హ్యూమాఖురేషి
తమిళసినిమా: దక్షిణాది ప్రేక్షకులు ఏ పాటి అభిమానం కురిపిస్తారోనన్న ఆసక్తితో ఎదురుచూస్తున్న ఉత్తరాది బ్యూటీ హ్యూమాఖురేషి. ఐశ్వర్యారాయ్, దీపికాపదుకొనే, సోనాక్షిసిన్హా వంటి బాలీవుడ్ బ్యూటీల తరువాత సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జతకట్టే అవకాశాన్ని అందుకున్న నటి హ్యూమాఖురేషీ. రజనీకాంత్ నటించిన కాలా చిత్రంలో నటి ఈశ్వరిరావు ఆయన భార్యగా నటించగా, నటి హ్యూమాఖురేషి ఆయన ప్రియురాలిగా నటించిందని సమాచారం. హిందీ నటుడు నానాపటేకర్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందించారు. నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించిన కాలా చిత్రానికి పా.రంజిత్ దర్శకుడన్నది తెలిసిందే. కబాలి తరువాత వెంటనే రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసిన అరుదైన దర్శకుల్లో ఆయన చేరతారు.
కాలా చిత్ర విడుదలపై పలు ఊహాగానాలు ప్రచారం అయిన నేపథ్యంలో ఎట్టకేలకు అలాంటి ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టే విధంగా నిర్మాత ధనుష్ జూన్ 7న కాలా చిత్రం విడుదలను ఖరారు చేశారు. ఆ విధంగా తెరపైకి ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇందులో నటించిన హ్యూమాఖురేషీ కాలా చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు, కథానాయకుడు రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇందులో తన 1980 కాలం నాటి రజనీకాంత్ ప్రియురాలిగా 45 ఏళ్ల ప్రౌడగా నటించినట్లు సమాచారం. హ్యూమాఖరేషి తన ట్విట్టర్‌లో పేర్కొంటూ కాలా చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు, పది కాలాల పాటు గుర్తుండిపోయే మంచి పాత్రలో నటింపజేసినందుకు దర్శక నిర్మాతలకు, కథానాయకుడు రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని పేర్కొంది.
ముంబయిలోని ధారవి నేపథ్యంలో సాగే కాలా చిత్రంలో రజనీకాంత్ మరోసారి దాదాగా నటించారన్నది తెలిసిన విషయమే. ఇందులో 8 పాటలు చోటుచేసుకుంటాయట. కొన్ని సన్నివేశాలను ముంబయిలోని ధారవి ప్రాంతంలో చిత్రీకరించినా, అధిక భాగాన్ని చెన్నైలోనే ధారవిసెట్‌ను వేసి చిత్రీకరించారు. రజనీకాంత్ తన తాజా చిత్రాన్ని యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రం జూన్ రెండవ వారంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment