'స్పైడర్' శాటిలైట్ రైట్స్కు భారీ ఆఫర్ | Mahesh Babu Spyder Satellite Rights Sold For A Bomb | Sakshi
Sakshi News home page

'స్పైడర్' శాటిలైట్ రైట్స్కు భారీ ఆఫర్

Published Thu, Apr 13 2017 11:39 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

'స్పైడర్' శాటిలైట్ రైట్స్కు భారీ ఆఫర్

'స్పైడర్' శాటిలైట్ రైట్స్కు భారీ ఆఫర్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్పైడర్. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లైమాక్స్, రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయ్యింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మహేష్, మురుగదాస్ల కాంబినేషన్పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునే పనిలో ఉంది చిత్రయూనిట్.

ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకుండా బిజినెస్ స్టార్ట్ చేసేసింది  స్పైడర్ యూనిట్. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఈ సినిమా రిలీజ్కు ముందే 150 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. స్పైడర్ శాటిలైట్ రైట్స్ను భారీ మొత్తం చెల్లించి ఓ చానల్ సొంతం చేసుకుందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ రైట్స్తో కలిపి 26 కోట్లు శాటిలైట్ రైట్స్ కోసం చెల్లించారట. అయితే ఈ ఆఫర్పై యూనిట్ సభ్యులు అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement