Sai Dharam Tej Says Killi Killi Song Only For Promotion Not In BRO Movie - Sakshi
Sakshi News home page

Bro Movie: ఫ్యాన్స్‌ డిసప్పాయింట్.. హీరో అలా చెప్పడంతో!

Published Thu, Jul 27 2023 12:09 PM | Last Updated on Thu, Jul 27 2023 12:39 PM

Killi Killi Song Not Feature Bro Movie Pawan Kalyan - Sakshi

'ఆచార్య' తర్వాత మెగాహీరోలు చేస్తున్న మల్టీస్టారర్ 'బ్రో'. యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, పవన్ కల్యాణ్ హీరో కంటే తక్కువ-అతిథి పాత్ర కంటే ఎక్కువ ఉండే రోల్ చేశాడు. ఈ శుక్రవారం అంటే జూలై 28న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ వరకు ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. మిగతా ప్రేక్షకులు మాత్రం 'బ్రో' మీద 50-50 నమ్మకంతో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో హీరో సాయిధరమ్ తేజ్.. ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ చెప్పాడు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు)

2021 డిసెంబరులో విడుదలైన సినిమా 'వినోదయ సీతం'. సముద్రఖని నటించి, దర్శకత్వం వహించిన ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. 99 నిమిషాల నిడివితో ఉన్న ఈ చిత్రం.. తెలుగులోనూ డబ్ అయింది. దీన్ని తెలుగులో 'బ్రో'గా రీమేక్ చేశారు. ఇక్కడ కాస్త డ్యూరేషన్ పెంచారు. ఒరిజినల్‌లో ఓ పెద్దాయన పాత్ర-సముద్రఖని ఉంటారు. ఇందులో పెద్దాయన స్థానంలో సాయితేజ్, సముద్రఖని ప్లేసులో పవన్ వచ్చారు.

విడుదలకి వారం ముందు కూడా 'బ్రో'పై పెద్దగా హైప్ లేదు. దీంతో పవన్ పాత పాటని మరోసారి రీ క్రియేట్ చేశారు. 42 సెకన్లున్న ఈ వీడియోని తాజాగా రిలీజ్ చేయగా, కాస్తంత హైప్ వచ్చింది. అయితే ఈ సాంగ్ సినిమాలో ఉంటుందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశారు. ఇప్పుడు వాళ్లకు షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇది జస్ట్ ప్రమోషనల్ సాంగ్ మాత్రమే. అదే విషయాన్ని సాయిధరమ్ తేజ్.. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. దీన్నిబట్టి 'బ్రో' ఫ్యాన్స్.. ఆ పాట బిగ్ స్క్రీన్ పై కష్టమే. అంతగా చూడాలనుకుంటే యూట్యూబ్‌లో చూసుకోండి.

(ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్‌సేన్ కౌంటర్స్.. కానీ!?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement