Satellite Rights
-
KGF Chapter 2: సౌత్ శాటిలైట్ రేట్స్ కొనుగోలు చేసిందెవరంటే..
కేజీఎఫ్ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. రికార్డులు సృష్టించిన సినిమా అది. ఆ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ రికార్డ్సు సృష్టిస్తోంది.. ఇప్పటికే ఈ విడుదలైన టీజర్, పోస్టర్స్‌తో సినిమా ఏ రెంజ్లో అర్థమవుతుంది. తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. కేజీఎఫ్ చాప్టర్ 2 సౌత్ ఇండియన్ అన్ని భాషల శాటిలైట్ హక్కులను జీ సంస్థ కొనుగోలు చేసినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల శాటిలైట్ హక్కులను జీ టెలివిజన్ సంస్థ తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు. దీని కోసం జీ సంస్థ భారీగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీనిధి హీరోయిన్గా నటించగా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తది తరులు కీలక పాత్రలు పోషించారు. #KGFChapter2 locks its official worldwide satellite destination for South languages on ZEE 📺@TheNameIsYash @prashanth_neel @VKiragandur @hombalefilms @HombaleGroup @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7#KGF2SouthOnZee@ZeeKannada @ZeeTVTelugu @ZeeTamil @ZeeKeralam pic.twitter.com/DZ2ROyddc7 — Hombale Films (@hombalefilms) August 20, 2021 -
సల్మాన్ వేట మొదలైంది..!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రేస్ 3. ఘనవిజయం సాధించిన రేస్ సిరీస్‌లో మూడో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రెమో డిసౌజా దర్శకుడు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో రేస్ 3 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే దంగల్ పేరిట ఉన్న శాటిలైట్ రైట్స్ రికార్డ్‌ను రేస్ 3 బద్ధలు కొట్టింది. దీంతో రిలీజ్ కు ముందే సల్మాన్ రికార్డ్ ల వేట మొదలైందంటున్నారు ఫ్యాన్స్. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దంగల్ చిత్ర శాటిలైట్ రైట్స్ 120 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు సల్మాన్ హీరోగా నటించిన రేస్ 3 శాటిలైట్ రైట్స్ ఏకంగా 130 కోట్లు పలికినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో మీడియాలో వస్తున్న వార్తలను ఖండించలేదు. దీంతో ఆమిర్ రికార్డ్‌ను సల్మాన్ బద్ధలు కొట్టాడంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సల్మాన్ కు ఈద్ బరిలో సూపర్ హిట్ రికార్డ్ ఉంది. అందుకే రేస్ 3 చిత్రాన్ని కూడా రంజాన్ కానుకగా జూన్ 15న రిలీజ్ చేస్తున్నారు. జాక్వలిన్ ఫెర్నాండెజ్, అనిల్ కపూర్, బాబీడియోల్, సాకిబ్ సలీమ్, డైసీషా ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సల్మాన్ ఖాన్, రమేష్ తౌరాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
‘కాలా’ శాటిలైట్ రైట్స్‌కు భారీ ప్రైజ్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రజనీ అల్లుడు కోలీవుడ్ హీరో ధనుష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తమిళనాట సినీరంగం సమ్మె కారణంగా కాలా సినిమాను జూన్ 7కు వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక సమాచారం లేకపోయినా.. కాలా సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ గ్రూప్ సంస్థ 75 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ విలన్ గా నటిస్తుండటంతో ఉత్తరాదిలో కూడా ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. రజనీ సరసన హ్యూమా ఖురేషీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తున్నారు. -
‘దంగల్’ సరసన ‘కాలా’
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే బిజినెస్ పరంగా సంచలనాలు నమోదు చేస్తున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 75 కోట్లకు స్టార్ సంస్థ ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్‌ను సొంతం చేసుకుందట. దీంతో శాటిలైట్ రైట్స్ రూపంలో అత్యధిక మొత్తం సాధించిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది ఈ సినిమా. అంతేకాదు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దంగల్ సినిమా రైట్స్ కూడా ఇదే మొత్తానికి అమ్ముడవ్వటం విశేషం. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న 2.ఓ, సంచలన విజయం సాధించిన బాహుబలి 2 చిత్రాలు మాత్రమే ఈ లిస్ట్‌లో కాలా కన్నా ముందున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో రజనీ మాఫియా డాన్ కరికాలన్‌గా నటిస్తున్నాడు. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ ప్రతీనాయకుడిగా నటిస్తుండగా హ్యూమా ఖురేష్ రజనీకాంత్‌కి జోడిగా నటిస్తోంది. రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. -
అర్జున్ రెడ్డికి కొత్త కష్టాలు..!
ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమైన తెలుగు సినిమా అర్జున్ రెడ్డి. వివాదాలతోనే భారీ హైప్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి అదే స్థాయిలో కలెక్షన్లు కూడా సాధిస్తోంది. బోల్డ్ కంటెంట్ తో యూత్ ఆకట్టుకున్న అర్జున్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ కు తెర తీసింది. అయితే ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన ఈసినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం ఇంతవరకు అమ్ముడవ్వలేదు. సాధారణంగా భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమాల రైట్స్ రిలీజ్ కు ముందే అమ్ముడవుతాయి. అయితే అర్జున్ రెడ్డి సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కటంతో ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు డైలాగులు ఉన్నాయి. వీటి కారణంగా సినిమాకు ఇంతటి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఏ సర్టిఫికేట్ సినిమాలు టీవీలో ప్రదర్శించేందుకు అనుమతించరు.. ఆ సినిమాలను తిరిగి సెన్సార్ చేయించి అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి యు/ఎ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో ఆ సీన్స్ తొలగిస్తే సినిమాకు బుల్లితెర మీద ఆదరణ ఎలా ఉంటుందో అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే ఇప్పటికే భారీ లాభాలు సాధించిన అర్జున్ రెడ్డి యూనిట్ శాటిలైట్ రైట్స్ విషయంలో ఏం చేస్తుందో చూడాలి. -
శాటిలైట్ రైట్స్ తోనూ 'ఆనందం'
హర్రర్ కామెడీ చిత్రాల ట్రెండ్ ను మలుపు తిప్పిన సినిమా ఆనందో బ్రహ్మ. తాప్సీ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. దెయ్యాలే మనుషులకు భయపడటమనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా హర్రర్ జానర్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ లోనూ సత్తా చాటింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆనందో బ్రహ్మా శాటిలైట్ రైట్స్ 3.25 కోట్లకు అమ్ముడయ్యాయి. 70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహి వి రాఘవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. -
పవన్-త్రివిక్రమ్ సినిమా: రికార్డు రేటు!
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ ఆల్‌టైం రికార్డు ధరకు కొనుగోలు చేసిందట. ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కుల కోసం ఆ చానెల్ ఏకంగా రూ. 21 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. ఇక హిందీ శాటిలైట్ హక్కులకు రూ. 11 కోట్ల ధర పలికిందట. మొత్తం శాటిలైట్ హక్కుల రూపంలో రూ. 32 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్లో 'జల్సా', అత్తారింటికి దారేది సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా కీర్తి సురేశ్, అను ఎమాన్యుయెల్ నటిస్తున్నారు. -
'స్పైడర్' శాటిలైట్ రైట్స్‌కు భారీ ఆఫర్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్పైడర్. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లైమాక్స్, రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయ్యింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మహేష్, మురుగదాస్‌ల కాంబినేషన్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకుండా బిజినెస్ స్టార్ట్ చేసేసింది స్పైడర్ యూనిట్. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఈ సినిమా రిలీజ్‌కు ముందే 150 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. స్పైడర్ శాటిలైట్ రైట్స్‌ను భారీ మొత్తం చెల్లించి ఓ చానల్ సొంతం చేసుకుందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ రైట్స్‌తో కలిపి 26 కోట్లు శాటిలైట్ రైట్స్ కోసం చెల్లించారట. అయితే ఈ ఆఫర్‌పై యూనిట్ సభ్యులు అధికారిక ప్రకటన చేయలేదు. -
మహేష్ మూవీకి భారీ ఆఫర్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అదే స్థాయిలో భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్‌లు క్రియేట్ చేస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు సినిమా ఆడియో రిలీజ్‌తో పాటు శాటిలైట్ రైట్స్‌ను కలిపి ఓ టీవీ ఛానల్ భారీ మొత్తానికి సొంతం చేసుకుందన్న ప్రచారం జరుగుతోంది. అది కూడా బాహుబలి రెండో భాగంగా కన్నా మహేష్ సినిమాకు ఎక్కువ మొత్తం ఆఫర్ చేసి రైట్స్ సొంతం చేసుకున్నారట. ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న మహేష్, మురుగదాస్‌ల సినిమా ఆడియో, శాటిలైట్ రైట్స్ కోసం ఓ టీవీ ఛానల్ 26 కోట్లు ఆఫర్ చేసిందట. మహేష్, మురుగదాస్‌ల కాంబినేషన్ పై ఉన్న అంచనాలతో పాటు ఈ సినిమా 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. సూపర్ స్టార్ అభిమానులు మాత్రం ఈ వార్తలతో పండుగ చేసుకుంటున్నారు. -
శాటి‘లైట్’ గురూ!
ఒకప్పుడు సినిమా మొదలుపెట్టినప్పుడే శాటిలైట్ ఇంత వస్తుందని లెక్క చూసుకుని, దాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ని డిసైడ్ చేసుకునేవాళ్లు. 2000 నుంచి 2010 వరకూ శాటిలైట్ రైట్స్ నిర్మాతల పాలిట ఓ వరం. ఆ పదేళ్లల్లో విడుదలైన సినిమాల్లో దాదాపు అన్నీ శాటిలైట్ రైట్స్ రూపంలో బాగానే డబ్బులు దక్కించుకున్నాయి. ఆ తర్వాత పరిస్థితి మారింది. 2010 నుంచి చానల్ అధినేతలు ఏ సినిమా పడితే ఆ సినిమా కొనడం మానేశారనే చెప్పాలి. అన్ని ఎంటర్టైన్మెంట్ చానల్స్‌లోనూ టెలికాస్ట్ చేయడానికి కావల్సినంత సాఫ్ట్వేర్ ఉండటంతో ఎగబడి సినిమాలు కొనాల్సిన అవసరం లేకుండాపోయింది. దాంతో ‘ఆ నలుగురు స్టార్ హీరో’ల సినిమాలు మినహా విడుదలకు ముందే శాటిలైట్ అమ్ముడుపోతున్న సినిమాలు లేకపోవడం విశేషం. విడుదలైన తర్వాత శాటిలైట్ రైట్స్ అమ్మడం అంటే నిర్మాతకు కష్టమే. సినిమా బాగుంటే ఓకే.. లేకపోతే శాటిలైట్ రేట్ కూరగాయల బేరం చందంగా అయిపోతుంది. ఇటీవల విడుదలైన ఓ భారీ సినిమాను ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ సినిమా విడుదలకు ముందు ఐదు కోట్లకు కొనాలని అనుకున్నవాళ్లే.. విడుదల తర్వాత రిజల్ట్ తేడాగా ఉండటంతో అమాంతం రేటు తగ్గించేయడం విశేషం. రూ.2 కోట్లే ఇవ్వడానికి ఆ చానల్ సిద్ధపడిందట. అలాగే, ఆ హీరో నటించిన ముందు సినిమా రిజల్ట్‌ని బట్టి తదుపరి చిత్రం శాటిలైట్ రైట్స్ నిర్ణయమవుతోంది. కారణాలేవైనప్పటికీ శాటి‘లైట్’ అయిపోతోంది. సో.. శాటిలైట్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయాలనుకున్నవాళ్లు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిదని కొందరు సినీ ప్రముఖులు సెలవిస్తున్నారు. ఒకవేళ తీయాలనుకున్నా బంపర్ హిట్‌ని టార్గెట్ చేయాలి. అలా చేస్తే... తారాజువ్వలా పెకైగురుతారు. లేకపోతే తుస్సుమన్న బాంబులా మిగిలిపోవాల్సిందే. -
క్రేజ్‌కు క్రేజు! క్యాష్కు క్యాష్!
‘దిల్వాలే’ సినిమాలో హైలైట్ ఎవరు? అంటే టక్కున వచ్చే సమాధానం షారుక్ ఖాన్-కాజోల్. ఇప్పటివరకూ వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఆరు. కానీ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’లో ఈ జంట మధ్య పండిన కెమిస్ట్రీ , ఆ సినిమా చేసిన మాయ మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి వస్తున్న చిత్రం ‘దిల్వాలే’. ఈ నెల 18న రిలీజ్ కానున్న ఈ సినిమా మీద అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అంశాలు మీ కోసం... * శాటిలైట్ హక్కులు 60 కోట్లు! * ఆడియో రైట్స్19 కోట్లు! * 22 ఏళ్ల క్రితం ‘బాజీగర్’ కోసం తొలిసారి జతకట్టారు షారుక్ ఖాన్, కాజోల్. ఆ చిత్రంతోనే జంట బాగుందనిపించుకున్నారు. ఇక, ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రాల్లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ చిత్రంలో ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకూ అరడజను చిత్రాల్లో జంటగా నటించి, తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను మాయ చేశారు. అందుకే షారుక్, కాజోల్ ఓ చిత్రంలో జంటగా నటిస్తున్నారంటే ఆ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయి. తాజా చిత్రం ‘దిల్వాలే’పై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. * ఐదేళ్ల క్రితం షారుక్ సరసన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’లో నటించిన కాజోల్ ఆ తర్వాత ఈ హీరోగారితో జతకట్టిన చిత్రం ‘దిల్వాలే’. వాస్తవానికి చిత్రదర్శకుడు రోహిత్‌శెట్టి ఈ చిత్రం గురించి చెప్పినప్పుడు, ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లో ఉండటంవల్ల కాజోల్ చేయకూడదనుకున్నారు. కానీ, కాజోల్ కూతురు నైసా ‘మమ్మీ.. నువ్వీ సినిమా కచ్చితంగా చేయాల్సిందే. ఎక్కువ సినిమాల్లో నువ్వు ఏడవడం చూశాను. ఈ సినిమాలో కామెడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నువ్వు నవ్వడం చూడాలి’ అనడంతో కాజోల్ నవ్వుతూ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. * ఇది రొమాంటిక్ యాక్షన్ కామెడీ మూవీ. ఇందులో షారుక్ ‘కార్ మాడిఫైర్’గా చేశారు. అండర్ కరెంట్‌లో గ్యాంగ్‌స్టర్ అని సమాచారం. షారుక్ తమ్ముడిగా వరుణ్ ధావన్ నటించారు. వరుణ్‌కు జోడీగా కృతీసన న్ నటించగా, మరో కీలక పాత్రను బొమన్ ఇరానీ చేశారు. * షారుక్, కాజోల్‌ల సూపర్ హిట్ మూవీ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ (డీడీఎల్‌జె)లో ట్రైన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఆ సీక్వెన్స్‌ని ఆదర్శంగా తీసుకుని పలువురు దర్శకులు ఆ తరహా సన్నివేశాన్ని తమ చిత్రాల్లో జోడించారు. ‘దిల్వాలే’లో కూడా ‘డీడీఎల్‌జె’ తరహా ట్రైన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు రోహిత్. మరి.. ఈ సీక్వెన్స్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. * గత నెల 9న విడుదలైన ఈ ప్రచార చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పటివరకూ దాదాపు కోటీ 70 లక్షల మంది ట్రైలర్‌ను వీక్షించారు. * ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. హిట్ పెయిర్ షారుక్, కాజోల్ జంటగా నటించిన చిత్రం కావడంతో పలు ప్రముఖ టీవీ ఛానల్స్ శాటిలైట్ హక్కులు దక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. ఈ పోటీని నిర్మాత చక్కగా క్యాష్ చేసుకున్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఏకంగా రూ. 60 కోట్లకు శాటిలైట్ హక్కులు సొంతం చేసుకుందని సమాచారం. ఇప్పటివరకూ ఏ చిత్రానికి ఇంత ధర పలకలేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. * మ్యూజిక్ రైట్స్ పరంగా కూడా రెడ్ చిల్లీస్కి భారీ మొత్తమే దక్కిందట. సోనీ మ్యూజిక్ సంస్థ ఆడియో హక్కులను 19 కోట్ల రూపాయలకు చేజిక్కించుకుందని భోగట్టా. * ఈ చిత్రంలోని ‘గేరువా...’ ప్రోమో సాంగ్‌ను ముంబైలోని మరాఠా మందిర్‌లో విడుదల చేశారు. ‘డీడీఎల్జే’ ఇక్కడే 20 ఏళ్ల పాటు ఆడిన విషయం తెలిసిందే. ఈ పాటను ఐస్‌ల్యాండ్‌లో చిత్రీకరించారు. మైనస్ డిగ్రీల చలిలో షారుక్-కాజోల్ మధ్య ఏడు రోజుల పాటు తీశారు. ఈ పాట మొత్తం బ్లూ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుందట. ఈ పాటకు సంబంధించిన ఓ దృశ్యంలో ఒక ధ్వంసమైన విమానం కనిపిస్తుంది. అది సెట్ అని ప్రోమో చూసినవాళ్లు భావించారు. కానీ అది నిజమైన విమానమే అట. ఐస్‌ల్యాండ్‌లో జరిగిన ఓ ప్రమాదంలో ధ్వంసమైన విమానం అది. ఆ త ర్వాత దాన్ని ఓ టూరిస్ట్ స్పాట్‌గా ఆ దేశ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. * రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటే ఫుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్‌ను అభిమానులు ఆశిస్తారు. దానికి తగ్గట్టుగా ఈ సినిమాలో నాలుగు పోరాట సన్నివేశాలు ఉంటాయట. ఈ పోరాట సన్నివేశాలను దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ సిటీ, మార్షియస్, అబుదబి దేశాల్లో చిత్రీకరించారు. * చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న షారుక్ చిత్రమిదే. కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్సీ, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు * షూటింగ్ సమయంలో షారుక్‌ఖాన్ మోకాలికి గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకోవడానికి రోహిత్‌శెట్టి ఓ సైకిల్ కొనిచ్చారట. మోకాలి గాయం తగ్గడానికి షారుక్ సైక్లింగ్ చేసేవారట. ఆ సైకిల్‌నే ఈ చిత్రంలోని ఓ షాట్లో వాడారు. * ఈ చిత్రం నిర్మాణ వ్యయం సుమారు వంద కోట్లు అని సమాచారం. ఏ విషయంలోనూ రాజీపడకుండా గౌరీ ఈ చిత్రాన్ని నిర్మించారట. * ‘దిల్వాలే’ విడుదల రోజే రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ విడుదల కానుంది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విచిత్రం ఏమిటంటే 2007 నవంబరు 7న షారుక్‌ఖాన్ ‘ఓం శాంతి ఓం’, సంజయ్‌లీలా భన్సాలీ ‘సావరియా’ ఒకే రోజున విడుదలయ్యాయి. ‘సావరియా’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే, ‘ఓం శాంతి ఓం’ సూపర్‌హిట్‌గా నిలిచింది. మరి.. ఈసారి ఏం జరుగుతుందో? -
రిలీజ్‌కు ముందే 85 కోట్లు వసూళ్లు....