పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న టాలీవుడ్ బిగ్గీస్ చాలా ఎక్స్పెక్టేషన్స్‌తో రాబోతుంది. ఈ సినిమా నుండి ఏ వీడియో రిలీజ్ చేసినా కూడా రికార్డ్స్ బ్రేక్ చేస్తూ... ట్రెండింగ్‌లో నిలుస్తుంది. భీమ్లా నాయక్‌కు ఇంత క్రేజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. పవన్ గత సినిమా ‘వకీల్ సాబ్’ హిట్, ఇది మలయాళీ సూపర్ హిట్ ‘అయ్యుప్పున్ కోషియమ్’కి రీమేక్‌గా తెరకెక్కడం. రానా కూడా ఈ సినిమాలో నటిస్తుండడం. థమన్ మొదలుకుని అనేకమంది టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి వర్క్ చెయ్యడం.
చదవండి: PSPK28: 'భవదీయుడు భగత్ సింగ్'గా పవన్ కల్యాణ్
అయితే వీటన్నిటితో పాటు మరొక ముఖ్యమైన ఫ్యాక్టర్ త్రివిక్రమ్ భీమ్లా నాయక్‌కు సపోర్ట్ గా నిలబడడం. ముందు త్రివిక్రమ్ ఈ సినిమాకి కేవలం స్క్రిప్ట్ మాత్రమే అందిస్తాడు అని చెప్పారు. పవన్ కూడా ఆ కండిషన్ మీదే ఈ సినిమా రీమేక్‌కు ఒప్పుకున్నాడు. అయితే ఎన్టీఆర్‌తో మొదలవ్వాల్సిన ఈ సినిమా అనుకోకుండా పోస్ట్‌పోన్ అవ్వడంతో భీమ్లా నాయక్‌కు క్రియేటివ్‌గా కూడా సపోర్ట్ ఇస్తున్నాడు. అందుకే ఈ సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా పాజిటివ్ ఒపీనియన్‌తో ఉన్నారు. కాకపోతే త్రివిక్రమ్ రైటర్‌గా, పవన్ కల్యాణ్ హీరోగా గతంలో ఒక సినిమా తెరకెక్కింది.
చదవండి: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా?
అదే ‘తీన్‌మార్’... బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘లవ్ ఆజ్ కల్’ కి రీమేక్ గా ఆ సినిమా తీశారు. దానికి కూడా త్రివిక్రమ్ రైటింగ్ బాధ్యతలు తీసుకున్నాడు... అలాగే కోటి రూపాయలు తీసుకున్న ఫస్ట్ టాలీవుడ్ రైటర్‌గా కూడా ఫేమస్ అయ్యాడు. ‘తీన్‌మార్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమయిన ఫ్లాప్‌గా నిలిచింది. ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో, అదే కాంబోతో భీమ్లా నాయక్ కూడా తెరకెక్కుతుండడంతో ఈ జంట ఈ సారి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి హిట్ అందుకుంటారా అనే డౌట్ వ్యక్తం అవుతుంది. దీనికి ఆన్సర్ తెలియాలంటే మాత్రం భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment