
బిగ్ బీతో రజనీ చర్చలు..?
ప్రస్తుతం రజనీకాంత్ కాలా చిత్రంతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన అడుగులు రాజకీయాలపై పడనున్నాయనే ఊహాగానాలు
ప్రస్తుతం రజనీకాంత్ కాలా చిత్రంతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన అడుగులు రాజకీయాలపై పడనున్నాయనే ఊహాగానాలు ఉన్నాయి. ఫ్యాన్స్ మీట్ అంటూ అభిమానులను కలవడం, రైతు సంఘాల నాయకులను కలవడం ఈ ఊహలకు ఊతమిస్తున్నాయి. తాజాగా, ఆయన అమితాబ్ బచ్చన్‌ని కలవాలనుకుంటున్నారనే వార్త గుప్పుమంది.
రాజకీయ రంగప్రవేశంపై సలహా తీసుకోవడానికే రజనీ బిగ్ బీని కలవనున్నారని టాక్. రానున్న రెండు వారాల్లో ఈ బిగ్ మీటింగ్ జరుగుతుందట. ఇద్దరు స్టార్లు కలుస్తున్నారంటే దాని వెనక అర్థం పరమార్థం ఉంటాయి. మరి.. ఈ మీటింగ్ వెనక ఉన్న కారణం రాజకీయాలేనా? మరేమైనానా? అసలు బిగ్ బి, రజనీ కలుస్తారా? వెయిట్ అండ్ సీ.