‘దంగల్‌’ సరసన ‘కాలా’ | Satellite Rights Of Rajinikanth Kaala​ Sold For A Massive Price | Sakshi
Sakshi News home page

‘దంగల్‌’ సరసన ‘కాలా’

Published Tue, Mar 20 2018 3:19 PM | Last Updated on Tue, Mar 20 2018 5:02 PM

Satellite Rights Of Rajinikanth Kaala​ Sold For A Massive Price - Sakshi

‘కాలా’ సినిమాలో రజనీకాంత్‌

సౌత్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. ఇప్పటికే బిజినెస్‌ పరంగా సంచలనాలు నమోదు చేస్తున్న ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ రికార్డ్‌ ధరకు అమ్ముడైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 75 కోట్లకు స్టార్‌ సంస్థ ఈ సినిమా శాటిలైట్స్‌ రైట్స్‌ను సొంతం చేసుకుందట. దీంతో శాటిలైట్‌ రైట్స్‌ రూపంలో అత్యధిక మొత్తం సాధించిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది ఈ సినిమా. 

అంతేకాదు బాలీవుడ్ బ్లాక్ బస్టర్‌ దంగల్ సినిమా రైట్స్‌ కూడా ఇదే మొత్తానికి అమ్ముడవ్వటం విశేషం. త్వరలో రిలీజ్‌ కు రెడీ అవుతున్న 2.ఓ, సంచలన విజయం సాధించిన బాహుబలి 2 చిత్రాలు మాత్రమే ఈ లిస్ట్‌లో కాలా కన్నా ముందున్నాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో రజనీ మాఫియా డాన్‌ కరికాలన్‌గా నటిస్తున్నాడు. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్‌ ప్రతీనాయకుడిగా నటిస్తుండగా హ‍్యూమా ఖురేష్‌ రజనీకాంత్కి జోడిగా నటిస్తోంది. రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement