
పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేవి మూడు పెళ్లిళ్లు. ఎప్పటికప్పుడు దీన్ని పవన్ సమర్థించుకుంటాడు గానీ ఏది ఏమైనా సరే ఇది ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే సామాన్యులైనా, సెలబ్రిటీలైనా రెండో పెళ్లి చేసుకోవడానికే వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది పవన్ ఏకంగా మూడుసార్లు చేసుకున్నాడు. వాళ్లలో ఒకరు తెలుగు, ఇంకొకరు మరాఠీ, మరొకరు రష్యన్. ఇలా ప్రపంచం మొత‍్తాన్ని పవన్.. తన పెళ్లిళ్లతో కవర్ చేశాడు. ఈ సంగతి ఇక్కడివరకే అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే సినిమా హీరోయిన్లు-పవన్‌కు మధ్య అప్పట్లోనే బోలెడన్ని రూమర్స్ వచ్చాయి.
హీరోయిన్ ఉండాల్సిందే
పవన్ కల్యాణ్ చేసిన వాటిలో చాలావరకు రీమేక్ సినిమాలే ఉంటాయి. తెలుగు మూవీస్ గురించి తెలిసిన ఎవరిని అడిగినా సరే ఈ విషయం ఇట్టే చెప్పేస్తారు. బయటకు అనుకోరు గానీ ఫ్యాన్స్ అయితే దీని గురించి ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. మళ్లీ ఎక్కడ చెబితే పక్కనోడు ఫీలవుతాడని అస్సలు బయటపెట్టరు. అలానే పవన్ ఏ సినిమా చేసినా సరే స్టోరీతో సంబంధం లేకుండా అందులో కచ్చితంగా హీరోయిన్ ఉండి తీరాల‍్సిందే. 'వకీల్ సాబ్'నే తీసుకోండి.. స్టోరీకి హీరోయిన్ అవసరం లేదు అయినాసరే శ్రుతిహాసన్‌ని తీసుకొచ్చారు. ఓ పాట, లవ్ ట్రాక్ పెట్టారు.
(ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!)
పార్వతికి గిఫ్ట్
పవన్ కల్యాణ్‌కి ఉన్న ఒకటో రెండో హిట్స్‌లో 'జల‍్సా' ఒకటి. డైరెక్టర్ త్రివిక్రమ్ పుణ్యామా అని అది హిట్ అయిపోయింది. ఇకపోతే ఈ సినిమాలో పవన్‌కి హీరోయన్లుగా ఇలియానా, పార్వతి మెల్టన్ చేశారు. అయితే షూటింగ్ టైంలో పవన్-పార్వతికి ఎక్కడో కుదిరిసిందనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి. దానికి ఓ కారణముంది. అప్పట్లో ఓ పేపర్ లో వచ్చిన కథనం ప్రకారం.. 'జల్సా' రిలీజైన తర్వాత ఓ సందర్భంలో, హీరోయిన్ పార్వతి మెల్టన్ వద్దూ వద్దంటున్నాసరే రూ.24 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్‌ని పవన్ ఆమెకి గిఫ్ట్‌గా ఇచ్చాడట.
2 గంటలు హోటల్‌లో?
తొలుత డైమండ్ నెక్లెస్‌ని పవన్ ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడో ఏమో అని పార్వతి సింపుల్‌గా నో చెప్పేసిందట. కానీ తనని ఓ ఫ్రెండ్‌లా భావించమని, అలా ఈ నెక్లెస్ తీసుకోమని పవన్ ఆమెతో అన్నాడట. ఇది జరిగిన తర్వాత వీళ్లిద్దరూ ఓ హోటల్‌లో దాదాపు 2 గంటలు పాటు కలిసి భోజనం చేశారట. అంతే కాకుండా స్వయంగా పార్వతి మెల్టన్‌ని పవన్ తన కారులో ఎక్కించుకుని ఎయిర్ పోర్ట్‌లో డ్రాప్ చేసి వచ్చాడట. తర్వాత ఏమైందో ఏమో గానీ పార్వతి టాలీవుడ్ లో ఎక్కడా కనిపించలేదు. దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన తాలుకు పేపర్ క్లిప్ తాజాగా మరోసారి వైరల్ అయింది. అలా ఇది నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది.
(ఇదీ చదవండి: రజనీ, కమల్ తో నటించిన హీరోయిన్.. చివరకు ఎయిడ్స్‌తో!)
Comments
Please login to add a commentAdd a comment