సోషల్ మీడియాలో ‘కాలా’ కొత్త టీజర్‌ | Kaala Teaser Featuring MS Dhoni | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 6 2018 2:16 PM | Last Updated on Tue, Mar 6 2018 2:27 PM

Kaala Teaser Featuring MS Dhoni - Sakshi

సూపర్ స్టార్‌ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ టీజర్‌ను కొంత మంది ధోని అభిమానులు ఎడిట్‌ చేసి ధోనిని కాలాగా చూపిస్తూ టీజర్‌ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ధోని ఆడిన మ్యాచ్‌లు, పలు సందర్భాల్లో ధోని పాల్గొన్న ప్రెస్‌మీట్లు, కొన్ని యాడ్‌ కోసం ధోని యాక్ట్‌ చేసిన సన్నివేశాలతో ఈ టీజర్‌ను ఎడిట్‌ చేశారు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, డైలాగ్స్‌  అన్ని ధోని కోసమే డిజైన్‌ చేసినట్టుగా సింక్‌ అవ్వటంతో అభిమానులు ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు. రజనీ హీరోగా తెరకెక్కిన కాలా ఏప్రిల్‌ 27న రిలీజ్‌కు రెడీ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement