మళ్లీ అమెరికాకు రజనీ.. హెల్త్ చెకప్ కోసమేనా..? | Rajinikanth Leaves For US For Health Checkup | Sakshi
Sakshi News home page

మళ్లీ అమెరికాకు రజనీ.. హెల్త్ చెకప్ కోసమేనా..?

Published Fri, Jun 30 2017 10:40 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

మళ్లీ అమెరికాకు రజనీ.. హెల్త్ చెకప్ కోసమేనా..?

మళ్లీ అమెరికాకు రజనీ.. హెల్త్ చెకప్ కోసమేనా..?

మరోసారి హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లిన రజనీ. ఇటీవల కాలా షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి చేసిన రజనీకాంత్ కూతురితో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు. దాదాపు 15 రోజుల పాటు రజనీ అక్కడే ఉండనున్నారట. గతంలో కబాలి, 2.0 సినిమాల షూటింగ్ గ్యాప్ లోనూ రజనీ ఇలాగే అమెరికా వెళ్లి వచ్చారు. అయితే మరోసారి చెకప్ కోసం వెళ్తున్నారని, అభిమానులు ఆందోళన చెందాల్సిందేమి లేదంటున్నారు సన్నిహితులు.

2011లో రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆ సమయంలో తొలుత చెన్నైలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత సింగపూర్‌కు వెళ్లి అక్కడ ఉన్న ప్రఖ్యాత మౌంట్‌ ఎలిజబెత్‌ హాస్పటల్లో చేరి పదిహేను రోజుల ట్రీట్మెంట్ తరువాత తిరిగి ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి కొద్దిరోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యంపై రకరకాలైన పుకార్లు వినిపించగా, వాటిని కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. తాజాగా మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లటంతో రజనీ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement