శాటిలైట్ రైట్స్ తోనూ 'ఆనందం' | anando brahma satellite rights sold for good price | Sakshi
Sakshi News home page

శాటిలైట్ రైట్స్ తోనూ 'ఆనందం'

Published Sun, Aug 27 2017 2:07 PM | Last Updated on Mon, Aug 13 2018 3:04 PM

శాటిలైట్ రైట్స్ తోనూ 'ఆనందం' - Sakshi

శాటిలైట్ రైట్స్ తోనూ 'ఆనందం'

హర్రర్ కామెడీ చిత్రాల ట్రెండ్ ను మలుపు తిప్పిన సినిమా ఆనందో బ్రహ్మ. తాప్సీ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. దెయ్యాలే మనుషులకు భయపడటమనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా హర్రర్ జానర్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ లోనూ సత్తా చాటింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆనందో బ్రహ్మా శాటిలైట్ రైట్స్  3.25 కోట్లకు అమ్ముడయ్యాయి. 70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహి వి రాఘవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement