
భారతీయ సినిమా రంగంలో ఇద్దరు దిగ్గజాలు 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ 170వ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించనున్నారనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. వీటికి ప్రధాన మూలం తన 170వ సినిమాకు 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారని రజనీ ప్రకటించడమే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు కూడా ఆయన తెలిపాడు.
(ఇదీ చదవండి: కాబోయే తోడి కోడలికి ఉపాసన గ్రాండ్ వెల్‌కమ్!)
జైలర్ తర్వాత షూటింగ్ పనులు కూడా ప్రారంభమవుతాయని దర్శకుడు ప్రకటించాడు. దీంతో నటీనటుల ఎంపికపై రోజుకో వార్త వస్తుంది. ఈ స్టార్స్ కలిసి తక్కువ సినిమాల్లో కనిపించినా.. వారి మధ్య మంచి స్నేహం, సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రచారం నిజం కావచ్చనడంలో సందేహం లేదు. మూడు దశాబ్దాల క్రితం హమ్, అంధ కానూన్, వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్‌లను ఈ దిగ్గజ నటులు అందించిన విషయం తెలిసిందే.
యదార్థ సంఘటనలే కథకు మూలం
రజినీ కాంత్ 170 ఫిల్మ్ యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడుతున్నట్లు సమాచారం. ఇందులో పోలీసు ఆఫీసర్‌గా ఆయన నటించనున్నారట. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 2024 చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
(ఇదీ చదవండి: సమంత నవ్వులు.. మృణాల్ బోల్డ్ క్యాప్షన్)
Comments
Please login to add a commentAdd a comment