
మహేష్ మూవీకి భారీ ఆఫర్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అదే స్థాయిలో భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్లు క్రియేట్ చేస్తుంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు సినిమా ఆడియో రిలీజ్తో పాటు శాటిలైట్ రైట్స్ను కలిపి ఓ టీవీ ఛానల్ భారీ మొత్తానికి సొంతం చేసుకుందన్న ప్రచారం జరుగుతోంది. అది కూడా బాహుబలి రెండో భాగంగా కన్నా మహేష్ సినిమాకు ఎక్కువ మొత్తం ఆఫర్ చేసి రైట్స్ సొంతం చేసుకున్నారట.
ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న మహేష్, మురుగదాస్ల సినిమా ఆడియో, శాటిలైట్ రైట్స్ కోసం ఓ టీవీ ఛానల్ 26 కోట్లు ఆఫర్ చేసిందట. మహేష్, మురుగదాస్ల కాంబినేషన్ పై ఉన్న అంచనాలతో పాటు ఈ సినిమా 100 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతుండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. సూపర్ స్టార్ అభిమానులు మాత్రం ఈ వార్తలతో పండుగ చేసుకుంటున్నారు.