
అంతర్జాతీయ సినిమాగా తెరకెక్కిన 2.0 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న రజనీకాంత్, తన నెక్ట్స్ సినిమా కాలా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాను 2.0 తరువాత రెండు నెలల గ్యాప్ లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
రజనీ అల్లుడు, హీరో ధనుష్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల పరిచయ గీతాన్ని భారీగా తెరకెక్కించారు. ఈ పాటలో రజనీ డ్యాన్స్ మూమెంట్స్ హైలెట్ గా నిలవనున్నాయట. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హుమా ఖురేషీ, నానా పటేకర్, సముద్రఖని, పంకజ్ త్రిపాఠి, అంజలీ పాటిల్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment