
పవన్-త్రివిక్రమ్ సినిమా: రికార్డు రేటు!
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ ఆల్‌టైం రికార్డు ధరకు కొనుగోలు చేసిందట. ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కుల కోసం ఆ చానెల్ ఏకంగా రూ. 21 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. ఇక హిందీ శాటిలైట్ హక్కులకు రూ. 11 కోట్ల ధర పలికిందట. మొత్తం శాటిలైట్ హక్కుల రూపంలో రూ. 32 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది.
పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్‌లో 'జల్సా', అత్తారింటికి దారేది సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా కీర్తి సురేశ్, అను ఎమాన్యుయెల్ నటిస్తున్నారు.