సూపర్ స్టార్ స్టామినా : 12 రోజుల్లో 150 కోట్లు | Mahesh Babu spyder 150 crores Gross | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ స్టామినా : 12 రోజుల్లో 150 కోట్లు

Published Sun, Oct 8 2017 12:38 PM | Last Updated on Sun, Oct 8 2017 9:48 PM

Spyder 150 crores

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం భారీగా వస్తున్నాయి. తెలుగు నాట పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమా మంచి రివ్యూస్ వచ్చాయి. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి.

తొలి రోజు రికార్డ్ కలెక్షన్లు సాదించిన స్పైడర్ కు ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ప్రతినాయకుడిగా అలరించాడు. తమిళనాట ఈ వారం సినిమా రిలీజ్ లు ఆగిపోవటం కూడా స్పైడర్ కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement