రజినీకాంత్‌ టీజర్‌పై అలాంటి పోస్ట్‌.. వివాదంలో డైరెక్టర్‌! | Director Venkat Prabhu Clarification after Backlash over Coolie Teaser | Sakshi
Sakshi News home page

Venkat Prabhu : రజినీకాంత్‌ టీజర్‌పై పోస్ట్‌.. వివాదంపై డైరెక్టర్‌ క్లారిటీ!

Published Sun, Apr 28 2024 9:59 PM | Last Updated on Sun, Apr 28 2024 9:59 PM

Director Venkat Prabhu Clarification after Backlash over Coolie Teaser

లియో డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్‌ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం తలైవార్171. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ చేశారు. కూలీ పేరుతో టైటిల్‌ టీజర్‌ మేకర్స్‌ రిలీజ్ చేశారు. రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ టీజర్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

అయితే తాజాగా ఈ టీజర్‌ను ఉద్దేశించి స్టార్ డైరెక్టర్‌ చేసిన పోస్ట్‌ కోలీవుడ్‌లో వివాదానికి దారితీసింది. రజనీకాంత్ కూలీ టీజర్‌ను ఉద్దేశించే వెంకట్ ప్రభు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ కొందరు ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని కొందరు కొట్టి పారేయగా.. మరికొందరు ఖండించారు. ఇంతకీ వెంకట్‌ చేసిన పోస్ట్‌ ఏంటి? అసలు అది ఎందుకు వివాదంగా మారిందో తెలుసుకుందాం.

దళపతి విజయ్ హీరోగా  గోట్‌ చిత్రీకరణలో బిజీగా ఉన్న దర్శకుడు వెంకట్ ప్రభు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కమర్షియల్ తమిళ సినిమా ట్రైలర్‌ ఫార్ములాపై చర్చించే రీల్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అందుకో కమెడియన్‌ కార్తీక్‌ కుమార్‌ ప్రస్తుతం కమర్షియల్ సినిమాల ట్రైలర్స్‌ అన్ని ఓకే విధంగా ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ  అల్‌ను వెంకట్‌ ప్రభు ఇన్‌స్టాలో పంచుకోవడంతో కాంట్రవర్సీగా మారింది.

ఇదంతా రజనీకాంత్ కూలీ టీజర్‌ను ఉద్దేశించే పోస్ట్‌ పెట్టారని వెంకట్‌ ప్రభుపై నెటిజన్స్‌ మండిపడ్డారు. కూలీ టైటిల్ టీజర్‌ లక్ష్యంగా చేసుకున్నారని రజనీకాంత్ అభిమానులు ఆరోపించారు. అయితే మరికొందరు నెటిజన్స్‌ మాత్రం మద్దతుగా నిలిచారు. ఇదంతా జస్ట్‌ ఫన్నీ కోసమేనంటూ కొట్టిపారేశారు.

తాజాగా తన పోస్ట్‌పై దర్శకుడు వెంకట్‌ ప్రభు క్లారిటీ ఇ‍చ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. " కాదు.. ఇది మేమంతా చేస్తున్న కమర్షియల్ ఫ్లిక్ కోసమే.! అతను చెప్పేదాంట్లో కూడా కొంత నిజం ఉంది. మనం రెగ్యులర్‌ కమర్షియల్ టెంప్లేట్‌కు భిన్నంగా ఏదైనా ఇవ్వాలని ప్రయత్నిస్తే ఫ్యాన్స్‌ కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు " అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి వెంకట్‌ ప్రభు తెరదించారు. కాగా.. గతంలో అట్లీ మూవీ మెర్సల్‌ను  సమయంలోనూ ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇదిలా ఉండగా గోట్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement