో పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆర్కే.సెల్వమణి మాట్లాడుతూ మంగళ, బుధవారం 40కి పైగా చిత్రాల షూటింగ్‌లు రద్దయ్యాయని, అందులో రజనీకాంత్ నటిస్తున్న కాలా చిత్రం కూడా ఉందని పేర్కొన్నారు. కాలా షూటింగ్లో 150 మంది పని చేస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రజనీని కలిసి పరిస్థితి వివరించామన్నారు. ఆయన ఆనారోగ్యంతో ఉన్నా ఓపిగ్గా సమస్యను విన్నారని ఆర్కే.సెల్వమణి తెలిపారు. -
రజనీ ‘కాలా’ పిటిషన్ విచారణ వాయిదా
చెన్నై: కాలా చిత్ర వ్యవహారంలో రజనీకాంత్‌ను కోర్టు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కాలా. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాలా చిత్ర కథ, టైటిల్ తనవే అంటూ చెన్నైకి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి వివాదానికి తెరలేపారు.ఈ విషయమై హైకోర్టు రజనీకాంత్, దర్శకుడు పా.రంజిత్, నిర్మాత ధనుష్‌లకు బదులివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసిన సంగతి, వారు రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్లలో కాలా చిత్ర కథ తమదేనని, అసలు రాజశేఖర్ ఎవరో రజనీకాంత్‌కు తెలియదని, ప్రచారం కోసమే అతడు ఈ చర్యలకు పాల్పడినట్లు వివరణ ఇచ్చారు. కాగా ఈ కేసు నిన్న (బుధవారం) కోర్టులో విచారణకు వచ్చింది. పిటిషన్‌దారుడి తరఫున హాజరైన న్యాయవాది రజనీకాంత్ బదులు పిటిషన్లో రాజశేఖర్ ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారని, అందుకు తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించడానికి గడువు తమకు కావాలని కోరారు. దీంతో ఈ కేసును న్యాయమూర్తి ఆగస్టు మూడవ తేదీకీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. rajinikanth, kaala, dhanush, madras high court, రజనీకాంత్, కాలా, ధనుష్, మద్రాసు హైకోర్టు -
మళ్లీ అమెరికాకు రజనీ.. హెల్త్ చెకప్ కోసమేనా..?
మరోసారి హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లిన రజనీ. ఇటీవల కాలా షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి చేసిన రజనీకాంత్ కూతురితో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు. దాదాపు 15 రోజుల పాటు రజనీ అక్కడే ఉండనున్నారట. గతంలో కబాలి, 2.0 సినిమాల షూటింగ్ గ్యాప్ లోనూ రజనీ ఇలాగే అమెరికా వెళ్లి వచ్చారు. అయితే మరోసారి చెకప్ కోసం వెళ్తున్నారని, అభిమానులు ఆందోళన చెందాల్సిందేమి లేదంటున్నారు సన్నిహితులు. 2011లో రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆ సమయంలో తొలుత చెన్నైలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత సింగపూర్‌కు వెళ్లి అక్కడ ఉన్న ప్రఖ్యాత మౌంట్ ఎలిజబెత్ హాస్పటల్లో చేరి పదిహేను రోజుల ట్రీట్మెంట్ తరువాత తిరిగి ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి కొద్దిరోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యంపై రకరకాలైన పుకార్లు వినిపించగా, వాటిని కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. తాజాగా మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లటంతో రజనీ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బిగ్ బీతో రజనీ చర్చలు..?
ప్రస్తుతం రజనీకాంత్ కాలా చిత్రంతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన అడుగులు రాజకీయాలపై పడనున్నాయనే ఊహాగానాలు ఉన్నాయి. ఫ్యాన్స్ మీట్ అంటూ అభిమానులను కలవడం, రైతు సంఘాల నాయకులను కలవడం ఈ ఊహలకు ఊతమిస్తున్నాయి. తాజాగా, ఆయన అమితాబ్ బచ్చన్‌ని కలవాలనుకుంటున్నారనే వార్త గుప్పుమంది. రాజకీయ రంగప్రవేశంపై సలహా తీసుకోవడానికే రజనీ బిగ్ బీని కలవనున్నారని టాక్. రానున్న రెండు వారాల్లో ఈ బిగ్ మీటింగ్ జరుగుతుందట. ఇద్దరు స్టార్లు కలుస్తున్నారంటే దాని వెనక అర్థం పరమార్థం ఉంటాయి. మరి.. ఈ మీటింగ్ వెనక ఉన్న కారణం రాజకీయాలేనా? మరేమైనానా? అసలు బిగ్ బి, రజనీ కలుస్తారా? వెయిట్ అండ్ సీ. -
సూపర్ స్టార్ సినిమాలో మెగాస్టార్..?
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా కాలా. కబాలి లాంటి భారీ చిత్రాన్ని అందించిన రజనీకాంత్, పా రంజిత్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే రజనీతో పాటు బాలీవుడ్ నటుడు నానా పటేకర్ నటిస్తుండటంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రజనీ మాఫీయా డాన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దళపతి సినిమాలో కలిసి నటించిన ఈ స్టార్స్ లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి తెరను పంచుకోవటం హాట్ టాపిక్ మారింది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. -
కాలాలో అతిథిగా... మరో సూపర్‌స్టార్
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కాలా చిత్రం గురించి చాలా ఆసక్తికరమైన అంశాలు బయట హల్చల్ చేస్తున్నాయి. రజనీకాంత్ తన అల్లుడు ధనుష్ చిత్ర నిర్మాణ సంస్థ వండర్ బాల్ ఫిలింస్‌లో నటిస్తున్న తొలి చిత్రం కాలా. అదే విధంగా కబాలి తరువాత పా. రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న రెండవ చిత్రం ఇది. హ్యును ఖురేషి నాయకిగా నటిస్తున్న ఇందులో అంజలి పటేల్, సాక్షి అగర్వాల్ అదనపు ఆకర్షణగా నిలువనున్నారు. బాషా, కబాలి చిత్రాల తరువాత రజనీకాంత్ మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న చిత్రం కాలా. ఈ చిత్ర పరిచయ పోస్టర్ రజనీకాంత్ మహేంద్ర జీపులో కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న దృశ్యం ఆయన అభిమానులను విపరీతంగా అలరించింది. జీప్ ముందు భాగంలో బీఆర్ 1956 అనే నంబరు ప్లేట్ ఉంటుంది. అది బీఆర్ అంటే అంబేడ్కర్ అని, 1956 అంటే ఆయన మరణించిన సంవత్సరం అని అర్థం అని తెలిసింది. వీటిని ఒక కారణంతోనే వేసినట్లు కాలా చిత్రంలో అంబేడ్కర్ పాత్ర చోటు చేసుకుంటుందని సమాచారం. కాగా ఆ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టిని నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. మలయాళంలో మమ్ముట్టి నటించిన కమ్మత్ అండ్ కమ్మత్ చిత్రంలో నటుడు ధనుష్ అతిథి పాత్రలో నటించారు. అదే విధంగా తన కాలా చిత్రంలో మమ్ముట్టి అతిథిగా నటిస్తారనే నమ్మకంతో ఆయన్ని సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఇదే కనుక నిజం అయితే 26 ఏళ్ల క్రితం దళపతి చిత్రంలో కలిసి నటించిన రజనీకాంత్, మమ్ముట్టి మళ్లీ కాలాతో అభిమానులను మరోసారి అలరించబోతారన్నమాట. -
రజనీ 'కాలా' మొదలైంది..!
కబాలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేసిన రజనీకాంత్, పా రంజిత్ల కాంబినేషన్లో మరో సినిమా మొదలైంది. కాలా పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆదివారం ముంబైలో ప్రారంభమైంది. షూటింగ్లో పాల్గొనేందుకు రజనీ కూడా ముంబై చేరుకున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ.. దారవీ ప్రాంతంలోని తమిళుల కోసం పోరాడే కరికాలన్ పాత్రలో కనిపించనున్నాడు. రజనీ సరసన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో మరోసారి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు, రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్. ఇప్పటికే రోబో సీక్వల్గా తెరకెక్కుతున్న 2.0 షూటింగ్ పూర్తి చేసిన సూపర్ స్టార్.., పూర్తి సమయం కాలా కే కేటాయించనున్నాడు. -
ప్లీజ్.. నా దారికి అడ్డురావద్దు: రజనీ
చెన్నై/ముంబై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై కొంత కాలంగా అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే అభిమానులు, సన్నిహితులతో చర్చలు జరిపిన రజనీకాంత్ జులైలో పార్టీని ప్రకటిస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ చెప్పడం తమిళనాడులో చర్చనీయాంశమైంది. బెంగళూరులో నివాసం ఉంటోన్న సత్యనారాయణ 'అవినీతిని అంతం చేయడానికే నా తమ్ముడు(రజనీ) రాజకీయాల్లోకి వస్తున్నాడు. అది చారిత్రక అవసరం కూడా' శుక్రవారం తెలిపారు. ఈ క్రమంలో శనివారం రజనీ ముంబయి బయలుదేరుతుండగా మీడియా ఆయనను మరోసారి రాజకీయ ప్రవేశంపై ప్రశ్నించింది. ఆ ప్రశ్నతో విసుకుచెందిన తలైవా.. మీ పని మీరు చేసుకుంటున్నారు కదా.. నన్ను ఎవరూ అడ్డుకోవద్దు.. దయచేసి నా పని నన్ను చేసుకోనివ్వండి అంటూ మరోసారి విషయాన్ని దాటవేశారు. కాలా షూటింగ్ కోసం శనివారం చెన్నై నుంచి రజనీ ముంబయి వెళ్లారు. తన అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాలా’ షూటింగ్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. అయితే రజనీని ముంబైలోనూ రాజకీయ ప్రవేశంపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రాజకీయాల్లోకి వచ్చే విషయమై ఆయనను ప్రశ్నించగా, అందుకు ఇది సమయం కాదు.. 'సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా. ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదు' అంటూ మరోసారి రజనీ సమాధానం దాటవేశారు. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లు అభిమానులలో నూతన ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి.