ముందు కమల్‌.. తరువాతే రజనీ | Kamal Vishwaroopam 2 To Be Release Before Rajini Kaala | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 19 2018 12:49 PM | Last Updated on Thu, Apr 19 2018 1:51 PM

Kamal Vishwaroopam 2 To Be Release Before Rajini Kaala - Sakshi

కోలీవుడ్ ఇండస్ట్రీ సమ్మె విరమిస్తున్నట్టుగా ప్రకటించటంతో సినిమాల రిలీజ్‌కు లైన్‌ క‍్లియర్‌ అయ్యింది. అయితే ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్‌ అవుతాయన్న కన్య్ఫూజన్‌ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా, కమల్‌ హాసన్‌ స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన విశ్వరూపం 2 సినిమాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉన్నాయి. ఇద్దరు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న అగ్ర తారలు కావటంతో ఈ రెండు సినిమాలు ఎ‍ప్పుడు రిలీజ్‌ అవుతాయని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.

కోలీవుడ్ సమాచారం మేరకు ముందుగా విశ్వరూపం 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుందట. విశ్వరూపం 2 సెన్సార్‌ కార్యక్రమాలు ముందుగా పూర్తయినందున ఆ సినిమానే ముందుగా విడుదల అవుతుందని తెలుస్తోంది. మే నెలలో విశ్వరూపం 2ను విడుదల చేసి తరువాత జూన్‌లో రజనీకాంత్ కాలాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం చిత్ర నిర్మాతలు ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement