మురుగదాస్ భారీ ప్రాజెక్టు | Murugadoss multi starrer with Mahesh babu, vijay | Sakshi
Sakshi News home page

మహేష్, విజయ్ లతో మురుగదాస్ మల్టీ స్టారర్

Published Sun, Oct 1 2017 1:11 PM | Last Updated on Sun, Oct 1 2017 5:55 PM

Mahesh Vijay Murugadoss

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను తెరకెక్కించిన మురుగదాస్, తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచినా కోలీవుడ్ లో మాత్రం సత్తా చాటాడు. అయితే త్వరలో ఈ స్టార్ డైరెక్టర్ ఓ భారీ ప్రయోగానికి రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ విజయ్ హీరోగా వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన మురుగదాస్.. మహేష్ బాబు, విజయ్ ల కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు.  ఈ విషయాన్ని స్పైడర్ తమిళ ప్రమోషన్ సందర్భంగా మురుగదాస్ ప్రకటించారు.

అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాలో తెలుగు వర్షన్ కోసం మహేష్ బాబు హీరోగా, విజయ్ విలన్ గా నటిస్తే, తమిళ వర్షన్ లో విజయ్ హీరోగా మహేష్ బాబు విలన్ గా నటిస్తారట. మరి ఈ భారీ ప్రయోగం నిజంగానే సెట్స్ మీదకు వస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement